మీ బాడీ పార్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం అని ట్వీట్ చేసిన వ్యక్తికి దిమ్మ తిరిగే రిప్లై ఇచ్చిన తాప్సి..!

హీరోయిన్ తాప్సి తెలుగు నాట బాగా పాపులర్ హీరోయిన్, ప్రస్తుతం తెలుగు చిత్ర సీమ లో అవకాశాలు సన్నగిల్లాయి ఈ భామ కి. కానీ హిందీ లో మాత్రం ఈ భామ ఒక ఊపు ఊపుతుంది. హిందీ లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. గ్లామర్ పాత్రలతో పాటు, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో కూడా నటిస్తుంది తాప్సి. సోషల్ మీడియా లో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటాది తాప్సి, ముఖ్యంగా ట్విట్టర్ లో బాగా యాక్టీవ్ గా ఉంటారు. ట్విట్టర్ లో ఒక వ్యక్తి తాప్సి ని ట్యాగ్ చేసి మీ బాడీ పార్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం అని ట్వీట్ చేసాడు.

నాకు కూడా :

నాకు కూడా నా బాడీ పార్ట్స్ అంటే చాలా ఇష్టం అని తాప్సి అతగాడి ట్వీట్ కి రిప్లై ఇచ్చింది, నా బాడీ పార్ట్స్ లో నాకు ఇష్టమైన పార్ట్ మస్తిష్కపు ( సెరిబ్రమ్ ) అని తాప్సి ట్వీట్ చేసింది, తాప్సి చేసిన ట్వీట్ కు నెటిజన్స్ అంత ఆమెను మెచ్చుకుంటున్నారు, సరైన ట్వీట్ వేశావు అని ఆమెను మెచ్చుకుంటున్నారు, ఇలా అమ్మాయిల బాడీ పార్ట్స్ పైన అసభ్యంగా కామెంట్స్ చేసే వెధవళలకు బుద్ధి చెప్పింది తాప్సి.

మస్తిష్కపు ( సెరిబ్రమ్ ) అంటే.. జై గూగుల్ తల్లి..!!

తాప్సి వేసిన ట్వీట్ తరువాత గూగుల్ లో చాలా మంది మస్తిష్కపు ( సెరిబ్రమ్ ) ని సెర్చ్ చేసారు అని గూగుల్ ట్రెండ్స్ లో నిరూపితమైనది, చిన్నప్పుడు మనం మన మెదడు లోని పార్ట్స్ గురుంచి చదువుకున్నాం. కానీ అవన్నీ గుర్తు ఉంటె అలాంటి ట్వీట్ ఎందుకు వేస్తాడు తను అని తాప్సి ని ట్రోల్ చేసిన వ్యక్తిని ఆడుకుంటున్నారు సోషల్ మీడియా లో.

ఇవన్నీ కామన్ :

బాలీవుడ్ లో అనే కాదు, జనరల్ గా హెరొఇనెస్ అందరిని ఇలాగె ట్రోల్ చేసే వెధవలు చాలా మంది ఉంటారు, కానీ సామాన్యంగా హీరోయిన్స్ వారిని పట్టించుకోరు. ఒకవేళ పట్టించుకుంటే ట్రోల్ చేసే వాళ్ళకి చాలా గట్టిగా దింపుతారు అని తాప్సి మరోసారి నిరూపించింది.

Tweet:

View image on Twitter

Comments

comments

Share this post

scroll to top