వ‌చ్చే కాల‌మంతా డిజిట‌ల్ రంగానిదే – విభిన్న కోర్సులు చేస్తే డాల‌ర్ల పంట

రాబోయే కాల‌మంతా డిజిట‌ల్ టెక్నాల‌జీనే ఆక్ర‌మించుకునే దిశ‌గా ఎదుగుతోంది. ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ పుణ్య‌మా అంటూ లక్ష‌లాది మందికి కొలువులు ద‌క్కుతున్నాయి. డాల‌ర్ల పంట పండుతున్నా పొద్ద‌స్త‌మానం కంప్యూట‌ర్లు, ల్యాప్ టాప్‌ల‌తోనే స‌రిపోతోంది. అస‌లైన లైఫ్‌ను ఎంజాయ్ చేయ‌లేక పోతున్నారు. సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ రంగాల‌తో పాటు సోష‌ల్ మీడియా అంత‌కంత‌కూ విస్త‌రిస్తోంది. ఇపుడు ప్ర‌తి కుటుంబంలో భాగ‌మై పోయింది. ఉద‌యం నుండి ప‌డుకునే దాకా అంతా డిజిట‌ల్ మ‌య‌మే. ఈ రంగాల‌లో కొద్దిగా నైపుణ్యం పెంచుకోగ‌లిగితే మంచి భ‌విష్య‌త్తు దాగి ఉంటుంద‌న్న‌ది టెక్నిక‌ల్ ఇక్స్‌ప‌ర్ట్స్ అంచ‌నా. ఐటీ అనే స‌రిక‌ల్లా అమెరికా త‌ర్వాత ఇండియా పేరు చెబుతారు. అంత‌లా పాపుల‌ర్ అయ్యాం మ‌నం. కానీ ఆదాయ ప‌రంగా గ‌ణ‌నీయంగా ప‌డిపోయాం. మ‌న వాళ్ల‌కు దేశం కంటే వారి వ్య‌క్తిగ‌త స్వార్థం ఎక్కువ‌. పోనీ సంపాదించిందంతా ఖ‌ర్చు చేస్తున్నారా అంటే అదీ లేదు. ఎవ‌డి జీవితం వాడిదే. అంత‌గా ఎదిగారు మ‌న‌వాళ్లు. వెబ్ డిజైన‌ర్లు, గ్రాఫిక్ డిజైన‌ర్లు, కోడింగ్ , డీ కోడింగ్ ఎక్స్ ప‌ర్ట్స్‌, ఎస్ ఇఓలు, మొబైల్ యాప్ అప్లికేష‌న్స్ , యాప్ క్రియేట‌ర్స్‌, కంటెంట్ రైట‌ర్స్, వీడియో, ఆడియో ఎడిట‌ర్స్‌, యూట్యూబ్ రివ్యూవ‌ర్స్‌, టెలికాం టెస్ట‌ర్స్‌, సాఫ్ట్ వేరే్ టెస్ట‌ర్స్‌ల‌లో అనుభ‌వం గ‌డించిన వాళ్ల‌కు.ఈ కోర్సులు చేసిన వారికి ప్ర‌పంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంటోంది.

కంపెనీలు, వ్యాపారులు , సంస్థ‌లు త‌మ వ్యాపారాన్ని విస్త‌రించేందుకు, ఆదాయాన్ని గ‌ణ‌నీయంగా పెంచుకునేందుకు డిజిట‌ల్ టెక్నాల‌జీల‌పై ఆధార ప‌డుతున్నాయి. సాంకేతిక‌త‌ను స‌మ‌కూర్చు కోవ‌డంపై దృష్టి పెట్టాయి. దీంతో ఐటీ నిపుణుల‌కు డిమాండ్ పెర‌గ‌నుంది. కొత్త ఏడాదిలో భారీగా కొలువులు రానున్నాయి. డిజిట‌ల్ రంగంతో పాటు ఇత‌ర టెక్నాల‌జీ రంగాల‌కు ప్రాధాన్య‌త ఉండ‌నుందని విశ్లేష‌కుల అంచ‌నా. ఐటీ ఉద్యోగాలంటే సాఫ్ట్ వేర్ రంగాలు అనే ముద్ర ప‌డింది. దానిని చెరిపి వేస్తూ ఆ రంగానితో స‌మానంగా డిజిట‌ల్ టెక్నాల‌జీ రంగం ఎదుగుతోంది. వ్యాపార ప‌రంగా ప్ర‌తి రంగం డిజిట‌ల్ టెక్నాల‌జీని వాడాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. లేక‌పోతే మిగ‌తా సంస్థ‌ల‌తో పోటీ ప‌డ‌లేరు. న‌ష్టాలు చ‌వి చూసే ప్ర‌మాదం పొంచి ఉంది. ఈ రంగాల‌లో కొంచెం కాన్ సెంట్రేష‌న్ పెడితే టెక్కీల‌కు డాల‌ర్లే డాల‌ర్లు. ఇత‌ర దేశాల్లో .కంపెనీల్లో అపార‌మైన అవ‌కాశాలు ద‌క్క‌నున్నాయి. కృత్రిమ మేధ‌, బిగ్ డేటా, మెషీన్ ల‌ర్నింగ్, వెబ్ డిజైన‌ర్స్‌కు గిరాకీ పెర‌గ‌నుంది. అన‌లిటిక్స్‌, సైబ‌ర్ సెక్యూరిటీ రంగాల‌లో ల‌క్ష‌లు చెల్లించేందుకు కంపెనీలు రెడీ అంటున్నాయి. ప్ర‌ధానంగా బ్యాంకింగ్, ఫైనాన్సియ‌ల్ స‌ర్వీసెస్ అండ్ బీమా, మాన్యూఫాక్చ‌రింగ్, ఫార్మాస్యూటిక‌ల్స్‌, ఆటో మొబైల్స్‌, ఎఫ్ఎంజీ, క‌న్సూమ‌ర్స్ గూడ్స్, ఎంట‌ర్ టైన్ మెంట్‌, త‌దిత‌ర రంగాల‌లో సాంకేతిక నిపుణుల అవ‌స‌రం ఎక్కువ‌గా ఉంది.

