వీళ్ళంతా కలెక్టర్లు…ఫోటో ఫోటో కి ఓ హిస్టరీ ఉంది.తెల్సుకోవాల్సిన బాధ్యత మనమీదుంది.

వారంతా కలెక్టర్లు..పరిపాలనాకు పట్టుగొమ్మలు..ప్రభుత్వానికి ప్రజలకు మద్య వారధులు. ప్రజా సేవ చేయాలనే దృక్ఫథంతోనే సివిల్స్ పరీక్షను దాటి కలెక్టర్ కొలువుకు ఏంపికై, మచ్చలేని పాలనను అందిస్తూనే సస్పెంన్షన్ కు గురైన అమాయకులు… తాము నమ్మి వచ్చిన సిద్దాంతం కొరకు ఏకంగా కొంతమంది తమ ప్రాణాలనే వదిలారు. 6 గురు కలెక్టర్ల స్పూర్తిదాయక కథనం.

1. దుర్గ శక్తి నాగపాల్.

2013లో ఉత్తరప్రదేశ్ లోని గౌతమ బుద్ధ నగర్ కు  సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ గా నియమితురాలైంది. నోయిడా ప్రాంతంలోని యమునా,హిందూ నదుల వద్ద ఇసుక మాఫియా ఎక్కువగా నడుస్తుందని, వాటిని అరికట్టే చర్యలు చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇసుక మాఫియాను అరికట్టింది. అయితే ఇసుక మాఫియాలో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉండడం వలన, దుర్గశక్తి మతపరమైన ఉద్రిక్తలకు కారణం అయ్యారంటూ ఆమెను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆమెను సస్పెండ్ చేయడం వలన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ నెట్ వర్క్ మరియు డైలీ పత్ర్రికలలో దేశం మొత్తం అదే చర్చ నడిచింది.

durga-shakti

2. డీకే రవి:
కర్ణాటకలోని కోలార్ జిల్లాలో జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తూ, ప్రజలచే ఉత్తమమైన ప్రభుత్వ అధికారిగా గుర్తింపుపొందాడు ఐఏఎస్ ఆఫీసర్ డీకే రవి. ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా తన విధిని నిర్వర్తిస్తూ ఉండే ఆ కలెక్టర్, ఇసుక మాఫియాను అరికట్టడంలో ఉక్కుపాదం మోపారు. అయితే ప్రభుత్వం డీకే రవి బాధ్యతల పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆయనకు మద్దతుగా ప్రజలు బంద్ లు నిర్వహించారు. వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమీషనర్ గా ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గి బెంగళూరు ట్రాన్స్ ఫర్ అయ్యారు. బెంగళూర్ లో రియల్ ఎస్టేట్ మాఫియా నుండి  120 కోట్లు పన్ను వసూలు చేశాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల  బెదిరింపుల వల్ల ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు కథనాలు వెల్లడయ్యాయి. విధి నిర్వహణలో సిన్సియారిటీ ఉన్న రవిని హతమార్చి, ఆత్మహత్యగా సృష్టించారనే అనుమానాలు ఉన్నాయి.
DK-ravi
 
