ఆ టాప్ స్టార్ హోటల్స్ లో “13 వ అంతస్తు” ఉండదు! ఎందుకో తెలుసా?

5 స్టార్ హోటల్ అంటే అడ్డాల మేడలు లాగా ఉంటాయి. పెద్ద పెద్ద పట్టణాల్లో ఇవి చాలా ఉంటాయి. ఒకదాన్ని మించి మరొకటి అత్యద్భుతంగా ఉంటాయి. కొన్నిట్లో పది అంతస్తులు ఉంటే మరికొన్నిటిలో 40 నుండి 50 అంతస్తుల వరకు కూడా ఉంటాయి. అంత పెద్ద భవనంలోకి మనం ఎప్పుడైనా వెళితే కచ్చితంగా లిఫ్ట్ ఎక్కుతాము. ఏ ఫ్లోర్ కావాలో ఆ ఫ్లోర్ లో దిగుతాము. కానీ ముంబై లోని ఆ మూడు హోటల్స్ లో 13 వ అంతస్తులో మాత్రం ఎవరు దిగలేరు. ఎందుకంటే ఆ హోటల్ లో 13 వ అంతస్తు ఉండదు. బహుశా హోటల్ పది అంతస్తుల బిల్డింగ్ అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు పప్పులో కాలు వేసినట్టే! ఎందుకంటే అది ముప్పై అంతస్తుల హోటల్…కానీ పదమూడవ ఫ్లోర్ మాత్రం ఉండదు. అదెలా సాధ్యమైందో చూడండి!

మనం ఎంత ఎదిగినా భారతీయులుగా మనకి కొన్ని నమ్మకాలు ఉండటం సహజం. అదే నమ్మకాన్ని మనం ఫాలో అవుతాము. అవి మూఢనమ్మకాలు చెప్పిన మనం పట్టించుకోము. ఇప్పుడైనా కొద్దిగా పర్లేదు కానీ, అదే మన పూర్వీకుల కాలంలో అయితే ఇలాంటి నమ్మకాలు మరింత ఎక్కువగా ఉండేవి. అదే నమ్మకాన్ని ఫాలో అయ్యారు ఆ మూడు హోటల్ ల ఓనర్లు! ఆ హోటల్ ఓనర్ల నమ్మకం ఏంటంటే

“13 సంఖ్య అనేది దురదృష్టం కి సంకేతం. ఏదైనా నెలలో 13 వ తారీకు శుక్రవారం గాని వచ్చింది అనుకోండి. పెద్ద నష్టం జరుగుద్ది అని భావిస్తారు.”

 


అందుకే 13 సంఖ్యకు అసుర శక్తి ఉందని నమ్మి ఆ హోటల్ లో 13 వ అంతస్తు పెట్టలేదు. నిజానికి 30 అంతస్తులు నిర్మించారు. లెక్కపెట్టుకుంటూ వెళితే ఒకటి, రెండు, మూడు ….పదమూడు కూడా లెక్కపెడతాము. కానీ 13 వ అంతస్తుకి వాళ్ళు 14 వ అంతస్తు అని పెట్టారు. అంటే 12 వ ఫ్లోర్ తరవాత 14 వ ఫ్లోర్ వస్తుంది అన్నమాట!. లిఫ్ట్ లో కూడా 12 తరవాత 14 ఉంటుంది. 13 మాత్రం ఉండదు. ఇలా ఒక్క హోటల్ కాదు, ఏకంగా మూడు హోటల్స్ ఉన్నాయి. మళ్లీ అన్ని టాప్ హోటల్స్! “ట్రిడెంట్ హోటల్, హొయెస్ట్ హౌస్, మేకర్ ఛాంబర్”…ఇవి ఆ మూడు హోటళ్ల పేర్లు!

Comments

comments

Share this post

scroll to top