“నిర్భ‌య త‌ల్లి అందంగా, చ‌క్క‌ని ఆకృతిలో ఉంది! అందుకే ఆమె కూతురు.!?” డీజీపీ అయ్యుండి ఇంత నీచంగా..?

చ‌దువు, సంధ్య లేని వారు, అవి లేకున్నా.. చెడు అల‌వాట్లు, స్నేహాల బారిన ప‌డి విచ్చ‌ల‌విడిగా ప్ర‌వ‌ర్తించేవారు.. అంటే.. అడ్డ‌దిడ్డ‌మైన‌, అస‌భ్య‌క‌ర‌మైన‌, అనుచిత‌మైన మాట‌లు మాట్లాడుతారు. అది వారికి అల‌వాటే. కానీ నేటి త‌రుణంలో బాగా చ‌దువుకుని, ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేసే వారు కూడా చిల్ల‌ర బిహేవియ‌ర్‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నారు. వారి మాట తీరు కూడా అలాగే దిగ‌జారిపోతోంది. ఎంత గొప్ప చ‌దువులు చ‌దివితేనేం, ఎంత ఉన్న‌తమైన స్థానంలో, ప‌ద‌విలో ఉద్యోగం చేస్తేనేం, వారికి తెలివి మోకాళ్ల‌లో ఉన్న‌ప్పుడు, ఎలా మాట్లాడాలో, ఏం అనాలో తెలియ‌ని క‌నీసం ఇంగిత జ్ఞానం లేక‌పోతే వారు అంత గొప్ప బాధ్య‌త‌ల్లో ఉండి వేస్ట్‌. ఇంత‌కీ మేం ఏం చెబుతున్నామో ఇప్ప‌టికే మీకు ఓ ఐడియా వ‌చ్చే ఉంటుంది. అదేనండీ.. క‌ర్ణాట‌క రాష్ట్ర మాజీ డీజీపీ ఉన్నాడు క‌దా. ఆయ‌నే.. నిర్భ‌య‌, ఆమె త‌ల్లిపై, అత్యాచారాల‌పై కారు కూత‌లు కూశాడు. చివ‌ర‌కు నాలిక్క‌రుచుకున్నాడు. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే..

ఈ మ‌ధ్యే మార్చి 8వ తేదీన అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం జ‌రిగింది క‌దా. ఆ రోజున బెంగుళూరులో నిర్భ‌య అవార్డ్స్ 2018 కార్య‌క్ర‌మం జ‌రిగింది. దేశంలో ఆయా రంగాల్లో సేవ‌లందించిన ప్ర‌ముఖ మ‌హిళ‌ల‌కు, ధైర్య సాహ‌సాలు ప్ర‌ద‌ర్శించి నేరాలను ఎదుర్కొన్న మ‌హిళ‌ల‌కు అవార్డుల‌ను ఇస్తారు. అదే కార్య‌క్ర‌మం జ‌ర‌గ్గా దానికి క‌ర్ణాట‌క మాజీ డీజీపీ హెచ్‌టీ సంగ్లియానాను ముఖ్య అతిథిగా పిలిచారు. ఆయ‌న కూడా కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. దీంతో కార్య‌క్ర‌మంలో మాట్లాడ‌మ‌ని ఆయ‌న‌కు చెబితే ఆయన ఏమ‌న్నారో తెలుసా.. మీరే చూడండి..

చూశారు క‌దా. స‌ద‌రు మాజీ డీజీపీ గారు ఏమ‌న్నారో.. నిర్భ‌య త‌ల్లి బాగా అందంగా, చ‌క్క‌ని ఆకృతిలో ఉంటుంద‌ట‌. అందుక‌నే ఆమె కూతురు నిర్భ‌య (జ్యోతి సింగ్‌) కూడా అందంగా పుట్టింద‌ట‌. అందుక‌నే ఆమె అందాన్ని చూసి ఆ మృగాళ్లు ఆమెను రేప్ చేశార‌ట‌. ఇవీ.. హెచ్‌టీ సంగ్లియానా అన్న మాట‌లు. అలా ఆయ‌న అన‌గానే అక్క‌డ ఉన్న అంద‌రూ షాక్ తిన్నారు. కొంద‌రైతే న‌వ్వుకున్నారు. కొంద‌రు స‌భ నుంచి లేచి వెళ్లిపోయారు. ఇక స్టేజీ మీద ఉన్న ఎవ‌రో వ‌చ్చి ఆయ‌న‌కు చెవిలో ఏదో చెప్పార‌ట‌. అయినా ఆయ‌న త‌న మాట తీరు మార్చుకోలేదు. పైగా మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌పై మ‌ళ్లీ అనుచిత వ్యాఖ్య‌లు చేశారు.

మృగాళ్లు అఘాయిత్యం చేసే సంద‌ర్భంలో వారిది పై చేయి అయితే వారికి లొంగిపోవ‌డ‌మే బెట‌ర్ అని, త‌రువాత దానిపై పోలీస్ కంప్లెయింట్ ఇవ్వాల‌ని సంగ్లియానా సూచించారు. ఇక దాడి చేసే సందర్భంలో పెప్ప‌ర్ స్ప్రే వాడి త‌ప్పించుకోవ‌చ్చ‌ని చెప్పారు. అలాగే నేటి స‌మాజంలో మ‌హిళ‌లు అందంగా ఉండ‌డం శాప‌మైంద‌ని, వారు అందంగా ఉంటేనే ఇలాంటి అత్యాచార ఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయ‌ని, అందంగా ఉండే మ‌హిళ‌ల‌కు మ‌రింత ర‌క్ష‌ణ అవ‌స‌ర‌మ‌ని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. దీంతో సంగ్లియానా వ్యాఖ్య‌ల‌పై ఇప్పుడు దుమార‌మే రేగుతోంది. అయినా ఆయ‌న త‌న వ్యాఖ్య‌ల‌ను త‌ప్ప‌ని చెప్ప‌లేదు స‌రిక‌దా వాటిని స‌మ‌ర్థించుకున్నారు. ఇక ఈ విష‌యంపై మ‌హిళా సంఘాలు భ‌గ్గుమంటున్నాయి. ఆయ‌న బాధ్య‌తాయుత‌మైన పోలీస్ అధికారిగా ప‌నిచేశారు, ఇలాంటి వ్యాఖ్య‌ల‌ను ఎలా చేస్తార‌ని మ‌హిళ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. ఇక చివ‌ర‌కు ఈ వివాదం ఎక్క‌డికి దారి తీస్తుందో వేచి చూడాలి. అయినా కొంద‌రు ఇంతే.. పైనే చెప్పాం క‌దా. చ‌దువు, ఉన్న‌త ప‌ద‌వి ఇవేవీ వారికి సంస్కారం ఇవ్వ‌వు. అందుక‌ని అలాంటి వారు ఇలాగే మాట్లాడుతారు కూడా, ఇలాంటి వారు ప్ర‌భుత్వ ఉద్యోగులు అయినందుకు మ‌నం నిజంగా సిగ్గు ప‌డాల్సిందే..!

Comments

comments

Share this post

scroll to top