దేశంలోని ప్ర‌జ‌లంద‌రికీ ఒకే హెల్త్ పాల‌సీని తీసుకు రానున్న కేంద్ర ప్ర‌భుత్వం.!?

మ‌న దేశంలో ఉన్న ప్ర‌భుత్వ హాస్పిట‌ల్స్‌లో పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు వైద్యం ఎలా అందుతుందో అంద‌రికీ తెలిసిందే. చూద్దామంటే స‌రైన స‌దుపాయాలు ఉండ‌వు. డాక్ట‌ర్లు రారు. త‌గినంత సిబ్బంది ఉండ‌రు. దీనికి తోడు మందులు కూడా ల‌భించ‌వు. ప్రాణాపాయ స్థితిలో వైద్యం కావాల‌ని వ‌స్తే ఇక అంతే సంగ‌తులు. అలాంటి వారు ప్రాణాల‌పై ఆశ‌లు వ‌దులుకోవాల్సిందే. దీంతో చాలా మంది ప్రైవేటు ఆస్ప‌త్రుల వైపు మొగ్గు చూపుతున్నారు. డ‌బ్బులు ఖ‌ర్చ‌యినా స‌రే ప్రైవేటు ఆస్ప‌త్రుల‌కే ప్ర‌జ‌లు వెళ్తామంటున్నారు కానీ, ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌కు మాత్రం వెళ్లేది లేద‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వాలు వేల కోట్ల రూపాయ‌లు ప్ర‌జా వైద్యం కోసం ఖ‌ర్చు చేస్తున్నా అవ‌న్నీ వృథా అవుతున్నాయి. అయితే ఇక‌పై అలా కాద‌ట. కేంద్ర ప్ర‌భుత్వం దేశ వ్యాప్తంగా ఒకే హెల్త్ పాల‌సీ తీసుకురానున్న‌ద‌ట‌. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. దీంతో పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతుందని తెలిసింది.

కేంద్ర ప్ర‌భుత్వం త్వ‌ర‌లోనే పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల కోసం ఓ వినూత్న‌మైన హెల్త్ పాల‌సీని తీసుకు రానున్న‌ట్టు సమాచారం. ఇందులో ప్ర‌జ‌లంద‌రి పేర్ల‌ను న‌మోదు చేస్తారు. అందుకు అవ‌స‌ర‌మ‌య్యే నియ‌మ నిబంధ‌న‌ల‌ను రూపొందిస్తున్న‌ట్టు తెలిసింది. అయితే ఈ హెల్త్ పాల‌సీ ద్వారా ప్ర‌జ‌లు దేశంలోని ఏ హాస్పిట‌ల్‌కు వెళ్లినా అంద‌రికీ ఒకేలాంటి వైద్యం అందుతుంద‌ట‌. కార్పొరేట్ స్థాయి వైద్య సౌక‌ర్యాలు వారికి ల‌భిస్తాయి. చికిత్స నుంచి మందుల వ‌ర‌కు అన్నీ ఉచిత‌మేన‌ట‌.

అయితే ఈ హెల్త్ పాల‌సీ గురించి ప్ర‌స్తుతం కేంద్ర ప్ర‌భుత్వం చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్టు తెలిసింది. దీంతో త్వ‌ర‌లోనే ఆ దిశ‌గా ప్ర‌త్యేక చ‌ట్టం వ‌చ్చే అవ‌కాశం కూడా లేకపోలేద‌ని స‌మాచారం. అది గ‌న‌క వ‌స్తే ఇక ప్రైవేటు ఆసుప‌త్రుల్లోనూ ప్ర‌జ‌ల‌కు ఏ వైద్య‌మైనా ఉచితంగా అందుతుంది. దేశ వ్యాప్తంగా ఏటా అనేక మంది ప్ర‌జ‌లు స‌రైన వైద్యం లేక చ‌నిపోతున్నార‌ని, అందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనున్న‌ట్టు తెలిసింది. ఇక దీని గురించిన వివ‌రాలు త్వ‌ర‌లో తెలిసే అవ‌కాశం ఉంది. ఏది ఏమైనా ఆ పాల‌సీ గ‌న‌క వ‌స్తే అప్పుడు వైద్యం కోసం ప్ర‌జ‌లు ల‌క్ష‌లు వెచ్చించాల్సిన ప‌ని ఉండ‌దు.

Comments

comments

Share this post

scroll to top