ఆన్ – ఆఫ్ మాయం :ఇక‌పై రాత్రే కాదు…ప‌గ‌లు కూడా బండి లైట్స్ ఆన్ చేసే ఉంచాలి..కొత్త బీఎస్ -4 చూడండి!

మనం ద్విచక్రవాహనం పై వెళుతున్నప్పుడు పగటి పూట పొరపాటున లైట్ వేసుకొని వెళుతున్నాము అనుకోండి!…వెంటనే ఎదురుగ వచ్చేవారు మనకి లైట్ వేసి ఉంది అని సంకేతం ఇస్తారు!..ఇలాంటి సంఘటన వాహనం నడిపే ప్రతి ఒక్కరికి ఎదో ఒక సందర్భంలో ఎదురయ్యే ఉంటది…కానీ ఏప్రిల్ 1 నుండి పగటి పూట కూడా ద్విచక్ర వాహనం లైట్ వేసుకొనే నడపాలి అంట!…అదేంటి అని షాక్ అవుతున్నారా?..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇచ్చిన ఆదేశాలు అవి!…వివరాలు ఏంటో చూడండి!

ఆటోమేటిక్‌ హెడ్‌ల్యాంప్‌ ఆన్‌ (ఏహెచ్‌వో):

ఈ ఏడాది ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి విక్రయించే వాహనాల్లో ‘ఆటోమేటిక్‌ హెడ్‌ల్యాంప్‌ ఆన్‌ (ఏహెచ్‌వో)’ టెక్నాలజీని తప్పనిసరి చేస్తూ కేంద్ర రవాణ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది.  అయితే పాత వాహనాలకు మాత్రం ఈ కొత్త ప్రక్రియ వర్తించదు!…ఇక పై మార్కెట్ లోకి వచ్చే కొత్త వాహనాలకు “లైట్ ఆన్ / ఆఫ్” స్విచ్ ఉండదు…ఇంజిన్ ఆన్ చేయగానే లైట్ కూడా ఆన్ అవుతుంది…ఇంజిన్ ఆఫ్ చేయగానే లైట్ కూడా ఆఫ్ అవుతుంది..

ఇలా చేయడానికి కారణం:

కారు, బస్సు, లారీ…ఇలా భారీ వాహనాలకు ఎదురుగ వచ్చే ద్విచక్ర వాహనాలు సరిగా కనపడకపోవడం వాళ్ళ ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి…ఒక ఏడాదిలో ఈ కారణంగా 30000 ఆక్సిడెంట్ లు జరుగుతున్నాయి అంట!… ఈ విషయాన్నీ పరీశిలించిన సుప్రీమ్ కోర్ట్ ఏర్పాటు చేసిన కమిటీ ప్రపంచవ్యాప్తంగా అమలులో ఉన్న ఈ కొత్త విధానాన్ని మన దేశంలో కూడా అమలు చేయాలనీ సూచించింది!…యూరప్, మలేషియా వంటి చాలా దేశాల్లో 2003 నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.

రోడ్డు ప్ర‌మాదాలను నివారించేందుకు సుప్రీంకోర్టు చ‌ర్య‌ల్లో భాగంగా బీఎస్‌-3 వాహ‌నాల అమ్మ‌కం మార్చి 31తోనే ముగిసింది. ఇక ఏప్రిల్ 1 నుంచి బీఎస్ -4 వాహ‌నాలు మాత్ర‌మే విక్ర‌యించాల‌ని సూచించ‌డంతో … పేరుకుపోయిన బీఎస్-3 ద్విచ‌క్ర‌వాహ‌నాల‌ను డిస్కౌంట్ ఇచ్చి త‌క్కువ ధ‌ర‌కే విక్ర‌యించాయి ద్విచ‌క్ర వాహ‌న యాజ‌మాన్యాలు. ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల మేర‌కు అన్ని షోరూమ్‌ల‌లో బీఎస్‌-4 ద్విచ‌క్ర‌వాహ‌నాల అమ్మ‌కాలు ప్రారంభ‌మ‌య్యాయి. బీఎస్ -4 వాహ‌నాల్లో బండి ఆన్‌లో ఉన్న‌ప్పుడు ఆటోమేటిగ్గా హెడ్‌ల్యాంప్ ఆన్ అవుతుంది. దీంతో ప‌గ‌టి వేళ‌ల్లో కూడా హెడ్‌లైట్ ఆన్ అయి ఉండ‌టంతో ఎదురుగా వ‌చ్చే వాహ‌నదారులు అప్ర‌మ‌త్తంగా ఉంటారని దీని ద్వారా ప్ర‌మాదాల‌ను నివారించొచ్చ‌ని ప‌లు ప‌రిశోధ‌న‌ల ద్వారా వెల్ల‌డి అయ్యింది. బీఎస్‌-4 వాహ‌నాల్లో హెడ్ ల్యాంప్ ఆన్ ఆఫ్ స్విచ్ ఉండ‌దు.

Comments

comments

Share this post

scroll to top