బస్ లాస్ట్ సీటు లో కూర్చుంటున్నారా? అయితే మీ టికెట్ పై 20% డిస్కౌంట్ వస్తుంది.

బస్ ఎక్కితే చాలు కిటికీ పక్కన సీట్లనో, వెనుక చక్రాల కంటే ముందున్న సీట్లలో కూర్చోడానికో ఇష్టపడతాం… ముందంతా ఫుల్ అయ్యి, బస్ చివర సీట్లే ఖాళీగా ఉంటే మాత్రం ఉన్నపళంగా ఆ బస్ దిగి వేరే బస్ లో మనకు కావాల్సిన సీట్లు ఉన్నాయో లేదో చూసుకుంటాం. ఎందుకంటే బస్ వెనుక సీట్లో కూర్చుంటే స్పీడ్ బ్రేకర్స్ దగ్గర బస్ లు పైకీ కిందికి కుదిపేస్తాయి  కాబట్టి….ప్రయాణం చేయక తప్పదు అనుకుంటేనే ఆ సీట్లలో అడ్జెంట్ అవుతాం.

దాని మీదే దృష్టి పెట్టింది ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం బస్ వెనుక సీట్లలో కూర్చునే ప్రయాణికులకు టికెట్ పై 20శాతం రాయితీ ఇవ్వాలని ఫిక్స్ అయ్యింది.ఈ రాయితీ  బస్ లో చివరిగా ఉన్న  9 సీట్లకు పరిమితం. అంటే లాస్ట్ వరుసతో పాటు దానికి ముందున్న వరుస సీట్లకు ఈ రాయితీ అన్నమాట!  . గరుడ, సూపర్ లగ్జరీ, ఇంద్ర, డీలక్స్, గరుడ ప్లస్,అమరావతి బస్సులలో దూర ప్రయాణం చేసే ప్రయాణికులకు ఇది వర్తిస్తుందని ఆర్టీసీ ఎండీ సాంబశివరావు  తెలిపారు. చాలా వరకు ఆర్టీసీ బస్సులలో సౌకర్యాలు బాగుండవని, చివరి సీట్లలో కూర్చోవడం వలన పైకి కిందికి కుదిపేస్తాయని ప్రయాణికులు బుక్ చేసుకోవడం లేదు. దీని కారణంగా కొంచెం నష్టం వాటిల్లుతోంది.ఇది ముందుగా అడ్వాన్స్డ్ బుకింగ్ చేసుకునేవారితో కరెంట్ రిజర్వేషన్లకు కూడా వర్తిస్తుందట.

దీనితో పాటు మరికొన్ని కొత్త స్కీములు.

12110807833_6593eefcf2_b

  • అలాగే ఈ బస్సులలో సుమారు 250కి.మీ అంతకంటే ఎక్కువగా ప్రయాణం చేసిన వారు రెండు గంటల లోపల తమకు దగ్గరలోని ప్రాంతాలకు ఉచితంగా జిల్లా బస్సులు తెలుగు వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీబస్సులలో ప్రయాణం చేసే వెసులుబాటు కల్పిస్తున్నారు.
  •  మీకు నచ్చినలేదా సంఘసంస్కర్తల పేర్లను ఆర్టీసీ బస్టాండ్ లకు పెట్టుకోవాలనుకుంటే ఐదేళ్ళకు గాను రూ.5 లక్షలు చెల్లించవలసి ఉంటుంది .
  •  ఆర్టీసీ బస్టాండ్ లలో మినీ థియేటర్లు, మెడికల్ షాపులు, రిటైల్ షాపులు , డెంటల్, ఐ క్లినిక్ సెంటర్ లకు అనుమతి ఇవ్వనున్నారు.
మొత్తానికి ఆర్టీసీని లాభాలబాట పట్టించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది యాజమాన్యం.

Comments

comments

Share this post

scroll to top