చికెన్, మటన్, ఎగ్స్… ఇలా నాన్వెజ్ ఆహారాలు ఎన్ని ఉన్నా చాలా మందికి చేపలు తినడం అంటే చాలా ఇష్టం. వాటితో పులుసు లేదా ఫ్రై చేసుకుని తింటారు. ఈ క్రమంలోనే చేపల్లో మనకు ఎన్నో రకాలు లభిస్తున్నాయి. కొన్ని రేటు తక్కువ ఉంటే కొన్ని రేటు ఎక్కువ ఉంటాయి. కొన్ని ముళ్లు ఎక్కువ ఉంటే, కొన్ని తక్కువ కలిగి ఉంటాయి. అయితే చేపల్లో ఎన్ని రకాలు ఉన్నప్పటికీ ముఖ్యంగా వాటిలో కొన్ని రకాలకు చెందిన చేపలను అస్సలు తినకూడదు. మరి ఆ చేపలు ఏమిటో, వాటిని ఎందుకు తినకూడదో, తింటే వాటి వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి హాని కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. తిలాపియా
ఈ చేపల్లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. అవి మన శరీరానికి పనికొచ్చే కొవ్వులు కాదు, మన ఆరోగ్యాన్ని నాశనం చేసే కొవ్వులు. కనుక ఈ చేపలను తింటే ఆ కొవ్వు మన శరీరంలోకి చేరి అనారోగ్యాలను కలిగిస్తుంది. కొలెస్ట్రాల్ పెరిగిపోయి గుండె జబ్బులు వస్తాయి. కాబట్టి తిలాపియా చేపలను తినరాదు.
2. సీ బేస్
ఈ చేపలను కూడా మనం తినరాదు. ఎందుకంటే వీటిల్లో ఎక్కువగా మెర్క్యురీ ఉంటుంది. మెర్క్యురీ అంటే పాదరసం. కనుక ఇద లోపలికి వెళితే శరీరం విషతుల్యం అవుతుంది. కొన్ని సందర్భాల్లో మరణం కూడా సంభవించవచ్చు. సాధారణంగా ఈ చేపలు చాలా తక్కువ ధరకే వస్తాయి. కనుక కొందరు హోటల్స్ వారు వీటిని వివిధ రకాల ఫిష్ వెరైటీలుగా చేసి విక్రయిస్తారు. కాబట్టి బయట ఫిష్ ఫుడ్ తినేవారు ఒకసారి ఆలోచించాలి.
3. ఈల్
ఈ చేపల్లో కూడా పెద్ద ఎత్తున పాదరసం ఉంటుంది. దీనికి తోడు నదులు, చెరువులు, సముద్రాల్లో వదిలే పారిశ్రామిక వ్యర్థాలను ఈ చేపలు సేవిస్తాయి. కనుక ఆ వ్యర్థాలు కూడా చేపల్లో ఉంటాయి. కాబట్టి ఈ చేపలను తినరాదు.
4. పంగాసియస్
నైట్రోఫ్యురాజోన్, పాలీ పాస్ఫేట్స్ అనబడే విష పదార్థాలు ఈ చేపల్లో ఎక్కువగా ఉంటాయి. ఈ చేపలు వ్యర్థాలను తిని పెరుగుతాయి. కనుక వీటికి కూడా దూరంగా ఉండాల్సిందే.
5. ట్యూనా
ట్యూనా చేపల్లోనూ పెద్ద ఎత్తున పాదరసం ఉంటుంది. దీనికి తోడు వీటిని ఫాంలలో పెంచితే వాటికి హార్మోన్ ఇంజెక్షన్స్, రసాయనాలు ఎక్కించి విక్రయిస్తారు. కనుక వీటిని కూడా తినరాదు. తింటే శరీరం విష తుల్యం అవుతుంది. అనారోగ్యాల బారిన పడతారు.