నేను…శైలజ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.

ఈ మధ్య కాలంలో తెలుగులో తెరకెక్కిన ఫీల్ గుడ్ మూవీగా నిలిచిన చిత్రం ‘నేను.. శైలజ’.చాలా రోజులుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న రామ్ ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. రామ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. హీరోయిన్ గా నటించిన కీర్తిసురేష్ సినిమాకు హైలెట్ గా నిలిచింది. కిషోర్ తిరుమల డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ‘స్రవంతి’రవికిషోర్ నిర్మించాడు. జనవరి 1న రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ నే కాదు, కలెక్షన్స్ ను అదే రేంజ్ లో కొల్లగొట్టింది. ‘నేను.. శైలజ’ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.రామ్ కెరియర్లో బెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చిన ఈ చిత్రం ఇప్పటికే దాదాపు రూ.15కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. సెకండ్ వీక్ ముగిసే సమయానికి  రూ.20కోట్ల వరకు కలెక్ట్ చేయొచ్చని ట్రేడ్ వర్గాల అంచనా.

నైజాం:4.80 కోట్లు
సీడెడ్: 2.3కోట్లు
ఉత్తరాంధ్ర:0.94కోట్లు
గుంటూరు: 0.90కోట్లు
కృష్ణా:0.85కోట్లు
ఈస్ట్:0.85కోట్లు
వెస్ట్: 0.63కోట్లు
నెల్లూర్:0.45కోట్లు
కర్ణాటక, ఓవర్సీస్, రెస్టాఫ్: 5.5కోట్లు

Comments

comments

Share this post

scroll to top