నిమ్స్ లో పేషెంట్ కడుపులో కత్తెర మర్చిపోయి కుట్లు వేసిన డాక్టర్..!

నేడు మ‌న దేశంలో ఏ రాష్ట్రంలో చూసుకున్నా ప్ర‌భుత్వ హాస్ప‌ట‌ల్స్‌లో ప్ర‌జ‌ల‌కు అందుతున్న సౌక‌ర్యాలు నానాటికీ మృగ్య‌మైపోతున్నాయి. పేద వాడి ఆరోగ్యం అంటే ఎవ‌రికీ శ్ర‌ద్ధ లేదు. ఏమ‌యిపోతే మాకేం అన్న ధోర‌ణిలో హాస్పిట‌ల్స్ సిబ్బంది నిర్లక్ష్యం వ‌హిస్తున్నారు. ఓ వైపు బాధితులు ప్రాణాపాయ స్థితిలో ఉంటే సిబ్బంది మాత్రం త‌మ‌కేమీ ప‌ట్ట‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తూ వారి జీవితాల‌తో ఆడుకుంటున్నారు. ప్ర‌భుత్వ హాస్పిట‌ల్స్‌లో నెల‌కొన్న నిర్ల‌క్ష్య ప‌రిస్థితులు పేద‌ల‌కు ద‌డ పుట్టిస్తున్నాయి.

2017 నెల్లూరు లోని గవర్నమెంట్ హాస్పిటల్ లో డాక్టర్ పేషెంట్ కడుపు లో కత్తెర మర్చిపోయి కుట్లు వేసిన ఘటన ఇంకా చాలా మందికి గుర్తుకు ఉంది, అలాంటి ఘటనే హైదరాబాద్ లోని నిమ్స్ లో జరిగింది, ప్రాణాలు కాపాడుకోడానికి నిమ్స్ లో జాయిన్ అయ్యాడు మహాదేవ్, ఆపరేషన్ అయ్యాక కడుపులో పెయిన్ గా ఉందని స్కానింగ్ తీసి చూస్తే కత్తెర కనపడింది.

కత్తెర అంత పొడువు కాకపోయినా…

మెషిన్ మీద బట్టలు కుట్టేటప్పుడు వాడే కత్తెర అంత పొడువు లేకపోయినా, బాగా షార్ప్ గా ఉంది కత్తెర. కడుపులో కత్తెర ఉందని తెలుసుకున్న మహాదేవ్ బంధువులు నిమ్స్ హాస్పిటల్ ఎదుట ఆందోళన చేప్పట్టారు, డాక్టర్ నిర్లక్ష్యం పైన మహాదేవ్ బంధువులే కాదు, సామాన్య ప్రజలు కూడా మండిపడుతున్నారు, డాక్టర్లు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే పేషెంట్ ల ప్రాణాలకు విలువేం ఉంటుందని మండిపడుతున్నారు.

డాక్టర్ పైన యాక్షన్ తీసుకోవాలి.. :

డాక్టర్ పైన యాక్షన్ తీసుకోవాలని మహాదేవ్ బంధువులు డిమాండ్ చేస్తున్నారు, ప్రస్తుతం అతని ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదు అని డాక్టర్స్ చెబుతున్నారు.

Comments

comments

Share this post

scroll to top