తెలంగాణ‌లో ఏర్ప‌డ‌నున్న 6 కొత్త జోన్లు ఇవే.! మీ జిల్లా ఏ జోన్ కింద ఉందో చెక్ చేసుకోండి.!!

జోనల్ వ్యవస్థ సవరణలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఉన్నతస్థాయి కమిటీ ఆరుజోన్లు, రెండు నుంచి మూడు మల్టీజోన్లను ప్రతిపాదించింది. నవంబర్ చివరినాటికి జోనల్ వ్యవస్థపై పూర్తిస్థాయిలో నివేదికలను సిద్ధంచేయాలని ప్రభుత్వవర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణలను కేంద్రప్రభుత్వానికి పంపించడం, రాష్ట్రపతి పరిశీలన తదితర అంశాలు దీనితో ముడిపడి ఉన్నందున వేగంగా కార్యాచరణ పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే జోన్ల ప్రతిపాదనల డాక్యుమెంట్‌కోసం ఉద్యోగ, విద్యార్థి సంఘాల నేతలు విజ్ఞప్తి చేస్తున్నందున ప్రతిపాదిత జోన్, మల్టీజోన్ల జిల్లాల ముసాయిదాను ప్రభుత్వవర్గాలు వెలువరించాయి. జిల్లా, జోనల్, మల్టీజోన్లస్థాయిలో నూటికినూరుశాతం తెలంగాణ బిడ్డలకే ఉద్యోగావకాశాలు దక్కాలనే విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోనున్నారు. స్థానికతను పకడ్బందీగా నిర్వచించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సెక్రటేరియట్ పరిధిలోని 34 శాఖలకు అనుబంధంగా ఉన్న 101 శాఖాధిపతి కార్యాలయాల ఉన్నతాధికారులను ఈ ప్రతిపాదనలపైన అధ్యయనంచేయాలని ఉన్నతస్థాయి కమిటీ జారీచేసిన సర్క్యులర్‌లో పేర్కొన్నారు. శాఖలవారీగా జిల్లా, జోనల్, మల్టీజోనల్ పోస్టుల వివరాలను, ఖాళీల వివరాలను తెలియచేయాలని సూచించారు.

ఈ ప్రతిపాదనలపైన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలతో విస్తృతంగా చర్చలు జరుపనున్నారు. మంత్రివర్గ ఉపసంఘం, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆదేశాల ప్రకారం విస్తృత సమావేశాలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో 31 జిల్లాలను ఆరు జోన్లుగా ప్రాథమికంగా ప్రతిపాదించారు. హైదరాబాద్‌లోని సెక్రటేరియట్, శాఖాధిపతి కార్యాలయాలను ఒక మల్టిజోన్ పరిధిలోకి తీసుకొచ్చి అన్నిజిల్లాల ఉద్యోగులకు పనిచేసే అవకాశాలు కల్పించాలని ఉద్యోగసంఘాలు కోరుతున్నాయి. ఇదే సందర్భంలో ఒకజోన్ నుంచి మరోజోన్‌కు, ఒక మల్టీజోన్ నుంచి మరో మల్టీజోన్‌లకు ఉండే బదిలీల విధానంపైనా మార్గదర్శకాలను సిద్ధం చేయనున్నారు.

Comments

comments

Share this post

scroll to top