తొమ్మిదేళ్ల పిల్లాడు,ఇరవై ఏళ్ల అమ్మాయికి మధ్య ప్రేమ,పెళ్లేమిటి అని…. సోనీ సీరియల్ పై విరుచుకుపడ్తున్న జనం..!

ఏం మాయ చేశావే.. అబ్బాయి కంటే రెండేళ్లు పెద్దదైన అమ్మాయి మధ్య నడిచే ప్రేమకథ..అప్పటివరకు అబ్బాయి కంటే అమ్మాయెప్పుడు చిన్నది గా ఉండాలి అది ప్రేమ అయినా ,పెళ్లి అయినా అనుకునే పరిస్థితి మన సమాజానిది..కానీ ఏం మాయ చేశావే తర్వాత మనకంటే పెద్దమ్మాయిని లవ్ చేయడం మనకు అడ్వాంటేజేరా అని అబ్బాయిలు,మనకంటే చిన్న అబ్బాయిల్ని లవ్ చేస్తే తప్పులేదు అని అమ్మాయిలు..చైతు,సామ్ ల ప్రేమ నచ్చని పెద్దలు ఇదేం దిక్కుమాలిన సినిమా అని అనుకోవడం జరిగాయి..ఇప్పుడు అంతకంటే పెద్ద దిక్కుమాలిన సీరియల్ ఒకటి వస్తుంది సోనీలో…దాని కథా కమామీషు తెలిస్తే…తీసిన వాళ్లని దాని గురించి రాసిన నన్ను కూడా తిట్టుకోక మానరు..

సోనీ టీవీలో ప్రైప్ టైంలో పెహ్రేదార్ పియా కీ (pehredaar piya ki) అనే సీరియల్ వస్తుంది. ఇందులో పదేళ్ల పిల్లాడికి ,ఇరవై ఏళ్ల యువతికి మధ్య పెళ్లి,ఆ తర్వాత వారి మధ్య ప్రేమ..భార్య,భర్తల మధ్య వచ్చే సన్నివేశాలు..సీరియళ్లు జీడిపాకాలు,ఇనుపరేకులు అని తిట్టుకుంటూ కూడా ఏళ్లకేళ్లు సాగే సీరియళ్లను చూస్తూనే ఉంటారు జనం.. ప్రైమ్ టైం అనగా  అందరూ కూర్చుని సీరియల్స్ చూస్తూ భోజనం చేసే సమయం కావటం..అలాంటప్పుడు పిల్లలు అడిగే ప్రశ్నలకు పెద్దలు సమాధానం చెప్పలేకపోవటం ఇలాంటి గందరగోళం పరిస్థితులు ఖచ్చితంగా ఏర్పడతాయి..సో జూలై 17వ తేదీన ప్రారంభం అయిన ఈ సీరియల్ కథపై విమర్శలు రావటం.. ఈ సీరియల్ కుటుంబ వ్యవస్థపైనే కాకుండా పిల్లల ప్రవర్తనపై ప్రభావం చూపే అవకాశం ఉందంటూ బ్యాన్ చేయాలని ఉద్యమం మొదలు పెట్టారు. వారం క్రితం ప్రసారం అయిన ఎపిసోడ్ లో పదేళ్ల పిల్లోడి శోభనం గదిలోని అల్లరిని కూడా చూపించేశారు. హనీమూన్ డిస్కసన్ తో డైలాగ్స్ పేల్చారు. దీంతో మరింత చిర్రెత్తిపోయిన  జనం.. సీరియల్ బ్యాన్ కోసం ఉద్యమం లేవనెత్తారు.

ఛేంజ్ డాట్ ఓర్జీలో పిటీషన్ ఫైల్ చేస్తే.. ఏకంగా 42వేల మంది సీరియల్ బ్యాన్ చేయాలంటూ సంతకాలు చేశారు. అంతే కాదండీ.. కేంద్ర మంత్రి స్మ్రుతి ఇరానీకి ఏకంగా విన్నపాలు వెల్లువెత్తాయి. ఓ సీరియల్ విషయంలో ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరగటం బహుశా దేశంలో ఇదే కావొచ్చు.బాల్య వివాహాలను ప్రోత్సహించడం తమ ఉద్దేశం కాదని, వినోదం పంచాలన్నదే తమ ప్రయత్నమని ఈ సీరియల్‌లో నటిస్తున్న సుయష్‌ రాయ్‌ వివరణ ఇచ్చారు. తొందరపడి ఒక నిర్ణయానికి రావొద్దని విజ్ఞప్తి చేశారు. పెహ్రెదార్‌ పియా కీ భవితవ్యం ఏమిటో చూడాలి.

Comments

comments

Share this post

scroll to top