కొత్తగా కార్ నేర్చుకుంటున్న వ్యక్తి చేసిన నిర్వాహకం..! (Shocking).

కార్ నేర్చుకోవడంలో  తప్పులేదు.. కానీ నేర్చుకునే పద్దతి మాత్రం ఇలా ఉండ కూడదు. కొత్తగా ఎవరైనా కార్ నేర్చుకోవాలనుకునే వారికి ఖచ్చితంగా చూపించాల్సిన వీడియో ఇది.! అప్పుడైనా డ్రైవింగ్ చేసేప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. నేర్పేవాళ్ళు కూడా అప్రమత్తతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక్కసారి ఈ వీడియోను పరిశీలిస్తే ఇరుకు వీధిలోకి ఓ కార్ రయ్ మంటూ  దూసుకువచ్చింది…  ఆ వేగం ఖరీదు అనుకోండి, లేక  కొత్త డ్రైవర్ బోణి అనుకోండి ఓ నిండు ప్రాణం మాత్రం బలయ్యింది. కార్ నేర్చుకుంటున్న కొత్త వ్యక్తి..కార్ నేర్చుకునే క్రమంలో బ్రేక్ అనుకోని ఎక్స్ లేటర్ మీద కాలు పెట్టి అలాగే ప్రెస్ చేసి పట్టుకోవడంతో కార్  మెరుపు వేగంతో దూసుకొచ్చి ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఓ కుర్రాడు చాకచక్యంగా తప్పించుకున్నాడు కానీ…లేకపోతే కొత్త డ్రైవర్ ఖాతాలో రెండు వికెట్లు పడేవి.!  ఏదైనా వాహనాన్ని నేర్చుకునే  వారు ఓపెన్ ఏరియాలో నేర్చుకుంటే మంచింది. జనాలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో నేర్చుకుంటే పరిణామాలు ఇలాగే ఉంటాయ్.

Watch Video:( Wait 3 Seconds For Video To Load)

కార్ నేర్చుకునే వ్యక్తి చేసిన నిర్వాహకం.!!

Posted by Chantigadu on Thursday, October 29, 2015

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top