నోట్ మీదున్న గాంధీ బొమ్మే.. ఆ నోట్ అసలా?నకిలియా? అని చెబుతుంది.!

కొత్త  2000/- నోట్లు ఇలా వచ్చాయో లేదో? వెనువెంటనే నకిలీ నోట్లు రంగప్రవేశం చేశాయి. అయితే కొత్త నోటు మీదున్న సింపుల్ లాజిక్ ను తెలుసుకుంటే చాలు….ఫేక్ నోట్లను ఇట్టే పసిగట్టొచ్చు. అవును కొత్త 2000/- నోటు మీద ఉన్న మహాత్మగాంధీ గారి బొమ్మను చూసి ఆ నోట్ ఒరిజినలా? ఫేకా అని  చెప్పొచ్చు అదెలాగో తెలుసా?

2000/- నోట్ మీదున్న గాంధీ తాత బొమ్మను  జాగ్రత్తగా పరిశీలిస్తే……ఆయన కళ్లద్దాలకు సపోర్ట్ గా ఉండే బార్ లో RBI అని రాసి ఉంటుంది. జాగ్రత్తగా పరిశీలిస్తే కానీ ఈ విషయం అర్థం కాదు. దీనిని కలర్ జిరాక్స్ తీసినా…దొంగనోట్లుగా తయారు చేయాలని ప్రయత్నించినా…ఈ RBI అనే ఇంగ్లీష్ అక్షరాలు..ఈ ఫ్లేస్ లో రావు.

2000_note_secret_feature_

ఇదే కాక….దొంగ నోట్లను గుర్తించడానికి ఇంకా 17 మార్గాలున్నాయి..అన్నింట్లో ఇదే అత్యుత్తమమైనది అయినప్పటికీ…మిగితా వాటి గురించి కూడా ఓ సారి తెల్సుకోండి.

new-note-features-1

1. నోటుపై ఎడ‌మ భాగంలో ఆ నోటు విలువను తెలిపే సంఖ్య తెల్ల‌ని అక్ష‌రాల్లో ప్రింట్ చేసి ఉంటుంది. నోటును జాగ్ర‌త్త‌గా ప‌రిశీలిస్తే ఆ విష‌యం తెలుస్తుంది.

2. నోటుకు ఎడ‌మ‌భాగంలోనే ఆ నోటు విలువ‌ను తెలిపే సంఖ్య బ‌య‌ట‌కు క‌న‌బ‌డ‌ని విధంగా లేటెంట్ ఇమేజ్ రూపంలో ఉంటుంది. దాన్ని కూడా జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించాలి. అప్పుడే నోటు సంఖ్య తెలుస్తుంది.

3. నోటుపై దేవ‌నాగ‌రి లిపిలో ఆ నోటు విలువ‌ను తెలిపే సంఖ్య‌ను ప్రింట్ చేశారు.

4. ఇంత‌కు ముందు ఉన్న నోట్ల‌పై మ‌హాత్మా గాంధీ బొమ్మ ఓ వైపుకు చూస్తూ ఉంటే, ఇప్పుడు మ‌రో వైపుకు ఉంది. అదేవిధంగా ఆ బొమ్మ సైజ్‌ను కూడా త‌గ్గించారు.

new-note-features-2

5. నోటుకు మ‌ధ్యభాగంలో కాకుండా కొంచెం కుడివైపుకు ఉండేలా దాని లోప‌లి నుంచి ఓ సెక్యూర‌టీ త్రెడ్‌ను ఏర్పాటు చేశారు. అది గ్రీన్ నుంచి బ్లూ క‌ల‌ర్‌కు మారుతూ ఉంటుంది.

6. గ్యారంటీ క్లాజ్‌, ఆర్‌బీఐ గ‌వ‌ర్న‌ర్ సంత‌కం, ప్రామిస్ క్లాజ్, ఆర్‌బీఐ చిహ్నం వంటి వాటి స్థానాల‌ను కుడి వైపుకు మార్చారు.

7. నోటుపై ఉండే ఖాళీ తెల్ల‌ని ప్ర‌దేశంలో గాంధీ, నోటు విలువ‌ను తెలిపే సంఖ్య‌కు చెందిన వాట‌ర్ మార్క్స్ ఉంటాయి.

8. నోటు ఎడ‌మ భాగంలో పై వైపున‌, కుడి భాగంలో కింది వైపున ఆ నోటు సీరియ‌ల్ నంబ‌ర్ చిన్న అంకెల‌తో మొద‌లై క్ర‌మంగా పెద్ద సైజ్ ఉన్న అంకెల‌తో ముగుస్తుంది.

new-note-features-3

9. నోటుపై ఆ నోటు విలువ‌ను తెలిపే సంఖ్య గ్రీన్ క‌ల‌ర్ నుంచి బ్లూ క‌ల‌ర్‌కు మారుతూ ఉంటుంది.

10. నోటు కుడిభాగంలో చివ‌ర‌న అశోక స్థూప చిహ్నం ఉంటుంది.

11. అశోక చిహ్నంపైనే నోటు విలువ‌ను తెలిపే సంఖ్య ఉబ్బెత్తుగా ప్రింట్ చేయ‌బ‌డి ఉంటుంది.

12. నోటుకు కుడి, ఎడ‌మ భాగాల్లో చివ‌ర‌న ఉబ్బెత్తుగా ప్రింట్ చేయ‌బ‌డిన గీత‌లు ఉంటాయి. ఇవి నోటు, నోటుకూ మారుతాయి. నోటు విలువ ఎంత ఉందో దాన్ని బ‌ట్టి గీత‌లు ఉంటాయి.

new-note-features-4

13. నోటు వెనుక భాగంలో ఎడ‌మ వైపు దాన్ని ప్రింట్ చేయ‌బ‌డిన సంవ‌త్స‌రం ఉంటుంది.

14. నోటు వెనుక వైపు ఎడ‌మ భాగంలో కింద స్వ‌చ్ఛ భార‌త్ చిహ్నం ఉంటుంది.

15. నోటు వెనుక భాగంలో ఎడ‌మ వైపుగా వివిధ భాష‌ల‌కు చెందిన అక్ష‌రాలు ఉంటాయి. ఇవి నోటు విలువ‌ను తెలియ‌జేస్తాయి.

16. నోటు వెనుక వైపు ఎక్కువ భాగంలో ఎర్ర‌కోట బొమ్మ ఉంటుంది. దానిపై జాతీయ జెండా ఎగురుతూ ఉంటుంది.

Comments

comments

Share this post

scroll to top