ఇంటికెళ్లి చెల్లిని తీసుకొస్తా అన్నాడు…నిద్రిస్తున్న చెల్లిని చూసి.. వావివరుసలు మరిచి…బీటెక్ విద్యార్థి పైశాచికత్వం!

సభ్యసమాజం తలదించుకొనేలా.. చెల్లిపైనే.. అదీ మానసిక వికలాంగురాలైన బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు.. ఓ యువకుడు. ఈ అమా నవీయ ఘటన ముదిగొండ మండలంలో ఆదివారం జరిగింది. మేడేపల్లి గ్రామానికి చెందిన పదహారేళ్ల ఓ బాలిక మతి స్థిమితం లేదు. ఆమె తండ్రి ఖమ్మంలో కూలి పనికి వెళ్లగా.. తల్లి (బాలిక పెదనాన్న పొలంలో) పత్తి తీసేందుకు వెళ్లింది. అక్కడే ఉన్న యువకుడు (బాలిక పెదనాన్న కొడుకు) భోజనానికి ఇంటికెళుతున్నానని బయల్దేరాడు.. కొంతదూరం వచ్చేసరికి అతడి పిన్ని (బాలిక తల్లి) ఫోన్‌ చేసి.. ‘ఇంటి వద్ద చెల్లి ఉంది. భోజనం చేసి వచ్చేప్పుడు పొలానికి తీసుకురా’ అని చెప్పింది. ఆ యువకుడు వారింటికి వెళ్లాడు. బయట ఉన్న తాతతో మాట్లాడాడు.

చెల్లిని పిన్ని తీసుకురమ్మందని, తాను ఇక్కడే భోజనం చేస్తాననిచెప్పడంతో అందుకు సరేనన్నాడు. అలా బాబాయి ఇంట్లోకి వెళ్లిన యువకుడు.. నిద్రిస్తున్న చెల్లిని చూసి.. వావివరసలు మరిచాడు. విచక్షణ కోల్పోయి.. మతిస్థిమితం లేని ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అనంతరం పొలానికి వెళ్లాడు. చెల్లి పొలానికి రానందని పిన్నికి చెప్పాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన బాలిక తల్లిని చూసిన అప్పటికే తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న బాలిక.. ‘అన్నయ్య వచ్చాడు.. ఇలా చేశాడు..’ అని చెప్పి బోరున విలపించి.. స్పృహతప్పి పడిపోయింది. బాలిక తల్లి ఫిర్యాదు చేయగా… యువకుడిపై నిర్భయ కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ భానుప్రకాష్‌ తెలిపారు. బాలికను చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు సూర్యాపేట జిల్లా కోదాడలోని ఓ కళాశాలలో ఇంజినీరింగ్‌ చదువుతున్నాడు.

Comments

comments

Share this post

scroll to top