ఇంట‌ర్నెట్‌లో నీలి చిత్రాలు ఎక్కువ‌గా చూసే వారు చివరకు అలా మారుతార‌ట‌..!

అతి స‌ర్వ‌త్ర వ‌ర్జ‌యేత్ అన్నారు పెద్ద‌లు. అంటే ఏ విష‌యంలోనూ అతి ప‌నికి రాద‌ని దానర్థం. అది ఏదైనా కావ‌చ్చు. అతిగా చేస్తే ఇబ్బందులే వ‌స్తాయి. స‌రిగ్గా ఇది ఆ విషయానికి కూడా వ‌ర్తిస్తుంది. ఆ విష‌య‌మంటే… అదేనండీ..! ఇంట‌ర్నెట్ పోర్నోగ్ర‌ఫీ (నెట్‌లో నీలి చిత్రాలు చూడ‌డం). సాంకేతిక ప‌రిజ్ఞానం ఊహ‌కంద‌ని విధంగా మారుతున్న రోజులివి. ప్ర‌తి ఒక్క‌రి చేతిలోనూ నేడు స్మార్ట్‌ఫోన్లు సంద‌డి చేస్తున్నాయి. దీనికి తోడు ఇంట‌ర్నెట్ కూడా ఎక్క‌డ ప‌డితే త‌క్కువ వ్య‌యానికే ల‌భిస్తుండ‌డంతో ప్ర‌తి ఒక్క‌రు నెట్ ప్ర‌పంచంలో విహ‌రిస్తున్నారు. అయితే నాణేనికి రెండు వైపులు ఉన్న‌ట్టే టెక్నాల‌జీ వ‌ల్ల ఎంత లాభం ఉందో అంతే న‌ష్టం కూడా క‌లుగుతోంది. ప్ర‌ధానంగా ఇంట‌ర్నెట్ వ‌ల్ల‌యితే మ‌నం ఎంత‌గా లాభ ప‌డుతున్నామో అంతే విధంగా న‌ష్టం కూడా సంభ‌విస్తోంది. అందులో ఒక‌టే పోర్న‌గ్ర‌ఫీ. ఇంట‌ర్నెట్ అశ్లీల‌త‌. పేరేదైనా ఇంట‌ర్నెట్‌లో మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డే వెబ్‌సైట్లు ఎన్ని ఉన్నాయో, పోర్న్ సైట్లు కూడా అన్నే ఉన్నాయి. ఈ క్ర‌మంలో వీటిని చూస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువే ఉంద‌ని చెప్ప‌వ‌చ్చు. ప్ర‌ధానంగా యువ‌త ఎక్కువ‌గా ఇలాంటి సైట్ల బారిన ప‌డుతున్నారు.

387412-porn700

అయితే ఇంట‌ర్నెట్ పోర్నోగ్ర‌ఫీ మాటేమోగానీ అలాంటి సైట్ల‌ను చూసే వారిలో ఆధ్యాత్మిక భావన‌లు క‌లుగుతున్నాయ‌ట‌. వింటానికి ఆశ్చ‌ర్యంగా ఉన్న ఇది నిజ‌మేన‌ట‌. సాధార‌ణంగా శృంగార భావ‌న‌లు, లైంగిక కోర్కెలు పెర‌గ‌డం కోసం ఇలాంటి సైట్ల‌ను ఎక్కువ‌గా చూస్తార‌ని ప్ర‌చారంలో ఉంది. అయితే ప‌లువురు ప‌రిశోధ‌కులు మాత్రం అందుకు విభిన్న‌మైన అంశాల‌ను తెర‌పైకి తెచ్చారు.

porn-computer-key_large

అమెరికాలోని ‘జర్నల్‌ ఆఫ్‌ సెక్స్‌ రీసెర్చ్’లో ఇటీవ‌ల ఓ ప‌రిశోధ‌క బృందం ప‌లు ఆశ్చ‌ర్య‌క‌ర విష‌యాల‌ను తెలియ‌జేసింది. అదేమిటంటే కొంత మంది ప‌రిశోధ‌కులు బృందంగా ఏర్ప‌డి 6 ఏళ్ల పాటు 1314 మందిపై ప్ర‌యోగాలు చేశారు. వారి రోజువారీ అల‌వాట్లు, శృంగార భావ‌న‌లు, ఆధ్యాత్మిక భావ‌న‌లు, ఇత‌ర అంశాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశీలిస్తూ వ‌చ్చారు. చివ‌రిగా తెలిసిందేమిటంటే ఎప్పుడో ఓ సారి కంటే త‌ర‌చూ ఇంట‌ర్నెట్‌లో నీలి చిత్రాలు చూసే వారిలో ఆధ్యాత్మిక భావ‌న‌లు పెరుగుతున్నాయ‌ట‌. ఎందుకంటే అలాంటి వారంతా తామంతా ఏదో త‌ప్పు చేశామ‌ని ఫీల‌వుతూ దైవ స‌న్నిధిలో ఎక్కువ‌గా గ‌డిపేందుకు వెళ్తున్నార‌ట‌. అంతే క‌దా మ‌రి! త‌ప్పు చేస్తే మ‌న మ‌న‌స్సాక్షే ప్ర‌శ్నిస్తుంది. అది క‌రెక్టేనా, కాదా అని ఒక‌టికి రెండు సార్లు మ‌న‌స్సు ఆలోచిస్తుంది. ఈ క్ర‌మంలోనే త‌ప్పు చేశామ‌న్న భావ‌న క‌లిగి అందుకు ప్రాయ‌శ్చితంగా దైవం ద‌గ్గ‌రికి వెళ్లేలా చేస్తుంది. దీంతో కొంత ప్ర‌శాంత‌త క‌లుగుతుంది. ప‌రిశోధ‌న బృందం వెల్ల‌డించింది కూడా అదే క‌దా!

Comments

comments

Share this post

scroll to top