నాకు.. నోట్ బుక్స్ కు డ‌బ్బులివ్వండి సార్…అంటూ అడిగిన ఓ కుర్రాడికి మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ‌.!

న‌లుగురం ఫ్రెండ్స్ క‌లిసి ఉప్ప‌ల్ నుండి సికింద్రాబాద్ కు వెళుతున్నాం….దారిలో ఓ టీ స్టాల్ ద‌గ్గ‌ర ఆపి…టీ తాగుతున్నాం…అంత‌లో మా ద‌గ్గ‌రికి చేతిలో 3 కొత్త నోట్ బుక్స్ ప‌ట్టుకొని…. ఓ కుర్రాడొచ్చాడు. సార్..బుక్స్ కొనుక్కోడానికి డ‌బ్బులు లేవు.. ఓ 100 రూపాయ‌లివ్వండీ అంటూ అడిగాడు. చ‌దువు కోసం….అన‌గానే 100 ఇవ్వాలనిపించింది…కానీ ఆ కుర్రాడిని చూశాక ఎక్క‌డో…తేడా కొట్టింది. ఏ క్లాస్ అని అడ‌గ్గానే… సెవెంత్ క్లాస్ అని చెప్పాడు..ఏ స్కూల్ అని అడ‌గ్గానే గ‌వ‌ర్న‌మెంట్ స్కూల్ అని చెప్పాడు. అయినా నాకు న‌మ్మ‌కం కుద‌ర‌ట్లేదు…..

వెంట‌నే..ఎరోప్లేన్ స్పెల్లింగ్ చెప్పు…అని అన్నాడు. ఆ కుర్రాడి నుండి ఉలుకు లేదు, ప‌లుకు లేదు…అస‌లు స్పెల్లింగ్ చెప్పే ప్ర‌య‌త్న‌మే చేయ‌లేదు. స‌రే అది కాస్త క‌ష్ట‌మైన ప‌దం కాబ‌ట్టి…ఈ సారి యాపిల్ స్పెల్లింగ్ చెప్పు అన్నాను…ఎ ఫ‌ర్ యాపిల్ అని చెప్పాడు..స్పెల్లింగ్ అంటే….నాకు రాదు అన్నాడు..అయినా ఇప్పుడు టైం…4 అయ్యింది..స్కూల్లో లేకుండా ఇక్క‌డేం చేస్తున్నావ్ అంటే నో ఆన్స‌ర్..

ఇక నాకు అనిపించి…అత‌నికి చెప్పేశా… నువ్వు డ‌బ్బుల‌డిగేది చ‌దువు కోసం కాదు..ఒక‌వేళ నిజంగానే చ‌దువుకోస‌మ‌డిగినా నేనివ్వ‌ను…సెవెంత్ క్లాస్ లో యాపిల్ స్పెల్లింగ్ చెప్ప‌లేనోడివి..నువ్వు చ‌దివి ఏం సాధించ‌గ‌ల‌వు? దానికంటే..ఇప్ప‌టి నుండే ఏదైన ప‌ని నేర్చుకుంటే బాగుప‌డ‌తావ్..అని చెప్పేశాను… మా వ‌ద్ద నుండి వెళ్ళిన ఆ కుర్రాడు…అక్క‌డే ఉన్న మ‌రో న‌లుగురితో క‌లిసి న‌న్ను చూపించుకుంటూ…ఏదో చెబుతున్నాడు…దానికి వాళ్లంతా ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుతున్నారు.!!

త‌స్మాత్ జాగ్ర‌త్త‌…మ‌న మ‌న సెంటిమెంట్స్ నే కార‌ణాలుగా చూపి…మ‌న నుండి డ‌బ్బు కాజేయాల‌ని చూస్తుంటారు. జాలితో మ‌నం చేసే దానం వ‌ల్ల మ‌న‌కు పెద్ద‌గా పోయేదేమీ లేదు..కానీ…మ‌న‌కు తెలియ‌కుండానే…అవ‌త‌లి వారిని సోమ‌రులుగా, సంఘ‌విద్రోహ శ‌క్తులుగా చేస్తున్నామ‌నర్థం.

Comments

comments

Share this post

scroll to top