ముఖేష్ అంబానీ భార్య “నీతా అంబానీ” ఒక రోజు బ‌య‌ట‌కు వెళ్తే అయ్యే ఖ‌ర్చు ఎంతో తెలుసా..?

నీతా అంబానీ.. ఈమె పేరు తెలియ‌ని వారుండ‌రు అంటే అతియోశ‌క్తి కాదేమో. కేవ‌లం ఐపీఎల్ టోర్న‌మెంట్ స‌మ‌యంలో మాత్ర‌మే కాదు, ఇతర సంద‌ర్భాల‌ప్పుడు కూడా ఈమె మన‌కు క‌నిపిస్తుంటుంది. ముఖ్య‌మైన అకేష‌న్ల స‌మ‌యంలో వార్త‌ల్లో నిలుస్తుంటుంది. అయితే ముఖేష్ అంబానీ భార్య‌గా నీతా అంబానీకి ఎలాంటి ల‌గ్జ‌రీ స‌దుపాయాలు ఉంటాయో అంద‌రికీ తెలిసిందే. ఆమె ఇంట్లో ఉన్నా, ఇంటి నుంచి కాలు బ‌య‌ట పెట్టినా ఒకే లాంటి సౌక‌ర్యాలు ఆమెకు అందుతాయి. ఈ క్ర‌మంలోనే ఆమె నిత్యం ఎంత ఖ‌ర్చు చేస్తారో, ఆమె వాడే ప‌లు వ‌స్తువుల ఖ‌రీదు ఎంత ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

నీతా అంబానీ వేసుకునే దుస్తులు, ధ‌రించే చెప్పులు, ఇయ‌ర్ రింగ్స్‌, గాజులు, తిరిగే కార్లు.. ఇలా అనేక వ‌స్తువులు చాలా ఖ‌రీదు క‌ల‌వి. వ‌రల్డ్ క్లాస్‌కు చెందిన బ్రాండ్ల వ‌స్తువుల‌నే ఆమె వాడుతారు. ఆమె శ‌రీరంపై ఎప్పుడూ ఉండే ఆయా వ‌స్తువులు, దుస్తులు ధ‌ర రూ.10 ల‌క్ష‌ల నుంచి రూ.10 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని అంచనా. ఉద‌యం లేవ‌గానే నీతా అంబానీ టీ తాగే క‌ప్పు విలువ సుమారుగా రూ.3 ల‌క్ష‌లు ఉంటుంద‌ట‌. ఎందుకంటే ఆ టీ క‌ప్పు బార్డ‌ర్స్ అన్నీ బంగారం పూత పూయ‌బ‌డి ఉంటాయి. ఆ క‌ప్పుల‌ను జ‌పాన్‌కు చెందిన ఓ కంపెనీ త‌యారు చేస్తుంద‌ట‌. ఆ క‌ప్పులు 50 ఉండే ఒక సెట్ ఖ‌రీదు రూ.1.50 కోట్లు ఉంటుంది. ముందుగా ఆర్డ‌ర్ చేస్తే గానీ వాటిని ఆ కంపెనీ త‌యారు చేయ‌దు.

నీతా అంబానీ వాడే హ్యాండ్ బ్యాగ్ ఖ‌రీదు రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంటుంద‌ట‌. ఆమె ధ‌రించే చెప్పుల కాస్ట్ రూ.1 ల‌క్ష వ‌ర‌కు ఉంటుంది. ఇక నీతా అంబానీ ఒక‌సారి వేసుకున్న దుస్తుల‌ను మ‌ళ్లీ వేసుకోద‌ట‌. క‌ల‌ర్ కాంబినేష‌న్ న‌చ్చితేనే రెండో సారి దుస్తుల‌ను వేసుకుంటార‌ట‌. ఆమె వాడే ఐఫోన్ ధ‌ర రూ.350 కోట్ల‌ట‌. ఎందుకంటే దాంట్లో అన్నీ డైమండ్స్ పొద‌గ‌బ‌డి ఉంటాయ‌ట‌. నీతా అంబానీకి పుట్టిన రోజు కానుక‌గా ఆమె భ‌ర్త ముఖేష్ అంబానీ ఏకంగా 62 బిలియ‌న్ డాల‌ర్లు ఖ‌రీదైన జెట్ ప్లేన్‌ను ఇచ్చార‌ట‌. దీంతోపాటు 2 చాప‌ర్స్‌, ఒక జెట్ ప్లేన్ కూడా ఆమెకు ఉన్నాయ‌ట‌.

నీతా అంబానీ నివ‌సించే ఇల్లు ఖ‌రీదు రూ.2 వేల కోట్ల‌కు పైగానే ఖ‌రీదు చేస్తుంద‌ని టాక్‌. ఇందులో 27 అంత‌స్తులు ఉంటాయి. ఒక్కో అంత‌స్తుకు ఒక్కో ప్ర‌త్యేక‌త ఉంటుంది. ఈ భ‌వంతిలో ఏకంగా ఒకేసారి 120 కార్ల‌ను పార్క్ చేయ‌వ‌చ్చు. దీంట్లో థియేట‌ర్‌, స్విమ్మింగ్ పూల్స్ త‌దిత‌ర అన్ని సౌక‌ర్యాలు ఉన్నాయి. రూ.3 కోట్ల విలువ చేసే బెంట్లే, 5 కోట్ల మేబ్యాక్ 62, రూ.50 కోట్ల విలువ చేసే డైమండ్ కోటెడ్ కార్లు ఉన్నాయి. ఇప్పటికే అంబానీ కుటుంబానికి జడ్‌ ప్లస్ సెక్యూరిటీ ఉంది. ఇక నీతా ఎక్కడికి వెళ్లిన ఆమె చుట్టూ 6 మంది గార్డ్స్ ఉంటారు. ఒకసారి నీతా అంబానీ బయటకి వెళ్ళితే ఆరోజు అయ్యే ఖర్చు రూ.10 లక్షల వ‌ర‌కు ఉంటుంద‌ట‌.

ఇక నీతా అంబానీకి ఇంత అదృష్టం రావడానికి, అన్ని లగ్జ‌రీ స‌దుపాయాలు ల‌భించ‌డానికి కారణం భ‌ర్త ముఖేష్‌ అంబానీ అని అంద‌రికీ తెలుసు. ఒక సారి నీతా అంబానీ ఇచ్చిన భ‌ర‌త నాట్య ప్ర‌ద‌ర్శ‌న చూసి మ‌న‌స్సు పారేసుకున్న ముఖేష్ అంబానీ ఆమె స్నేహితుల ద్వారా ధీరూభాయ్ అంబానీ కొడుకుని అని చెప్పి నీతా ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. ఆమెకు ఫోన్ చేసి నేను ధీరూభాయ్ అంబానీ కొడుకుని అని చెప్పి ప‌రిచ‌యం ప్రారంభించాడు. త‌రువాత ముఖేష్ తండ్రి ధీరూభాయ్ అంబానీ మాట్లాడ‌డంతో నీతాకు, ముఖేష్‌కు పెళ్లయింది. త‌రువాత ఇక ఏం జ‌రిగిందో మ‌నంద‌రికీ తెలుసు..!

Comments

comments

Share this post

scroll to top