నిషిత్ న‌డిపిన కారు ప్ర‌పంచంలో అత్యంత సేఫ్టీ క‌లిగిన కార‌ట తెలుసా..?

ఏపీ మంత్రి నారాయ‌ణ కుమారుడు నిషిత్ ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విష‌యం విదిత‌మే. అతి వేగంగా కారు న‌డుపుతూ హైద‌రాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నం.36లో మెట్రో పిల్ల‌ర్‌ను ఢీకొన‌డంతో అత‌ను, అత‌నితోపాటు మ‌రో అత‌ని స్నేహితుడు కూడా అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. ప్ర‌మాదానికి కార‌ణం కారును అతి వేగంగా న‌డ‌ప‌డ‌మే అని నిర్దారించారు కూడా. ఎయిర్‌బ్యాగ్స్ ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌మాద తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌డంతోనే వారు మృతి చెందిన‌ట్టు వైద్యులు కూడా చెప్పారు. అయితే మీకు తెలుసా..? నిజంగా చెప్పాలంటే… ప్ర‌పంచంలోనే అత్యంత సుర‌క్షిత‌మైన ప్ర‌మాణాలు క‌లిగిన కారు అదేన‌ట‌. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..!

మంత్రి నారాయ‌ణ కుమారుడు నిషిత్ న‌డిపిన కారు మెర్సిడెస్ కంపెనీకి చెందిన బెంజ్ కారు. దాని పేరు మెర్సిడెస్ ఏఎంజీ జీ63. దీని ధ‌ర సుమారు రూ.2.50 కోట్లు ఉంటుంది. అయితే ఈ కారులో ఉండే ఫీచ‌ర్లు కూడా అదే రేంజ్‌లో ఉంటాయి తెలుసా..? కేవ‌లం 5.4 సెక‌న్ల‌లోనే కారు 100 కిలోమీట‌ర్ల వేగాన్ని అందుకోగ‌ల‌దు. 571 హెచ్‌పీ ఇంజిన్‌ను ఈ కారు క‌లిగి ఉంది. ఇంజిన్ జ‌న‌రేట్ చేసే శ‌క్తి అక్ష‌రాలా 420 కిలోవాట్స్‌. దాదాపుగా గంట‌కు 230 కిలోమీట‌ర్ల వేగంతో ఈ కారును న‌డ‌ప‌వ‌చ్చు. ఇందులో 8 సిలిండర్లు ఉంటాయి. 6400 ఆర్‌పీఎంను ఈ కారు ఇంజిన్ క‌లిగి ఉంటుంది. మొత్తం 32 క్వింటాళ్ల బ‌రువుండే ఈ కారు 4.6 మీట‌ర్ల పొడ‌వు, 1.9 మీట‌ర్ల ఎత్తు ఉంటుంది.

నిషిత్ న‌డిపిన ఈ మెర్సిడెస్ ఏఎంజీ జీ63 కారు ప్ర‌పంచంలోనే అత్యంత ఎక్కువ సేఫ్టీ ఉన్న కార‌ట‌. అన్ని టెస్టులు చేశాకే దీన్ని రిలీజ్ చేస్తారు. ఈ క్ర‌మంలో అంత‌టి సేఫ్టీ క‌లిగిన కారు కూడా తుక్కు తుక్క‌యింది. ఇంజిన్ మొత్తం బ‌య‌టికి ఊడి వ‌చ్చింది, అంటే ప్ర‌మాద తీవ్రత ఏ రేంజ్‌లో అయి ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అంతటి సేఫ్టీ ప్ర‌మాణాలు క‌లిగిన కారు కూడా వారిని ర‌క్షించ‌లేక‌పోయింది అంటే, వారు ఏ వేగంలో వెళ్లారో మ‌న‌కు తెలిసిపోతుంది. అందుకే వారు అలా మృత్యువు ఒడిలోకి చేరారు. చూశారుగా..! అతి వేగం ఎంత ప‌ని చేసిందో. అలాంట‌ప్పుడు ఇక ఎంత‌టి సేఫ్టీ కారులో ఉన్నా దానికి ఎవ‌రూ ఏమీ చేయ‌లేరు..!

Comments

comments

Share this post

scroll to top