కాలేజీ కుర్రోడిగా “నిఖిల్” నటించిన “కిరాక్ పార్టీ” హిట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్ (తెలుగులో).!

Krishna

Movie Title (చిత్రం): కిరాక్ పార్టీ (Kirrak Party)

Cast & Crew:

నటీనటులు: నిఖిల్ సిద్ధార్థ్, సిమ్రన్ పర్జీనా, సంయుక్త హెగ్డే తదితరులు
దర్శకత్వం: శరణ్ కొప్పిశెట్టి
సంగీతం: అజనీష్ లోక్‌నాథ్
నిర్మాత: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ (సుంకర రామబ్రహ్మం, అనిల్ )

Story:

కాలేజీ లైఫ్ స్టైల్ ను పరిచయం చేస్తూ ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. జూనియర్స్ బ్యాచ్ కి హెడ్ “నిఖిల్”. తన గ్యాంగ్ లో ఆరు మంది ఫ్రెండ్స్. తన గ్యాంగ్ లోని “మీరా (సిమ్రాన్) తో ప్రేమలో పడతాడు నిఖిల్. అనుకోకుండా ఒకసారి సీనియర్స్ తో గొడవ అవుతుంది. కామెడీ గా వెళ్లిన స్టోరీ సడన్ గా సీరియస్ గా టర్న్ అవుతుంది.
సినిమా రెండో భాగంకి వచ్చేసరికి హీరో ఫైనల్ ఇయర్ కి వస్తాడు. సంయుక్త నిఖిల్ కి జూనియర్ గా పరిచయం అవుతుంది. ఇంతలో కంప్యూటర్స్, మెకానికల్, సివిల్ గ్రూపుల మధ్య వివాదం. తరవాత నిఖిల్ తన ప్రేమను సంయుక్తకు వ్యక్తం చేస్తాడు. ఆమె ఒప్పుకోవడంతో కథ సుఖాంతం అవుతుంది.

Review:

కన్నడలో ఘనవిజయం సాధించిన ‘కిరిక్ పార్టీ’కి ఇది రీమేక్. చాలాకాలం తరవాత కాలేజ్ నిఖిల్ కుర్రాడిగా కనిపించదు. క్యాంపస్ కుర్రాళ్ల అల్లరితో కూడిన పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్ ఈ సినిమా. నిఖిల్ సరసన సిమ్రన్ పర్జీనా, సంయుక్త హెగ్డే నటించారు. ఈ సినిమాకి ప్రముఖ దర్శకులు సుధీర్ వర్మ స్ర్రీన్ ప్లేనీ, మరో దర్శకుడు చందూ మొండేటి సంభాషణలు అందిచడం విశేషం. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం సమకూర్చారు.లవ్ ట్రాక్ తో పాటు ఓ పేద సెక్స్ వర్కర్ కు సహాయం చేయడం అనే ఎమోషనల్ సైడ్ కూడా ఈ సినిమాలో ఉంది. హీరో క్యారెక్టర్ ను తెరకెక్కించడం, కామెడీ పండించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. కానీ కథనంపై పట్టు బిగించలేకపోయారు.

Plus Points:

నిఖిల్
సాంగ్స్
కాలేజీ లైఫ్
కామెడీ

Minus Points:

బోరింగ్ లవ్ ట్రాక్
స్క్రీన్ ప్లే

Final Verdict:

కాలేజీ లో ఫ్రెషర్స్ పార్టీ తో మొదలై ఫారెవెల్ తో ముగిసేదే “కిరాక్ పార్టీ”. యూత్ కి తప్పక నచ్చుతుంది.

AP2TG Rating:  3/ 5

Trailer:

Comments

comments