ఐటీ, డిజిట‌ల్ రంగాల‌లో దాదాపు రెండున్న‌ర ల‌క్ష‌ల‌కు పైగా ఉద్యోగాలు ల‌భించనున్నాయ‌ని టెక్కీలు అంటున్నారు. వీటితో పాటు క్లౌడ్ కంప్యూటింగ్, కాగ్నిటివ్ ఆటోమేష‌న్, నాచుర‌ల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, డిజిట‌ల్ ప్రాజెక్టు మేనేజ్‌మెంట్, ఎంట‌ర్ ప్రైజ్ ఆర్కిటెక్చ‌ర్ త‌దిత‌ర టెక్నాల‌జీల‌లో నైపుణ్యం ఉన్న వారికి కంపెనీలు స్వాగ‌తం ప‌లుకుతున్నాయి. వీటిలో అనుభ‌వం క‌లిగిన టెక్కీల‌కే కాకుండా ఫ్రెష‌ర్స్ కు కూడా ఐటీలో జాబ్స్ వ‌చ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్ప‌టి నుండే ఫ్రెష‌ర్స్‌కు ఐటీ కంపెనీలు అవ‌కాశాలు ఇవ్వ‌నుండ‌గా .మ‌రికొన్ని ఇంట‌ర్న్‌షిప్ కింద ప్ర‌యారిటీ ఇస్తున్నాయి. వ‌చ్చే ఏడాదిలో ఐటీ దిగ్గ‌జాలు టాటా క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీసెస్, ఇంటెల్, విప్రో, అమెజాన్, హెచ్ పీ, యాక్చెంచ‌ర్‌, సాబ్ సంగ్ ఆర్ అండ్ డి కంపెనీలు ఆధునిక టెక్నాల‌జీలో నిపుణులతో పాటు కొత్త వారికి ట్రైనింగ్ ఇవ్వున‌న్న‌ట్లు టెక్నిక‌ల్ ఆఫీస‌ర్స్ చెబుతున్నారు.బ్యాంకుల మ‌ధ్య పెరిగిన పోటీ – ఆర్థిక లావాదేవీల నిర్వ‌హ‌ణ‌లో.వినియోగ‌దారుల‌కు సేవ‌లు అందించ‌డంలో ఇండియాలో ప్రైవేట్ బ్యాంకులే ముందంజ‌లో ఉంటున్నాయి. టెక్నాల‌జీ వినియోగం ఎక్కువ‌గా వీరు వాడుతున్నారు. దీంతో క‌స్ట‌మ‌ర్లు త‌మ నుండి పోకుండా ఉండేందుకు ప్ర‌భుత్వ బ్యాంకులు వాటితో ఢీకొనేందుకు రెడీ అవుతున్నాయి. టెక్కీల‌ను నియ‌మించుకునేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్నాయి.

మాన‌వ వ‌న‌రుల సామ‌ర్థ్యాన్ని పెంచుకునేందుకు దృష్టి పెటాయి. వెల్త్ మేనేజ్‌మెంట్, డిజిట‌ల్ అండ్ క‌స్ట‌మ‌ర్స్ స‌ర్వీసెస్, బిజినెస్ స్ట్రాట‌జీ వంటి త‌దిత‌ర రంగాల‌లో నిపుణుల‌ను నియ‌మించుకోనున్నాయి. మొత్తం మీద కాస్తంత కాన్ సంట్రేష‌న్ చేస్తే ఉన్న చోట‌నే ఉపాధి పొందే అవ‌కాశాలు ద‌క్క‌నున్నాయి. కొత్త కోర్సులు నేర్చుకుని.నైపుణ్యాల‌ను మ‌రింత మెరుగు ప‌రుచుకోగ‌లిగితే కొలువుల‌న్న‌వి క‌ల‌లు కాదు.వాస్త‌వ రూపం దాల్చుతాయి.

Comments

comments

Share this post

scroll to top