మ‌న కొత్త 500,2000/- నోట్ల‌ను నేపాల్ బ్యాన్ చేసింది… ఎందుకంటే..?

నోట్ల ర‌ద్దు ప్ర‌క‌ట‌న ఏమో గానీ, అది వ‌చ్చి ఇప్ప‌టికి దాదాపుగా 20 రోజుల‌కు పైనే అవుతోంది. అయినా ప్ర‌జ‌ల కరెన్సీ క‌ష్టాలు తీర‌డం లేదు. ఓ వైపు ఒక‌టో తారీఖు వ‌చ్చేసింది. అందరికీ జీతాల రోజు. మరో వైపు బ్యాంకులు, ఏటీఎంల వ‌ద్ద ఎక్క‌డ చూసినా కిలోమీట‌ర్ల మేర బారులు తీరుతున్న ప్ర‌జ‌లు. వెర‌సి… క‌రెన్సీ కోసం జ‌నం ప‌డుతున్న క‌ష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇంకోవైపు చెప్పాలంటే బ్యాంకులు, ఏటీంఎంల‌లో ఎక్కువ‌గా రూ.2వేల నోట్లే వ‌స్తున్నాయి. దీంతో చిల్ల‌ర‌కు జ‌నం అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. అయితే ఇదిలా ఉంటే… ఈ కొత్త రూ.500, రూ.2వేల నోట్ల‌ను మాత్రం నేపాల్ దేశం బ్యాన్ చేసింది. ఎందుకంటే..?

notes-ban-nepal
ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఎఫ్ఈఎంఏ) ప్ర‌కారం మ‌న దేశంలో విడుద‌లైన రూ.500, రూ.2వేల కొత్త నోట్ల‌కు ప్ర‌భుత్వం ఓ నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేయాల‌ట‌. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు అలాంటి నోటిఫికేష‌న్ ఏదీ విడుద‌ల కాలేద‌ట‌. దీంతో నేపాల్ దేశం మ‌న కొత్త నోట్ల‌ను బ్యాన్ చేసింది. ఆ నోటిఫికేష‌న్ వ‌చ్చే వ‌ర‌కు కొత్త నోట్ల‌ను తీసుకునేది లేద‌ని నేపాల్ కు చెందిన నేపాల్ రాష్ట్ర బ్యాంక్ అధికార ప్ర‌తినిధి నారాయ‌ణ్ పౌడేల్ స్ప‌ష్టం చేశారు.

నిజానికి నేపాల్ మ‌న నోట్ల‌ను బ్యాన్ చేయ‌డం కొత్త కాదు. 2015 వ‌ర‌కు రూ.500, రూ.1000 నోట్ల‌ను అక్క‌డ బ్యాన్ చేశారు. అయితే మ‌న ప్ర‌ధాని మోడీ నేపాల్ పర్యటన అనంతరం….. ఆ బ్యాన్ కాస్తా ఎత్తి వేశారు. ఇప్పుడు అక్క‌డ మ‌న దేశ క‌రెన్సీని ఏ పౌరులు అయినా రూ.25వేల వ‌ర‌కు తీసుకెళ్ల‌వ‌చ్చు. కానీ కొత్త రూ.500, రూ.2వేల నోట్ల‌ను అక్క‌డ బ్యాన్ చేయ‌డంతో నేపాల్‌లో ఉన్న భార‌త పౌరుల‌కు ఇబ్బందిగా మారింద‌ట‌. అయినా ఏం చేస్తాం..? ప‌్ర‌జ‌లకు క‌లిగే స‌మ‌స్య‌ల‌ను దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి కానీ, అవి ప‌ట్టించుకోకుండా నోట్ల ర‌ద్దుపై రోజుకో ప్ర‌క‌ట‌న చేస్తే ఏం లాభం..? ప‌రిస్థితి ఇదిగో… ఇప్పుడు ఉన్న‌ట్టే ఉంటుంది. ఏం చేయాలో తెలియ‌దు..!

Comments

comments

Share this post

scroll to top