కొత్త రూల్: “ధోని” ఇకపై అలా చేస్తే…ప్రత్యర్థికి 5 పరుగులు బోనస్..! ఎందుకో తెలుసా..?

Krishna

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ వికెట్లని చూడకుండా వెనక్కి బంతిని విసిరి రనౌట్‌తో ఇప్పటికే ఎన్నోసార్లు క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. అయితే ఇక నుంచి ఇలా చేస్తే మాత్రం ధోనీ చిక్కుల్లో పడతాడు. ఐసీసీ కొత్తగా ప్రవేశపెట్టిన నిబంధనల ప్రకారం ఇది ఫేక్ ఫీల్డింగ్ కిందికి వస్తుంది. బంతి అందుకోకపోయినా.. అందుకున్నట్లు చేసి బ్యాట్స్‌మన్‌ను మోసం చేయడం సరికాదని ఈ కొత్త నిబంధన చెబుతున్నది. దీని కింద బ్యాటింగ్ జట్టుకు ఐదు పరుగులు అదనంగా ఇస్తారు. సెప్టెంబర్ 28 నుంచే ఈ కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది.  ధోనీ రనౌట్ చేసే ముందు వికెట్లకి వ్యతిరేకదిశలో నిల్చోవడం, వెనక్కి బంతిని విసరడం కూడా ఫేక్ ఫీల్డింగ్‌ కిందకే వస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఇటీవల ఆస్ట్రేలియాకి చెందిని ఒక ఫీల్డర్ బంతి కోసం డైవ్ చేయగా అది అతనికి అందకుండా వెనక్కి వెళ్లిపోయింది. కానీ.. బంతి తన చేతికి దొరికినట్లుగా ఫీల్డర్ బ్యాట్స్‌మెన్‌ని తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో విసుతున్నట్లు నటించాడు. దీంతో అతని జట్టుకి ఐదు పరుగులు జరిమానా విధించారు. అంటే.. బ్యాట్స్‌మెన్‌కి జట్టు‌ స్కోరుకి ఐదు పరుగులు బోనస్‌గా కలపడం అన్నమాట.

watch video:


 

ఒకపక్క ధోని స్టంప్ అవుట్ చేసే విధానాన్ని ప్రపంచంలోని క్రికెట్ దిగ్గజాలు మెచ్చుకుంటుంటే..ఐసీసీ మాత్రం ఇలాంటి రూల్స్ తీసుకురావడంపై ధోని అభిమానులు వ్యతిరేకిస్తున్నారు. ధోని అలా అవుట్ చేయడం అతని నైపుణ్యత. అది తప్పు ఎందుకు అవుతుంది?

watch video:

Comments

comments