సినిమా ప్రమోషన్ కోసం “సింహాచలం” గుడికి వెళ్తే…”నితిన్” పై దొంగతనం ఆరోపించారు.! చివరికి ఏమైందో తెలుసా?

దొంగతనం చేసిన నితిన్..సింహాచలం దేవస్థానంలోని ఆలయంలో స్వామివారి ఉంగరం దొంగిలించారని అక్కడి పూజారులు నితిన్ పై ఆరోపించారు..అంతేకాదు ఉంగరం ఇచ్చేవరకు పంపించేది లేదని తాళ్లతో కట్టేసి బంధించారు..నేను తీయలేదు అంటూ నితిన్ చెప్తున్నా వినకుండా,స్వామి వారి ఉంగరం పోయింది అది దొరికే వరకు ఎవరిని వదిలే ప్రసక్తే లేదని ఖరాఖండిగా చెప్పడంతో అవాక్కవడం నితిన్ వంతైంది..నితిన్ దొంగతనం చేయడం ఏంటి..ఏదన్నా షూటింగ్లో భాగం అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే..ఇది షూటింగ్ కాదు.నిజంగానే నితిన్ సింహాచలం వెళ్లారు.అక్కడ దొంగతనం చేశారు..అక్కడి వారు తాళ్లతొొ కట్టేశారు..ఇది నిజం…

నితిన్ ,మేఘా ఆకాశ్ జంటగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో వస్తున్న ‘ఛల్ మోహన్ రంగ’ రిలీజ్ కి సిధ్దమైంది.ఈ చిత్రం ప్రీ రిలీజ్ టూర్‌లో బిజీగా ఉన్నారు నితిన్ సహ చిత్రయూనిట్. విడుదల తేదీ దగ్గరపడటంతో తన సినిమాకు వీలైనంత ఎక్కువ ప్రచారం కల్పిస్తున్నా డు నితిన్ .అందులో భాగంగానే చిత్ర యూనిట్ తో విశాఖపట్నం వెళ్లారు.అక్కడ సింహాచలం దేవస్థానాన్ని దర్శించుకున్నారు..అక్కడ పూజారులు నితిన్ పై దొంగతనం ఆరోపించారు.పాపులర్ హీరో అయిన మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదని ,స్వామివారి ఉంగరం ఇచ్చేయండి అనడంతో . ‘నేను తియ్యలేదండి. కావాలంటే చెక్ చేసుకోండి’ అంటూ సమాధానమిచ్చారు. నేను తీయలేదని నితిన్ కరాఖండిగా చెప్పడంతో అర్చకులు మిగిలిన భక్తులతో ‘శనివారం రాత్రి స్వామివారి ఉంగరం పోయింది. దొంగలెవరో కనిపెట్టో పనిలో ఉన్నాం. మాకు ఉంగరం దొరికే వరకు మీరు బందీలుగా ఉండాల్సిందే’ అంటూ హుకుం జారీ చేశారు. దీంతో నితిన్‌తో పాటు మరికొంత మంది బందీలుగా అక్కడే ఉండిపోయారు.అయితే ఒకవైపు దొంగతనం నేరం పడిందని నితిన్ తో బంధీలైన వారు టెన్షన్ పడుతుంటే ఆ తతంగం చూస్తున్నవారు మాత్రం నవ్వుతున్నారు.ఇంతకీ వారెందుకు నవ్వుతున్నారు అసలు రీజన్ ఏంటంటే…

అసలు దొంగ ఎవరు?

సింహాద్రి అప్పన్న వార్షిక కళ్యాణోత్సవాల్లో భాగంగా చివరి రోజు వినోదోత్సవం నిర్వహిస్తారు. దీనిలో భాగంగా స్వామి వారి ఉంగరాన్ని ఎవరో దొంగిలించారని కొంత మంది భక్తులను బంధించి ఆటపట్టిస్తారు. ఇది ప్రతి ఏటా జరిగే తంతే. కాకపోతే ఈసారి నితిన్ బుక్కయ్యారు. అర్చకులు అసలు విషయం బయటపెట్టడంతో నితిన్ ఊపిరి పీల్చుకున్నారు. స్వామి వారి దర్శనం తర్వాత నితిన్ సినిమా ప్రచారానికి వెళ్లారు.

Comments

comments

Share this post

scroll to top