దంగల్ మూవీ ఫేం జైరా వసీంకు మొన్నీ మధ్యే ఎయిర్ విస్తారా ఫ్లైట్‌లో ఎదురైన చేదు అనుభవం గురించి తెలిసిందే కదా. ఆమె ఢిల్లీ నుంచి ముంబైకి ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్నప్పుడు వెనుక సీట్లో కూర్చున్న ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త వికాస్ సచ్దేవ ఆమె పట్ల అభ్యంతరకర రీతిలో ప్రవర్తించాడని వార్త వచ్చింది. ఈ విషయాన్ని సాక్షాత్తూ జైరా వసీమే తెలియజేసింది. తన ఇన్‌స్టాగ్రాంలో ఈమె ఓ వీడియోను పోస్ట్ చేసింది. అందులో తన వెనుక సీట్లో ఉన్న సచ్దేవ ఆమె సీట్ ఆర్మ్ రెస్ట్‌పై కాలు పెట్టడం క్లియర్‌గా కనిపించింది. దీంతో వికాస్ సచ్‌దేవను ముంబైలో పోలీసులు అదుపు తీసుకున్నారు. అనంతరం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చాలా మంది నెటిజన్లు జైరా వసీంకు మద్దతు పలికారు. అయితే ఈ ఘటనలో తాజాగా ఓ ట్విస్ట్ తెలిసింది. అదేమిటంటే…
అసలు వికాస్ సచ్దేవ జైరా వసీం పట్ల మిస్‌బిహేవ్ ఏమీ చేయలేదట. అతను తన సీట్లో కూర్చోగానే వెంటనే నిద్రలోకి జారుకున్నాడట. అయితే తనకు తెలియకుండానే తన కాలును జైరా వసీం సీటు ఆర్మ్ రెస్ట్‌పై పెట్టాడట. అంతకు మించి అతను జైరా వసీం పట్ల అసభ్యంగా ఏమీ ప్రవర్తించలేదట. ఇదే విషయాన్ని సచ్దేవ పక్కన ప్రయాణించిన మరో వ్యక్తి చెప్పాడు. అతను సచ్‌దేవను ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి గమనించాడట. సీట్లో కూర్చోగానే నిద్రలోకి జారుకున్న సచ్దేవ్ వెంటనే తన కాలును జైరా వసీం సీటు ఆర్మ్ రెస్ట్‌పై పెట్టాడట. అయితే దీని గురించి జైరా వసీం అతన్ని నిలదీయగానే అతను సారీ కూడా చెప్పాడట. కానీ చివరకు ఆమె అలా వీడియో పోస్ట్ చేయడంతో అందరూ విమర్శించే సరికి సచ్‌దేవను పోలీసులు అరెస్టు చేశారని అతను చెప్పాడు.
అయితే సచ్దేవ అలా కాలు పెట్టడం తప్పే అయినప్పటికీ అతను అంతకు మించి ఏమీ చేయలేదని, జైరా వసీం పట్ల అసభ్యంగా ఏమీ ప్రవర్తించలేదని, సచ్దేవ కో ప్యాసింజర్ చెప్పాడు. కానీ చివరకు విషయం ఇలా మలుపు తిరగడం బాధాకరమని అన్నాడు. అయితే దీనిపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. అసలు నిజం తెలుసుకోకుండా అలా ఓ వ్యక్తిపై జైరా వసీం అభాండం వేయడం తప్పు అని కొందరు అంటుంటే.. కొందరు ఆమెకు సపోర్ట్‌గా కామెంట్లు పెడుతున్నారు. మరి చివరకు ఈ విషయం ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాలి..!