కొత్త సీన్లను బాహుబలి కి కలుపుతున్నారు!

కలెక్షన్ల సునామి సృష్టిస్తున్న బాహుబలి కి , తాజాగా కొన్ని అధనపు సన్నివేశాలను కలుపుతారనే టాక్ వినిపిస్తోంది. బాహుబలి పార్ట్-1  విడుదల డేట్ ప్రకటించాక చాలా హడావిడాగా ఎడిటింగ్ చేశారని అందుకే సినిమాలో క్లారిటీ ఇవ్వకుండా వదిలేశారని ఇప్పుడు దానిని కవర్ చేసే పనిలో కొన్ని అధనపు సీన్లను సినిమా కు యాడ్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది.సినిమా ఆసాంతం చూసిన్పటికీ సగటు ప్రేక్షకుడు కొంత కన్ఫ్యూజన్ కు గురైన ఫీలింగ్ కలిగింది.. ఈ నేపథ్యంలో సినిమాలో మరింత క్లారిటీ ఇచ్చేందుకు బాహుబలి సినిమాకి ఓ పదినిమిషాల నిడివి గల సీన్లను కలుపుతారనే వార్తలు వినిపిస్తున్నాయ్.

bahubali image

సెకండాఫ్ లో …సుబ్బరాజు, నాజర్, అనుష్క, ప్రభాస్, రానా ల మధ్య వచ్చే సన్నివేశాలు కలుపుతారని వినికిడి. వీటిని కలపడం  ద్వారా కొంతలో కొంతైనా కన్ప్యూజన్ ను క్లియర్ చేద్దామనే ఆలోచనలో ఉన్నారట రాజమౌళి! అయితే ఇది కూడా ఒక మార్కెటింగ్ స్ట్రాటజీలాంటిదే అనే విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఆల్ మోస్ట్ ఆల్ చూడాల్సిన వాళ్ళందరూ బాహుబలిని చూసేసారు. మరోసారి వారిని థియేటర్ల బాట పట్టించాలంటే కొన్ని సీన్లను యాడ్ చేస్తే సరి, అధనపు సీన్ల కోసం మళ్లీ చచ్చినట్టు సినిమాకు వస్తారు అంటున్నారు విమర్శకులు.

అప్పట్లో  రామ్ చరణ్ హీరోగా, రాజమౌళి తెరకెక్కించిన మగధీర సినిమాలో కూడా ఇదే చేశారు. సినిమా మొదట్లో కలెక్షన్ల వర్షం కురిపించింది,  తర్వాత కొన్ని సీన్లను యాడ్ చేశారు.కలిపిన సీన్లను చూడడానికి మళ్లీ జనాలు థియేటర్ల తలుపులు తట్టారు.  సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా అదే రిపీట్ అవుతుందో లేదో చూడాలి!

CLICK: ఆ రెండు పాత్రలు బాహుబలికి మరింత సక్సెస్ నిచ్చాయ్!

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top