తెలుగు మ‌హాస‌భ‌ల్లో ఆక‌ట్టుకున్న ఈ ఇద్దరు సిస్టర్స్ గురించి ఈ విషయాలు తెలుస్తే ఫిదా అవ్వాల్సిందే..!

అష్టావ‌ధానం తెలుసు, శ‌తావ‌ధానం తెలుసు…కానీ నేత్రావ‌ధానం గురించి మ‌న‌లో చాలా మందికి తెలిసి ఉండ‌దు… అలాంటి నేత్రావాధానంలో అద‌ర‌గొడుతున్నారు ఖ‌మ్మం జిల్లాకు చెందిన శిరీష సిస్ట‌ర్స్. ! గురువు నుండి నేర్చుకున్న విద్యను ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భా వేధిక మీద ప్ర‌ద‌ర్శించి ప్రేక్ష‌కుల‌ను విస్మ‌యానికి గురిచేశారు ఆ అక్కాచెళ్లెల్లు.! ప్రేక్ష‌కులు కాగితం మీద రాసిచ్చిన వాక్యాన్ని ఒక‌రు క‌ను సైగ‌ల ద్వారా వివ‌రిస్తే…మ‌రొక‌రు ఆ వాక్యం ఎంటో చెప్ప‌డ‌మే నేత్రావ‌ధానం….కేవ‌లం క‌ళ్ళ ద్వారానే స‌మాచారం ట్రాన్స్ఫ‌ర్ అవుతుంద‌న్న మాట‌.!

క్లిష్ట‌త‌ర‌మైన విద్యను 6 క్లాస్ లోనే అభ్య‌సించిన ఈ సిస్ట‌ర్స్ …అనేక వేదిక మీద 100కు పైగా ప్ర‌ద‌ర్శ‌న‌లిచ్చి జాతీయ స్థాయిలో 2014లో ‘నిపుణ’ అవార్డ్ ద‌క్కించుకోవ‌డంతో పాటు తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, తెలంగాణ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాధించుకున్నారు. ప్ర‌స్తుతం ఇంట‌ర్మీడియ‌ట్ చ‌దువుతున్న శీరిష సిస్ట‌ర్స్ ఈ విద్య‌ను త‌మ స్కూల్ టీచ‌ర్ అయిన ఆదినారాయ‌ణ వ‌ద్ద నేర్చుకున్నారు.

ప్రభుత్వ టీచ‌ర్ అయిన ఆదినారాయ‌ణ‌….ఈ నేత్రావ‌ధాన విద్య‌ను త‌న ఉపాధ్యాయుడి ద్వారా నేర్చుకున్నాడు..కానీ కుటుంబ కార‌ణాల కార‌ణంగా ఈ విద్య‌ను ప్ర‌ద‌ర్శించ‌లేక‌పోయారు. ఆ స‌మ‌యంలో త‌మ స్కూల్ లో చ‌దువుతున్న శీరిష సిస్ట‌ర్స్ టాలెంట్ ను గ్ర‌హించి..ఈ విద్య‌ను వారికి నేర్పారు. 6 క్లాస్ నుండి రోజూ సాయంత్రం కాసేపు నేత్రావ‌ధాన ప్రాక్టీస్ చేస్తుండేవారు….ఇది వారి విద్య‌లో భాగంగా మారింది. ఒక్కో అక్ష‌రానికి ఒక్కో సంజ్ఞ ఉండ‌డం దానిని ఆ క్ర‌మంలో గుర్తుంచుకోవ‌డం ఈ విద్య విశిష్ట‌త‌.!

Comments

comments

Share this post

scroll to top