సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్న కొత్త త‌ర‌హా కూర్చునే భంగిమ‌…

కింద ఇచ్చిన చిత్రాన్ని ఓ సారి చూడండి. అందులో మీరు ఏం గ‌మ‌నించారు? ఆ… అవును. అదే. ఓ మ‌హిళ త‌న కాళ్ల‌ను విభిన్న‌మైన రీతిలో మ‌డిచి కూర్చుంది క‌దా! అయితే మీరు చూసింది కరెక్టే. ఇంత‌కీ అందులో ఏం స్పెషాలిటీ ఉందంటారా? ఆమె అలా కూర్చోవ‌డ‌మే ఓ స్పెషాలిటీ అండీ! ఎందుకంటే అది సాధార‌ణంగా మనం కూర్చునే భంగిమ కాదు. ఓ అస‌మాన‌మైన‌, అసాధార‌ణ‌మైన‌, విపరీత‌మైన భంగిమ అది.

sitting-pose-1

న్యూయార్క్ న‌గ‌రం గురించి తెలుసుగా! అక్క‌డి స‌బ్‌వే (అండ‌ర్‌గ్రౌండ్ రైలు మార్గం) ట్రైన్‌లో ఓ మ‌హిళ ఇలా కూర్చుని అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది. దీంతో ఒక్కసారిగా అలా ఆమెను చూసిన వారు ఆశ్చ‌ర్య‌పోయారు. అయితే ఆ మ‌హిళ అలా కూర్చున్న భంగిమ‌ను ఎవ‌రో ఓ వ్య‌క్తి ఫొటో తీసి త‌న ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ ఫొటో కాస్తా వైర‌ల్‌గా మారింది. ప్ర‌స్తుతం ఆ ఫొటోను ఇప్ప‌టికే దాదాపు 5 ల‌క్ష‌ల మంది చూశార‌ట‌. ఈ క్రమంలో ఆ ఫొటో గురించి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ న‌డుస్తోంది.

sitting-pose-2

కొంత మంది ఆ మ‌హిళ కూర్చున్న విధంగా పోజు పెట్టేందుకు ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మ‌వుతుండ‌గా, మ‌రికొంద‌రు ఆ విధంగా కూర్చుని త‌మ ఫొటోల‌ను తీసి సోష‌ల్ మీడియాలో పెడుతున్నారు. దీంతో ఆ భంగిమ‌కు అదోలాంటి క్రేజ్ ఏర్ప‌డింది. కాగా కొంత మంది మాత్రం ఆ మ‌హిళ అలా కూర్చున్నందుకు విమర్శ‌లు చేస్తుంటే మ‌రికొంద‌రు అలా ఎలా కూర్చున్నావ్‌? అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. దీన్ని చూసిన కొంద‌రు వైద్యులు ఏమంటున్నారంటే కొంద‌రు చిన్న‌ప్ప‌టి నుంచి అలాంటి విపరీత శ‌రీర‌త‌త్వం క‌లిగి ఉంటార‌ని, అందువ‌ల్లే వారు అలా కూర్చోవ‌డం సాధ్య‌మ‌వుతుంద‌ని పేర్కొంటున్నారు. ఏది ఏమైనా ఈ ఫొటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అలా అని చెప్పి మీరూ ఈ భంగిమ‌ను ట్రై చేయ‌కండి. కాళ్లు ఇరుక్కుపోవ‌చ్చు. లేదంటే ఆయా భాగాల్లో న‌రాలు ప‌ట్టుకోవ‌చ్చు. త‌రువాత మీ ఇష్టం మ‌రి!

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top