నేను వీరమాతను ఏడవను…..బోర్డర్ లో చనిపోయిన ఓ జవాన్ తల్లి మాటలు. #అమ్మా…హ్యాట్సాఫ్.

కళ్లముందు కొడుకు శవం… ఆ తల్లి గుండెల నిండా తట్టుకోలేనంత బాధ. ఆపుకోలేని దు:ఖం. సరిగ్గా ఇదే సమయంలో తన కొడుక్కిచ్చిన మాట గుర్తుకువచ్చింది ఆ తల్లికి…. బాధనంతా పంటి కొన కింద ఆపి, ధైర్యాన్ని తెచ్చుకొని….నేను వీరమాతను..ఎడవను అంటూ భారత్ మాతాకీ జై….అని నినదించింది. జమ్మూ కాశ్మిర్ లోని కథువా సెక్టార్ లో ఉగ్రవాదులు భారతసైన్యం మీదకు దాడికి తెగబడిన  సమయంలో అక్కడే రక్షణగా ఉన్న BSF జవాన్ గురునామ్ సింగ్ ఆ ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడాడు… ఆ వార్ లో  ప్రత్యర్థులు కాల్చిన ఓ బుల్లెట్ గురు నామ్ సింగ్ తలనుండి దూసుకెళ్లింది. హాస్పిటల్ కు తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది.

గురునామ్ సింగ్ మృత దేహాన్ని స్వస్థలానికి తరలించిన తర్వాత….. కొడుకు మృతదేహాన్ని చూసిన తర్వాత…తల్లి జస్వంత్ కౌర్…” నేను ఎడవను….అలాగని మా అబ్బాయికి మాట ఇచ్చాను,దేశం కోసం తన ప్రాణాలు త్యాగం చేస్తే ఏడవొద్దని గురునామ్ నాతో ఒకసారి చెప్పాడు, వాడు మేము గర్వపడేలా చేశాడు” అని చెప్పింది.

guru

గురునామ్ తండ్రి  మాట్లాడుతూ…..” పాకిస్థాన్ కు ధీటుగా సమాధానం చెప్పాలని ప్రధానిని కోరుతున్న, మళ్లీ ఇటువంటి సహాసం చేయకుండా…ఆ దేశానికి గుణపాఠం చెప్పాలి, దీనర్థంయుద్దమే అయితే అలాగే కానివ్వండి” అని అన్నారు గురునామ్ తండ్రి కుల్ బీర్ సింగ్.

చెట్టంత కొడుకును కోల్పోయాక కూడా…ఇంత గుండెనిబ్బరంగా ఉండి, దేశం పట్ల తమకున్న  భక్తిని చాటిన ఆ తల్లిదండ్రులకు హ్యాట్సాప్ చెబుదాం.  గురునామ్ సింగ్ అమర్ రహే, దేశం కోసం ప్రాణాలర్పించే కొడుకును కన్న ఆ తల్లిదండ్రుల జన్మదన్యం.

Note: ఇలాంటి సమాచారాన్ని డైరెక్ట్ గా మీ వాట్సాప్ లో చదవాలనుకుంటే..మా నెంబర్ 7997192411 కు START అని మెసేజ్ చేయండి.

Comments

comments

Share this post

scroll to top