“నిషిత్” తో పాటు మరణించిన స్నేహితుడు “రాజా” ఎవరో తెలుసా..? వారిద్దరు స్నేహితులు ఎలా అయ్యారో తెలుసా..?

ఆ ఇద్దరు ప్రాణ స్నేహితులు. బహుశా అందుకే అనుకుంట మరణంలో కూడా ఇద్దరు ఒకర్ని ఒకరు విడువలేదు అనుకుంట. అతి వేగం కారణంగా పిల్లర్ ను ఢీకొని ఆక్సిడెంట్ లో మృతి చెందిన “మంత్రి నారాయణ” కుమారుడు “నిషిత్”, రాజారవిచంద్ర చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు. పార్టీ కైనా, టూర్ కి అయినా ఇద్దరు కలిసే వెళ్లే వారు. ఆ రెండు కుటుంబాల్లోనూ వీరే మగపిల్లలు కావడంతో కుటుంబ సభ్యులు, స్నేహితుల్లో అంతులేని ఆవేదనను నింపింది.

నారాయణ కొడుకు నిషిత్ నెల్లూరులో 1994 జులై 4న జన్మించాడు. ఎనిమిదవ తరగతి వరకు నారాయణ విద్యాసంస్థలో చదివి, 9 , 10 తరగతులు మిర్యాలగూడలో ప్రైవేట్ పాఠశాలలో చదివాడు. బెంగళూరులో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తరవాత సింగపూర్ లో బిబిఐ పూర్తి చేసాడు. ఇటీవలే నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ గా పదవి చేపట్టాడు.

టంగుటూరుకు చెందిన పారిశ్రామికవేత్త కామని బాలమురళీమోహనకృష్ణ, సుభాషిణిల ఏకైక కుమారుడు రాజా రవిచంద్ర. వీరికి లేఖ అనే కుమార్తె ఉన్నారు. రవిచంద్ర 1995లో మే 17న జన్మించాడు. స్కూలు (తొమ్మిదవ తరగతి ఇండస్ స్కూల్) నుండే రాజా, నిషిత్ మంచి స్నేహితులు. ఆ పరిచయం ప్రాణ స్నేహితులను చేసింది. తర్వాత ఇద్దరూ హైదరాబాద్‌లోనే ఇంటర్నేషనల్‌ బ్యాక్యులరేట్‌ డిప్లొమా ప్రొగాం(ఐబీడీపీ) పూర్తి చేశారు. తండ్రి కోరిక మేరకు రవిచంద్ర సింగపూర్‌లో బ్యాచిలర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌(బీబీఏ) పూర్తి చేశారు. చదువు పూర్తికాగానే టంగుటూరులోనే తండ్రి వద్ద ఉంటూ పొగాకు వ్యాపారంలో మెలకువలు నేర్చుకుంటూ ఏడాదిపాటు గడిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు. త్వరలో వ్యాపార బాధ్యతలు అప్పగించాలని తండ్రి బాలమురళీమోహనకృష్ణ భావిస్తుండగానే రవిచంద్ర తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఇటీవలే నిషిత్ పుట్టినరోజుకు రాజా బైక్ గిఫ్ట్ గా ఇచ్చాడు.

Comments

comments

Share this post

scroll to top