బుగ్గ కార్ల‌ను నేత‌లు ఎలా ప‌డితే అలా, ఎవ‌రు ప‌డితే వారు ఇక‌పై వాడ‌డానికి వీలు లేదు. ఎందుకంటే..?

మ‌న దేశంలో వీవీఐపీ సాంప్ర‌దాయం అంటే అంతే. ఒక‌దాని వెనుక ఒక కారు వెళ్తుంది. దాంతో ర‌ద్దీగా ఉన్న రోడ్లు కాస్తా వారికి స్వాగ‌తం ప‌లుకుతాయి. వారికి అవి విశాలంగా ఉంటాయి. పోలీసులు మ‌న లాంటి సాధార‌ణ ప్ర‌జ‌ల వాహ‌నాల‌ను ఆపేస్తారు క‌దా. దాంతో అస‌లే ర‌ద్దీగా ఉన్న ట్రాఫిక్ కాస్తా ట్రాఫిక్ జాంగా మారుతుంది. అప్పుడు గంట‌ల త‌ర‌బ‌డి వేచి ఉండ‌క త‌ప్ప‌దు. దీనికి తోడు గుయ్ గుయ్‌… మ‌ని వీవీఐపీల కార్లు ఒక‌దాని వెనుక ఒక‌టి సౌండ్ చేస్తూ వెళ‌తాయి. వాటి మీద ఉండే ఎర్ర బుగ్గ తిరుగుతూ ఉంటుంది. అదీ… ఇప్ప‌టి వ‌ర‌కు మ‌న దేశంలో జ‌రిగిన తంతు. కానీ ఇక‌పై అలా కాదు. ఎందుకంటే కేవ‌లం కొంద‌రు నిర్దిష్ట వ్య‌క్తులు మాత్ర‌మే అలా బుగ్గ కార్ల‌ను వాడుకోవాల్సి ఉంటుంది. ఎవ‌రు ప‌డితే వారు ఆ కార్లలో వెళ్తామంటే కుద‌ర‌దు.

మ‌న ప్ర‌ధాని మోడీ ఇటీవ‌లే సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. అది కూడా బుగ్గ కార్ల వినియోగంపై. వాహ‌నంపై ఎర్ర బుగ్గ‌ను పెట్టుకుని రాజ‌కీయ నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్ప‌డ‌డ‌మే కాదు, దాని వ‌ల్ల సామాన్య జ‌నాల‌కు ఇబ్బందులు క‌లుగుతున్నాయ‌ని ఆయ‌న తెలుసుకున్నారు. దీంతో మే 1 నుంచి అందు కోసం ఓ చ‌ట్టం అమ‌లులోకి రానుంది. దాని ప్ర‌కారం కేవ‌లం రాష్ట్ర ప‌తి, ఉప రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాన మంత్రి, సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి, లోక్ స‌భ స్పీక‌ర్ త‌ప్ప మిగిలిన ఎవ‌రూ బుగ్గ కార్ల‌ను వాడ‌రాదు. ఆఖ‌రుకు కేంద్ర మంత్రులు, ఎంపీలు కూడా అలాంటి కార్ల‌ను వాడ‌రాదు.

గ‌తంలో ఇలాంటి రూల్‌ను మొద‌ట ఢిల్లీలో ఆప్ ప్ర‌భుత్వం అమ‌లులోకి తెచ్చింది. ఆ త‌రువాత యూపీ సీఎం యోగి దాన్ని అమ‌లులో పెట్టారు. పంజాబ్‌లో అమ‌రీంద‌ర్ సింగ్ ప్ర‌భుత్వం కూడా బుగ్గ కార్ల వినియోగంపై ఆంక్ష‌లు విధించింది. దీంతో ప్ర‌ధాని మోడీ ఇప్పుడు ఆ నిర్ణ‌యాన్ని అమ‌లు చేయ‌నున్నారు. ఈ క్ర‌మంలో పైన చెప్పిన నేత‌లు కాకుండా మిగ‌తా ఎవ‌రైనా బుగ్గ కార్ల‌ను వాడితే వారిపై కఠిన చ‌ర్య‌లు ఉంటాయ‌ని మోడీ చెప్పారు. అవును మ‌రి… ఆ కార్ల వ‌ల్ల ఎలాంటి ఇబ్బందులు క‌లుగుతాయో మ‌నం చూస్తూనే ఉన్నాం క‌దా..! అందుక‌నే ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవాల్సిందే త‌ప్ప‌దు..!

Comments

comments

Share this post

scroll to top