నిద్రకు సంబంధించిన విషయానికి వస్తే చాలా మంది చాలా రకాలుగా నిద్రిస్తారు. కొందరు వెల్లకిలా పడుకుంటే కొందరు బోర్లా పడుకుంటారు. ఇంకొందరు సైడ్కు తిరిగి నిద్రిస్తారు. ఇలా భూమ్మీద ఉన్న ఒక్కొక్కరు తమ అనుకూలతలను బట్టి ఒక్కో రకంగా నిద్రిస్తారు. అయితే ఇది తెలిసిన విషయమే అయినా.. నిద్ర వరకు వస్తే.. చాలా మంది నిద్రపోయేటప్పుడు చెందే అనుభూతి ఒకటుంది. అదేమిటంటే… ఎప్పుడైనా మీరు నిద్రిస్తున్నప్పుడు సడెన్గా మెళకువ వచ్చి, కళ్లు మూసుకునే ఉంటారు, కానీ అటు ఇటు కదల్లేరు, ఏ భాగాన్ని కూడా కదల్చలేరు. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా..? అదే ఇప్పుడు చూద్దాం.
1. నిద్రలో ఉన్నప్పుడు పైన చెప్పిన విధంగా జరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో మొదటి కారణం ఏమిటంటే.. అనారోగ్య సమస్యలు. యాన్గ్జయిటీ, డిప్రెషన్, మానసిక ఒత్తిడి బాగా ఉన్నవారికి ఇలా అవుతుందట. వారికి నిద్ర సరిగ్గా పట్టక ఇలా జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
2. నిద్ర పోయినప్పుడు మన శరీరం తనకు తానే అంతర్గతంగా మరమ్మత్తులు చేసుకుంటుందని తెలుసు కదా. అయితే అలాంటి సమయంలో సడెన్గా బీపీ పెరిగినప్పుడు, లేదంటే శరీర ఉష్ణోగ్రత సడెన్గా మారితే పైన చెప్పిన విధంగా జరుగుతుందట.
3. నిద్రించినప్పుడు అలా శరీరం బిగబట్టినట్టు అవడానికి గల మరో కారణం ఏమిటంటే.. sleep paralysis.. ఇందులో మళ్లీ మూడు ఉంటాయి. ఒకటి.. ఎవరైనా నిద్రించేటప్పుడు భయానికి లోనైతే తమ ఛాతి మీద ఏందో ఉందని అందుకే కదలలేకపోతున్నామని అనుకుంటారు. రెండోది.. కొందరు నిద్రించినప్పుడు తమ చుట్టూ ఎవరూ లేకపోయినా, ఎవరో ఉన్నారని ఫీల్ అవుతారు. అందుకే ఇలాంటి వారు నిద్రించినప్పుడు వారికి శరీరం బిగబట్టినట్టు అనిపిస్తుంది. ఇక మూడోది.. శరరీం గాల్లోకి తేలుతున్నట్టు అనుభూతి కలిగితే అప్పుడు నిద్రలో శరీరం బిగబట్టినట్టు కొందరికి అవుతుంది. ఇవీ.. నిద్రలో శరీరం అలా కావడానికి ఉన్న కారణాలు..! అయితే ఈ సమస్య నుంచి బయట పడవచ్చట. అందుకు ఏం చేయాలంటే.. నిత్యం వ్యాయామం చేయడం, సరైన సమయానికి పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం, టైముకు సరిపడినన్ని గంటలు నిద్రించడం వంటి పనులు చేస్తే పైన చెప్పిన సమస్య రాదని వైద్యులు చెబుతున్నారు.