“డీజే” పాటలో ‘నమకం..చమకం’ స్థానంలో ఏ కొత్త పదాలు చేర్చారో తెలుసా..? అసలు “నమకం-చమకం” అంటే ఏంటి..?

అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమాపై వివాదంలో చెలరేగుతుంది. సినిమాలో బ్రాహ్మణుల్ని, రుషులను కించపరిచేలా ఉన్న పాటలను వెంటనే నిలుపుదల చేయాలని సెన్సార్‌ బోర్డుకు తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి విజ్ఞప్తి చేసింది. ఆ మేరకు పాటలోని కొన్ని అక్షరాలను మార్చారు..!

‘‘అస్మైక యోగ తస్మైక భోగ’’ పాటలో ‘ఆశగా నీకు పూజలే చేయ ఆలకించింది ఆ నమకం.. ప్రవరలో ప్రణయ మంత్రమే చూసి పులకరించింది ఆ చమకం’’ అంటూ శివుడికి ప్రీతికరమైన నమక, చమకాలను శృంగారపరంగా ప్రస్తావించడంపై సమితి సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.  సెన్సార్ స‌మ‌యంలోనే న‌మ‌కం..చ‌మ‌కం అనే ప‌దాల‌ను మార్చి వాటి స్థానంలో నా గ‌మ‌కం..నీ సుముఖం అనే ప‌దాల‌ను పొందుప‌రిచి సెన్సార్ స‌భ్యుల నుండి అమోదం పొందారు. సినిమాలో, ఇక‌పై రానున్న ఆల్బ‌మ్స్ అన్నింటిలో కొత్త ప‌దాల‌తో కూడిన పాట విన‌ప‌డుతుంద‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు తెలియ‌జేశారు.

watch video here:

అసలు “నమకం – చమకం” అంటే ఏంటి..? ఇది తెలియాలి అంటే మనకి “రుద్రుని స్తోత్రం” గురించి తెలియాలి. రుద్రుని స్తోత్రంలో 100 శ్లోకాలతో శివుడిని పూజిస్తారు. ఆ శ్లోకాలలో “నమ: – చమే” అనే పదాలు రిపీట్ అవుతూ ఉంటాయి. నమ: అనే పదాలు కలిగినవన్ని “నమకం” అంటారు. “చమే” పదాలు కలిగిన వాటిని “చమకం” అంటారు!

 

Comments

comments

Share this post

scroll to top