3. అశోక్ ఖేమ్కా:
23 సంవత్సరాలలో 45 ట్రాన్స్ ఫర్ లు. అవినీతి పాలిట సింహస్వప్నం. అధికారులతో, రాజకీయనాయకులతో పనిలేదు. తను చేయాల్సిన పనే తనకు ముఖ్యం. ఈ ఇంట్రడక్షన్ చాలు ఆయన ఎటువంటి అధికారో చెప్పడానికి. ఆయనే ఐఏఎస్ ఆఫీసర్ అశోక్ ఖేమ్కా. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు వాద్రా భూవ్యవహారాన్ని వెలికితీసిన అశోక్ అప్పటికే 45 సార్లు విధి నిర్వహణలో ట్రాన్స్ ఫర్ అయ్యారు. వాద్రా భూవ్యవహారాన్ని బయటపెట్టడంతో హర్యానా ప్రభుత్వం ఆయనను పురావస్తు శాఖ డైరెక్టర్ గా బదిలీచేసింది. రవాణా కమీషనర్ గా విధులు నిర్వహిస్తున్న అశోక్ ఖేమ్కా కేవలం 128 రోజులలోనే పురావస్తు శాఖకు బదిలీ అయ్యారు.
ashok-khemka
4. యశ్వంత్ సొనావానే:
మహారాష్ట్రలోని మలేగాన్ జిల్లా అదనపు జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తూ, సజీవ దహనానికి గురయ్యాడు ఐఏఎస్ అధికారి యశ్వంత్ సొనావనే. అవినీతి కార్యకలాపాలకు చెక్ పెడుతూ ప్రజలు మెచ్చిన కలెక్టర్ గా గుర్తింపు పొందాడు. కేవలం ఒకే ఒక్క వారంలోనే ఆయిల్ మాఫియాను అంతం చేయడానికి  200 రైడ్లు, 180 కేసులు ఫైల్ చేశాడు. కాగా నాసిక్ జిల్లాలో పోపట్ షిండే అనే ఆయిల్ మాఫియా వ్యక్తి యశ్వంత్ ను తన  బంధువుల సహకారంతో కలిసి సజీవ దహనం చేశాడు. గాయాలతో పాలైన ఆయన్ను హాస్పిటల్ కు తీసుకెళ్ళినా ఉపయోగం లేకపోయింది.
yashwanth
5. శన్ముగన్  మంజునాథ్:
ఐఐఎం గ్రాడ్యుయేట్ అయిన శన్ముగన్ మంజునాథ్, ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లో జరుగుతున్న అవినీతి చర్యలను అరికట్టేందుకు తీవ్రంగా పోరాడాడు. ఐఏఎస్ అధికారి యశ్వంత్ సోనావానేలాగే ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో గల లఖింపూర్ లో  ఒక పెట్రోల్ బంక్ ను సీజ్ చేసినందుకు ఆయనను కాల్చి చంపారు. కల్తీ పెట్రోల్ ను అమ్ముతున్నందుకు సీజ్ చేసిన ఒక నెల తర్వాత మళ్ళీ అక్కడకు వచ్చి పర్యవేక్షించిన శన్ముగన్ ను కాల్చి చంపేశారు. ఆయన శరీరంలో మొత్తం 6 బుల్లెట్లు ఉన్నాయి. విధి నిర్వహణలో ప్రాణాలు వదిలిన శన్ముగన్ పేరు మీదట, ఐఐఎం విద్యార్థులు ఒక ట్రస్ట్ ను ఓపెన్ చేసి, ప్రజలకు సేవ చేస్తున్నారు. కాగా అతడు చేసిన వృత్తి పట్ల ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ 2.6కోట్ల ఆయన కుటుంబానికి అందజేసింది.
shanmugan
 
6. ముగ్ధా సిన్హా :
రాజస్థాన్ లోని జుంజూరు జిల్లాకు మొదటి మహిళా కలెక్టర్ గా అధికారం చేపట్టింది ముగ్దా సిన్హా. రావడంతోనే అక్కడి లోకల్ మాఫియాపై ఫోకస్ చేసింది. అందులో విజయవంతమైంది. ప్రజల కోసం పనిచేసే అధికారిగా అనతికాలంలోనే గుర్తింపు పొందింది. మంచి జరుగుతున్నా, రాజకీయ నాయకులను ఎదురిస్తున్నా ఇలాంటి అధికారులకు ట్రాన్స్ ఫర్ లు తప్పవు కదా. ఆమె విషయంలోనూ అదే జరిగింది. అయితే ప్రజలు ఆమెకు సపోర్ట్ గా నిలిచారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి గంగానగర్ జిల్లా కలెక్టర్ గా బదిలీ అయ్యారు. నా కోసం, రాజకీయ నాయకుల కోసం పనిచేయడానికి నేను రాలేదు, ప్ర్రజలకు సేవ చేయడానికి వచ్చానని ఆమె తెలిపింది.
mugdha

Comments

comments

Share this post

scroll to top