ఈనాటి వార్తల్లోని ముఖ్యంశాలు వార్తలు చదువుతున్నది ఎవరో తెలిస్తే షాక్ అవుతారు.!!

ఓ మరమనిషి అంటూ రోబో సినిమాలో వచ్చిన పాటని నిజం చేస్తున్నారు శాస్త్రవేత్తలు. మనుషులకు ధీటుగా ఈ రోబోలని అనేక రంగాలలో ఉపయోగించుకుంటున్నారు. హాస్పిటల్స్ లలో, హోటల్స్ లో, వీటి ఉపయోగం ఎక్కువగా ఉంది. అయితే ఇప్పుడు రోబోలు జర్నలిజంలోనూ ప్రవేశించాయి. న్యూస్ రీడర్స్ గా కొత్త అవతారం ఎత్తాయి. అయితే ఇవి వార్తలు చదువుతున్నది మాత్రం మన దగ్గర కాదండోయి. చైనాలోని జిన్హువా అనే మీడియా సంస్థలో తమ జర్నలిజం వృత్తిని ప్రారంభించాయి.

గతేడాది నవంబర్ లో ఈ మీడియా సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే రెండు రోబో న్యూస్ యాంకర్లను నియమించింది. అప్పటి నుంచి వార్తలను రోబోలే చదువుతున్నాయి. ఎటువంటి వార్తనైన చదివేవి.కానీ వార్తకు తగ్గ ఎక్స్ ప్రెషన్ మాత్రం ఇవ్వకపోయేటివి.

దింతో వీటి జతకు ఓ ఆడ రోబో వచ్చింది. దీని పేరు షిన్ షియావోమెంగ్ ఈ రోబో అచ్చం మనిషిలాగే ఉంది. హావభావాలతో మనిషిలాగే వార్తలు చదువుతుంది. రోబో గురించి తెలియని వాళ్ళు దీనిని చూస్తే మనిషి అనుకున్న ఆశర్యపోనవసరంలేదు. అంతే కాక తొలి లేడీ రోబో న్యూస్ యాంకర్ గా రికార్డు సృష్టించింది. కానీ ఇప్పటికి ఈ రోబో చైనీస్ భాషలోనే వార్తలు చదువుతుంది.

చైనా సెర్చ్ ఇంజిన్ కంపెనీ సోగో, చైనా న్యూస్ ఏజెన్సీ జిన్హువా కలిసి రెండు ఏఐ ఆధారిత రోబోలని రూపొందించాయి. ఈ రెండింటిలో ఒకటి ఇంగ్లీష్ వార్తలు చదవడానికి, మరొకటి చైనీస్ వార్తలను చదవడానికి ఉపయోగిస్తున్నారు. ఈ రోబోలు బ్రేకుల్లేకుండా 24గంటలు పనిచేస్తాయి. అందుకే వీటి ద్వారా బ్రేకింగ్ న్యూస్ ని తొందరగా చేరవేయవచ్చని తెలిపారు. ఇప్పటి వరకు ఈ రోబోలు దాదాపు 3,400 వార్తలను చదివాయట.

ఇప్పటివరకు రోబోలు కేవలం కూర్చొని మాత్రమే వార్తలు చదివేవి. కానీ ఈ రోబోకు కొత్త ఫీచర్లతో తయారుచేయడంతో నిలబడి వార్తలు చదువుతుంది.

Comments

comments

Share this post

scroll to top