మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల బాలకృష్ణ పైన కొన్ని వ్యాఖ్యలు, వీడియోలు చేసి సోషల్ మీడియా లో సంచలనం రేపాడు. ప్రత్యేక్షంగాను పరోక్షంగానూ బాలకృష్ణ పైన విరుచుకుపడ్డాడు నాగబాబు. బాలకృష్ణ ఎప్పుడో అనిన మాటలను పట్టుకొని ఎన్నికల సమయం ముందు తొవ్వాల్సిన అవసరం ఏముందని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. జనసేన కార్యకర్తలతో మీటింగ్ లు నడుపుతున్న నాగబాబు. సోషల్ మీడియా ద్వారా జనసేన పార్టీ ప్రొమోషన్స్ లో పాలుపంచుకుంటున్నారు.
జగన్.. బిర్యానీ.. :
కేవలం బాలకృష్ణ వరకే అనుకున్నారు అంతా, కానీ జగన్ ని కూడా టార్గెట్ చెయ్యడం తో జగన్ అభిమానులు నాగబాబు పైన విరుచుకుపడ్డారు, తమ్ముడి కోసమే నాగబాబు ఇదంతా చేస్తున్నాడా అంటే అవుననే అంటున్నారు కొందరు మెగా అభిమానులు. ఎన్నికల్లో జనసేన కు మద్దతు ఇస్తా అని నాగబాబు ఇది వరకే తెలిపాడు. ఎమ్.ఎల్.ఏ సీట్ కావాలంటే జగన్ కి డబ్బులు ఇవ్వాలని నాగబాబు వీడియో లో తెలిపారు. అయితే నాగబాబు చెప్పిన మాటలకు చిరంజీవి గారిని లాగి కౌంటర్లు వేస్తున్నారు. 2009 ఎన్నికల్లో చిరంజీవి సీట్ కి ఎంత తీసుకున్నారు అని నాగబాబు కి కౌంటర్లు వేస్తున్నారు.
ఇక్కడ మొదలయింది.. బాలకృష్ణ ఎవరో తెలీదు అన్నందుకు క్షమించండి-నాగబాబు
బాలకృష్ణ ఎవరో తెలియదని అన్నందుకు నన్ను క్షమించండి అంటూ నాగబాబు ఇవ్వాళ ఫేస్బుక్ లో ఒక వీడియో పెట్టాడు, బాలకృష్ణ గారిని మర్చిపోడం నిజంగా నా తప్పే, నేను కావాలని చెయ్యలేదు, నన్ను క్షమించండి అంటూ నాగబాబు బాధ పడ్డాడు.
బాలకృష్ణ ఒక కమెడియన్- నాగబాబు
“బాలకృష్ణ గారిని మర్చిపోడం తప్పే, ఆయన చాలా మంచి కమెడియన్. ఎన్టీఆర్, కృష్ణ గారితో కూడా అయన అప్పట్లో నటించారు, హాస్యం పండించడంలో ఆయనది ఒకరకమైన స్టైల్, బాలకృష్ణ గారి గురుంచి ఎంత చెప్పిన తక్కువే. బాలకృష్ణ గారి పూర్తి పేరు వల్లూరి బాలకృష్ణ, మీరు కావాలంటే వికీపీడియా లో సేర్చ్ చేసి అయన హిస్టరీ తెలుసుకోవచ్చు” అని ఫేస్బుక్ వీడియో లో చేప్పాడు నాగబాబు.
Watch Video: