మీ లైసెన్స్ ర‌ద్దు కాకుండా ఉండాలంటే…ఈ అయిందిటిని మ‌ర్చిపోవొద్దు.!

దేశంలోనే తొలిసారిగా హైద్రాబాద్ లో పాయింట్ల విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు.! కొత్త విధానం తో 24 నెలల వ్యవధిలో 12 పెనాల్టీ పాయింట్స్‌ నమోదైన వాహన దారుడి డ్రైవింగ్‌ లైసెన్స్‌ను రవాణాశాఖ అధికారులు రద్దుచేస్తారు.ఏడాది పాటు ఆ రద్దు అమల్లో ఉంటుంది. తిరిగి లైసెన్స్‌ పొందాక కూడా మరోసారి 12 పెనాల్టీపాయింట్లు మించితే 2 సంవత్సరాల వరకూ డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు చేస్తారు.

బండి న‌డిపేట‌ప్పుడు ఈ అయిందిటిని మ‌ర్చిపోవొద్దు.

1) డ్రైవింగ్ లైసెన్స్
2) R.C
3) Insurance Papers
4) Pollution Certificate
5) Helmet.

ట్రాఫిక్ అతిక్ర‌మ‌ణ‌ల‌కు ప‌డే పాయింట్లు ఇవే..!

 • ఆటోలో సామర్థ్యం కంటే అదనంగా ప్రయాణికుల్ని ఎక్కిస్తే: 1
 • సీట్‌ బెల్ట్‌ పెట్టకుండా కారు నడిపితే, శిరస్త్రాణం లేకుండా ద్విచక్రవాహనం నడిపితే: 1
 • గూడ్స్‌ వాహనాల్లో ప్రయాణికుల్ని తరలిస్తే: 2
 • రాంగ్‌ రూట్‌లో వాహనం నడిపితే: 2
 • చరవాణి మాట్లాడుతూ వాహనం నడిపితే/సిగ్నల్‌ జంపింగ్‌ చేస్తే/స్టాప్‌ లైన్‌ క్రాస్‌ చేస్తే/ప్రమాదకరంగా డ్రైవింగ్‌ చేస్తే: 2
 • జాతీయ రహదారుల్లో రోడ్డు భద్రత నిబంధనలకు విరుద్ధంగా వాహనాన్ని నిలిపితే: 2
 • బీమా పత్రాలు లేకుండా వాహనం నడిపితే: 2
 • ప్రమాదకర వస్తువుల్ని రవాణా చేసే వాహనాలకు పబ్లిక్‌ లయబిలిటీ సర్టిఫకేట్‌ లేకపోతే: 2
 • వాహనదారుల ఐపీసీ 279/336/337/338 సెక్షన్లను ఉల్లంఘిస్తే: 2
 • నిర్దేశిత వేగం క‌న్నా త‌క్కువ‌గా, 40 కి.మీ. లోపు వేగంతో వాహనం నడిపితే: 2
 • నిర్దేశిత వేగాన్ని మించుతూ, 40 కి.మీ.ల కంటే అదనపు వేగంతో వాహనం నడిపితే: 3
 • రేసింగ్‌కు పాల్పడితే: 3
 • మద్యం తాగి ద్విచక్రవాహనం నడిపితే: 3
 • మద్యం తాగి నాలుగు చక్రాల వాహనం నడిపితే: 4
 • మద్యం తాగి బస్సు/క్యాబ్‌/ఆటో నడిపితే: 5
 • ఐపీసీ 304(ఎ), 304(2)ని ఉల్లంఘిస్తే(వాహనం అజాగ్రత్తగా నడిపి ఎదుటి వ్యక్తి మరణించేందుకు కారకులైతే): 5
 • వాహనంపై వెళ్తూ గొలుసుచోరీ/దోపిడీకి పాల్పడితే: 5

లర్నర్లకు 5 పాయింట్లు మాత్రమే…
డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న‌వారికి 12 పాయింట్లు మార్జిన్ విధించ‌గా, ల‌ర్న‌ర్ లైసెన్స్ ఉన్న‌వారికి కేవ‌లం 5 పాయింట్లు మాత్ర‌మే మార్జిన్ విధించారు. అంటే ల‌ర్న‌ర్ లైసెన్స్ ఉన్న వారు పై ట్రాఫిక్ రూల్స్ అతిక్ర‌మ‌ణ‌ల‌కు పాల్ప‌డిన ప‌క్షంలో వారికి 5 పాయింట్లు దాటితే చాలు, లైసెన్స్‌ను రద్దు చేస్తారు. అలా లర్నింగ్‌ లైసెన్స్‌ను కోల్పోయిన వారు మళ్లీ ప్రాథమిక పరీక్షకు హాజరై తిరిగి ల‌ర్న‌ర్ లైసెన్స్‌ను సంపాదించి, మ‌ళ్లీ డ్రైవింగ్ టెస్ట్‌కు హాజ‌రు కావ‌ల్సి ఉంటుంది.

త‌ప్పును స‌రిదిద్దుకునేందుకు అవ‌కాశం… 
పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం ఉండ‌ద‌ని అందరికీ తెలిసిందే. దీన్ని అనుస‌రించి రవాణా శాఖ వాహ‌న‌దారుల‌కు ఓ అవ‌కాశాన్ని క‌ల్పిస్తున్న‌ది. అదేమిటంటే… డ్రైవింగ్ లైసెన్స్ స‌స్పెండ్ అయిన వారు రాష్ట్ర రవాణా శాఖ నుంచి గుర్తింపు పొందిన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే డిఫెన్సివ్‌ ట్రైనింగ్‌ కోర్సు/మోటార్‌ వెహికిల్‌ ఆక్సిడెంట్‌ ప్రివెన్షన్‌ కోర్సులో శిక్షణ పొందాలి. అలాంటి వారికి మూడు పాయింట్లు తగ్గిస్తారు. నిర్ణీత రెండేళ్ల కాల పరిమితిలో ఇలా రెండుసార్లే పాయింట్లను తగ్గించుకునేందుకు అవకాశముంది. అంటే మొత్తం 3+3=6 పాయింట్ల వ‌ర‌కు త‌గ్గుతాయి. దీంతో 12-6=6 పాయింట్లు క‌నుక అప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ మ‌ళ్లీ యాక్టివ్ అవుతుంది. ఇక మ‌రుస‌టి ఏడాది కాలంలో ఎలాంటి ట్రాఫిక్ రూల్ మీర‌కుండా మ‌ళ్లీ అదే శిక్ష‌ణ‌ను రెండు సార్లు పొందితే అప్పుడు మళ్లీ రెండు సార్లు 6 పాయింట్లు పొంది డేటాబేస్‌లో ఉన్న పాయింట్ల‌ను సున్నా చేసుకోవ‌చ్చు. దీంతో ఇబ్బందులు లేకుండా డ్రైవింగ్ చేయ‌వ‌చ్చు.

Comments

comments

Share this post

scroll to top