శ్రీరెడ్డి లీక్స్: ఆ ప్రముఖుడితో రొమాన్స్ ఫోటోలు లైవ్‌లో..! ఇంకెవరి పేర్లు చెప్పిందో చూడండి!

రెడ్డి మరో సంచలనానికి తెరతీసింది. తనతో చనువుగా ఉన్న టాలీవుడ్‌కి చెందిన ఓ ప్రముఖుడి ఫోటోలను లీక్ చేసింది. తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న లోగుట్టును ఒక్కొక్కట్టిగా బయటపెడుతూ గత కొంతకాలంగా సినీ ప్రముఖులకు నిద్రలు లేకుండా చేస్తున్న శ్రీరెడ్డి మరో అడుగు ముందుకు వేసింది. ఇటీవల హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌ ముందు అర్ధనగ్న ప్రదర్శన చేసిన శ్రీరెడ్డి అందరి జాతకాలను బయటపెడతానంటూ మంగళవారం నాడు ఓ మీడియా సంస్థ లైవ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తన వద్ద ఉన్న ఫోటోలను ఆ మీడియా సంస్థకు ఇచ్చింది. అయితే సదరు ఛానల్ ఆ వ్యక్తి ముఖం కనిపించకుండా ఫోటోలను బ్లర్ చేసి అవతల వాళ్ల వెర్షన్ కోసం వేసిచూస్తున్నామన్నారు.

అయితే శ్రీరెడ్డి ఆ వ్యక్తి గుట్టును బహిర్గతం చేయాలని ఛానల్‌ను పదే పదే లైవ్‌లో వేడుకున్నా సుమారు 5 గంటల పాటు ఆ ఫోటోలను టెలికాస్ట్ చేయలేదు. దీంతో శ్రీరెడ్డి సదరు ఛానల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే స్టుడియో నుండి నిష్క్రమించారు. అయితే సోషల్ మీడియాలో సదరు ఛానల్‌కి వ్యతిరేకంగా కామెంట్స్ వస్తుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ముఖాలు కనిపించకుండా ఫోటోలను టెలికాస్ట్ చేశారు.

Ammailam anna memu.. angatlo sarukulam kadhu..

Posted by Sri Reddy on Tuesday, 10 April 2018

అంతకు ముందు శ్రీరెడ్డి మాట్లాడుతూ.. తాను పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తున్నాననే రూమర్‌కి చెక్ పెట్టి.. ఈ సస్పెన్స్ కు తెరదించాలని భావిస్తున్నానన్నారు. ఇప్పటికే కొంతమంది పేర్లు బయటపెట్టానని ఇక మిగిలిన వారందరి పేర్లూ కూడా లైవ్‌లో మీడియా సాక్షిగా లైవ్‌లో బయటపెట్టబోతున్నానని ప్రకటించారు శ్రీరెడ్డి. అయితే తనను ఓ ప్రముఖ వ్యక్తి హైదరాబాద్‌లో ఉన్న ఓ ప్రముఖ స్టుడియోలోకి తీసుకువెళ్లి ఏంచేశాడో.. ఆ విషయాన్ని ఆధారాలతో సహా బయటపెడుతున్నా అంటూ సంచలన ప్రకటన చేసింది. అయితే ఆ బడా వ్యక్తి తరపున మా అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీరాజా రంగంలోకి దిగి తనకు డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేశారన్నారు. అయితే శ్రీరెడ్డి లీక్ చేసిన తాజా ఫోటోల్లోని ప్రముఖ వ్యక్తి ఎవరన్నదానిపై శ్రీరెడ్డి వ్యక్తిగత ఫేస్‌బుక్‌ ద్వారా సమాచారం తెలియజేసే అవకాశం ఉంది.

watch video here:

Comments

comments

Share this post

scroll to top