ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఇండస్ట్రీని లీకేజ్ బెడద వదలడం లేదు. బాహుబలి లాంటి భారీ బడ్జెట్ చిత్రాన్ని కూడా లీకెజ్ బెడద వణికించింది. రిలీజ్‌కి ముందే ట్రైలర్ నెట్లోకి రావడంతో యూనిట్ వెంటనే అన్ని భాషలలో బాహుబలి 2 చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. ఇక ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 25వ చిత్రం అజ్ఞాతవాసి ట్రైలర్‌కి సంబంధించిన కొంత ఫుటేజ్ బయటికి రావడంతో సినిమా యూనిట్ షాక్ అయింది..ఇదే కాదు మరో షాక్ కూడా తగిలింది ఈ సినిమాకు అదేంటంటే..
తమ అభిమాన హీరో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న పవన్ అభిమానులను ఓ వార్త కలవరపెడుతోంది. అజ్ఞాతవాసి కాపీరైట్ వివాదం చుట్టుముట్టిందని, ఈ మేరకు బాలీవుడ్ నిర్మాణ సంస్థ టి-సిరీస్ నుంచి నోటీసులు కూడా అందాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఫ్యాన్స్ షాక్‌కు గురవుతున్నారు.2008లో వచ్చిన లార్గో వించ్ కు అజ్ఞాతవాసి కాపీ అని చెప్పుకుంటున్నారు. ఫ్రెంచ్ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ‘లార్గో వించ్’ సూపర్ హిట్ అయింది. దీంతో హిందీలో రీమేక్ చేయడానికి టీ సిరీస్ రైట్స్ సొంతం చేసుకుంది. ఇపుడు ఈ సినిమాకు అజ్ఞాత వాసి కాపీ అనే టాక్ రావడంతో అలెర్ట్ అయిన టీ సిరీస్ సంస్థ అజ్ఞాతవాసి దర్శక నిర్మాతలకు నోటీసులు పంపిందని టాలీవుడ్ వర్గాల్లో వార్త హల్ చల్ చేస్తోంది.అయితే ఈ వివాదంపై నిర్మాత చినబాబు కానీ, దర్శకుడు త్రివిక్రమ్ కానీ స్పందించలేదు. అసలు ఈ వార్త ఎంతవరకు నిజమో కూడా తెలియాల్సి ఉంది. మరోవైపు ఈ విషయంపై టీసిరీస్ కూడా ఎక్కడా అధికారంగా వెల్లడించలేదు. మరో వారంలో విడుదల కాబోతున్న అజ్ఞాతవాసి కి తాజావివాదం కలం కలం రేపుతోంది.
ఈ సినిమా టీజర్ ఇంకా అంచనాలను పెంచింది.ఇక పవన్ పాడిన సాంగ్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ కానున్న సినిమా కోసం అటు సినిమా ఇండస్ట్రీ,ఇటు పవన్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ తరుణంలో అజ్ణాతవాసి కాపీరైట్ వివాదం ఏ విధంగా ముగుస్తుందో చూడాలి..