రామ్ "నేను .. శైలజ' టీజర్. డిఫరెంట్ గా ఉందండోయ్..!

“లైఫ్ లో అన్నిటికంటే ఈజీ లవ్ లో పడటం.. అంతకంటే కష్టం అవతలి వైపు అమ్మాయి మనల్ని ప్రేమించక పోవడం” అంటూ యంగ్ ఎనర్జిటిక్ హీరో రామ్ తన లేటెస్ట్ సినిమా “నేను .. శైలజ’ టీజర్ ను తాజాగా రిలీజ్ చేశాడు. ఎంతమంది అమ్మాయిలు మనసుకు నచ్చిన చివరికి నువ్వు నా ఫ్రెండ్, నా కుటుంబంలో నువ్వూ ఒక్కదివంటూ మన హీరో ప్రేమను రిజెక్ట్ చేస్తుంటారు. ఇక జీవితంలో ప్రేమే లేదనుకుంటున్న టైంలో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చి,,,మళ్ళీ ప్రేమలో దింపుతుంది. హీరోని చూసి ప్రేమలో పడిన హీరోయిన్ ‘ఐ లవ్యూ’ అని చెప్పి.. కానీ నేను నిన్ను ప్రేమించట్లేదని ట్విస్ట్ ఇస్తుంది. ఇది ఓవరాల్ గా “నేను..శైలజ” టీజర్ కథ. రామ్, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని స్రవంతి రవికిషోర్ నిర్మిస్తుండగా, కిషోర్ తిరుమల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. దేవిశ్రీ  ప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఫెంటాస్టిక్ గా ఉంది. లవ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న “నేను.. శైలజ” తో రామ్ హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఈ టీజర్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకుంటోంది మరి.

WATCH TEASER:

Comments

comments

Share this post

scroll to top