ఒకప్పుడు గొర్రెల కాపరి కట్ చేస్తే…..ఓ దేశానికి విద్యాశాఖ మంత్రి.!

కృషి ఉంటే మనుషులు రుషులవుతారు..మహాపురుషులవుతారు అనే వాక్యానికి అక్షర సత్యం….ఈ వార్త. తండ్రి తాపీ మేస్త్రీ…ఆయన సంపాదన మీదే ఇల్లు గడవాలి. ఇంట్లో ముగ్గురమ్మాయిలు. ఆరోగ్యం సరిగ్గా లేక తండ్రి పనికి వెళ్లలేదో ఆ రోజు ఆ కుటుంబానికి పస్తులు తప్పవు.!  ఇక చిన్నప్పటి నుండే కుటుంబ కష్టాలను ఆకలింపు చేసుకున్న పెద్దమ్మాయి నజత్ …కుటుండ  స్థితి గతుల ప్రకారం తెలుసుకొని నడుచుకునేది….ఈ కష్టాలకు చెక్ పెట్టాలంటే చదువు ఒక్కటే మార్గమని తలచి…రెగ్యులర్ గా స్కూల్ కు వెళ్తుండేది. స్కూల్ నుండి రాగానే , ఇంట్లో ఉన్న గొర్రెలను కాయడానికి వెళ్లేది…..పదిహేనేళ్ల వరకు ఆ పాప జీవితమంతా ఓ వైపు గొర్రెలు మరోవైపు పుస్తకాలతో బిజీబిజీగా ఉండేది.

వారు ఉంటున్న మోరాకో ప్రాంతంలో తీవ్ర కరువు రావడంతో………… బతుకుదెరువు కోసం ప్రాన్స్ కు వెళ్లారు నజత్ కుటుంబం.  ఫ్రాన్స్ కు వెళ్లడంతో నజత్ తన లక్ష్యం వైపు మరింత వేగంగా అడుగులు వేసింది.ఉన్నత చదువు-మంచి ఉద్యోగం- కటుంబ కష్టాలను దూరం చేయడం..ఇదే లక్ష్యంగా నజత్ తన సమయాన్ని చక్కగా వినియోగించుకోసాగింది.

minister

ఇంతలోనే నజత్ జీవితంలో అనుకోని సంఘటన తనకు పారిస్ యూనివర్సిటీలో సీటు రావడం. పారీస్ యూనివర్సిటీలో నజత్ తనకు ఎంతో ఇష్టమైన పొలిటికల్ స్టడీస్ లో డిగ్రీ పట్టా అందుకుంది. అక్కడే నజత్ రాజకీయాల వైపు ఆకర్షితురాలై, సోషలిస్ట్ పార్టీలో చేరింది….పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ…..ఇప్పుడు పారిస్ విద్యాశాఖ మంత్రిగా సేవలందిస్తుంది నజత్.  గొర్రెల కాపరి నుండి విద్యాశాఖ మంత్రిగా  ఎదిగిన నజత్ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయం.

నజత్ రాజకీయ మైలురాళ్లు – ఎదిగిన విధానం:

 

  • 2002లో  ఆ తర్వాత సోషలిస్ట్ పార్టీలో చేరిక.
  • 2003లో  కార్యకర్తగా కీలకపాత్ర ,పౌర హక్కుల కోసం అలుపెరుగని పోరాటం.
  • 2004లో రోన్ ఆల్ఫేస్‌కి రీజనల్ కౌన్సిల్‌గా ఎంపిక
  • 2006లో సోషలిస్ట్ పార్టీకి ముఖ్య సలహాదారుగా సేవలు.
  • 2007లో కు స్పోక్ ఉమెన్‌గా…
  •  2012లో క్యాబినెట్ మంత్రి, మహిళా హక్కుల అధికార ప్రతినిధిగా……
  • 2014లో చిన్న వయస్సులోనే మొదటి మహిళావిద్యాశాఖ మంత్రిగా ఎంపిక.

Comments

comments

Share this post

scroll to top