RTC లను లాభాల బాట పట్టించే సూపర్ ఐడియా!?

RTC నష్టాల బాటలో ఉంది అని ఎప్పుడూ అంటుంటారు. ఇలాంటి ఐడియాస్ ను  ఇంప్లిమెంట్ చేసి చూడండి…లాభాల పంట పండుతుంది. అవును కరీంనగర్ జిల్లా జగిత్యాల డిపోకు చెందిన ఉద్యోగులు ఆచరించిన ఈ ఐడియాను గనక అన్ని డిపోలు ఫాలో అయితే ఎండాకాలం పేరుమీద RTC కి గట్టిగానే ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఏప్రిల్ అంటేనే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపే నెల, ఇక మే అయితే…విశ్వరూపం చూపే నెలలు……….ఈ సమయాల్లో ప్రయాణాలంటేనే జనాలు భయపడిపోతుంటారు. విచిత్రమేంటంటే ఈ టైమ్ లోనే ఎక్కువగా పెళ్లిళ్లు ఉంటాయ్..వాటికి తప్పక హాజరు కావాల్సి ఉంటుంది.

ఓ వైపు ఎండ..మరో వైపు అత్యవసర కార్యక్రమాలు..వాటి కోసం తప్పని ప్రయాణాలు..వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని బస్ లలో కూలర్ ను ఫిట్ చేశారు జగిత్యాల డిపో ఉద్యోగులు .. ముగ్గురు ఉద్యోగులు తమ సొంత డబ్బులతో రెండు బస్ లకు రెండు రెండు కూలర్ల చొప్పున తమ సొంత డబ్బులతో కూలర్లను ఫిట్ చేసి ..ప్రయాణికులు సుఖవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్నారు.  దీనినే ఆదర్శంగా తీసుకొని అన్ని డిపోలలో ఈ పద్దతిని పాటిస్తే RTC కి ఆదాయం, ప్రయాణికులకు అనుకూలమైన ప్రయాణం.

Watch Video: ( Wait 3 Sec For Video To Load):

 

 

TSRTC AIRCOOLED EXPRESS Bus.⛄⛄⛄⛄⛄⛄⛄⛄⛄⛄⛄⛄⛄⛄JAGITYAL—-HYDERABAD……NON-STOP.#tsrtc #aircooledexpress #jagityalVideo Courtesy:: Ntv.

Posted by TSRTC Buses on Wednesday, April 6, 2016

Comments

comments

Share this post

scroll to top