త్వ‌ర‌లో రానున్న రూ.50 కొత్త నోటు.. ఎలా ఉందో తెలుసా..?

గ‌తేడాది న‌వంబ‌ర్ 8వ తేదీన ప్ర‌ధాని మోడీ పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేసిన విషయం తెలిసిందే. రూ.500, రూ.1000 నోట్ల‌ను ప్ర‌భుత్వం ర‌ద్దు చేసింది. దీంతో కొత్త‌గా రూ.2000, రూ.500 నోట్ల‌ను ఆర్‌బీఐ ముద్రించి అందుబాటులోకి తెచ్చింది. అయితే అప్పట్లోనే ఆర్‌బీఐ రూ.20, రూ.50 నోట్ల‌ను కూడా విడుద‌ల చేయ‌నున్న‌ట్టు తెలిపింది. ఈ క్ర‌మంలో అతి త్వ‌ర‌లో రూ.50 నోటు చెలామ‌ణీలోకి రానుంది. దానికి చెందిన శాంపిల్ ఫొటోల‌ను ఆర్‌బీఐ తాజాగా విడుద‌ల చేసింది.

చిత్రంలో చూశారు క‌దా. మ‌హాత్మా గాంధీ బొమ్మ ఉన్న రూ.50 నోట్ల‌ను త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఆర్బీఐ పేర్కొంది. దానిపై ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ డాక్ట‌ర్ ఉర్జిత్ ప‌టేల్ సంత‌కం ఉంటుంది. నోటు వెన‌క భాగంలో హంపి రథం బొమ్మ ఉంటుంది. సాంస్కృతి వార‌సత్వానికి నిద‌ర్శ‌నంగా హంపి బొమ్మ‌ను ముద్రించారు. ఫ్లోరోసెంట్ నీలి రంగులో నోటు ఉంటుంది. క‌ల‌ర్ స్కీమ్‌తో పాటు ఇత‌ర డిజైన్‌, జియోమెట్రిక్ ప్యాట‌ర్స్న్ ఉంటాయ‌ని ఆర్బీఐ తెలిపింది.

అయితే ప్ర‌స్తుతం ఉన్న పాత రూ.50 నోటు కూడా చెలామ‌ణిలో ఉంటుంద‌ని ఆర్బీఐ వెల్ల‌డించింది. కాగా కొత్తగా విడుద‌ల కానున్న రూ.50 నోటుకు చెందిన ప‌లు బండిల్స్ ఇప్పుడు నెట్‌లో లీకయ్యాయి. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. గ‌తంలో వ‌చ్చిన రూ.2000, రూ.500 నోటు మాదిరిగానే రూ.50 నోటుపై కూడా అంకెలు రైజింగ్ సిరీస్‌లో ఉంటాయి. మ‌హాత్మా గాంధీ సిరీస్ 2005 నోట్లుగా వీటిని పిలుస్తున్నారు. అయితే వీటిని ఎప్పుడు విడుదల చేస్తారు అనే విష‌యంపై మాత్రం స్ప‌ష్ట‌త లేదు. కాగా రూ.20 నోటును కూడా విడుద‌ల చేస్తామ‌ని ఆర్‌బీఐ గ‌తంలో ప్ర‌క‌టించింది. అయితే దాని గురించిన వివ‌రాలేవీ ప్ర‌స్తుతం తెలియ‌రాలేదు.

Comments

comments

Share this post

scroll to top