రామ్ నేను శైలజ…..సినిమా ట్రైలర్!

“స్నేహమనేది మన విశాఖపట్నం సముద్రం లాంటిది, కళ్ళముందు  స్పష్టంగా కనబడుతుంది,కావలిసినంత  గట్టిగా వినబడుతుంది. .. మరి లవ్ అంటే. హుధుద్ బావ. ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని పాడుచేసి వెళ్తుంది” అంటూ సరికొత్త ప్రేమకథతో  ‘నేను…శైలజ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు యంగ్ ఎనర్జిటిక్ హీరో రామ్. కీర్తిసురేష్ కథానాయికగా నటిస్తోంది. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే చిత్ర టీజర్ తో ఆకట్టుకున్న రామ్, తాజాగా విడుదలైన చిత్ర ట్రైలర్ తో సూపర్ హిట్ గ్యారంటీ అంటున్నాడు. రీసెంట్ గా చిత్ర పాటలు, మరియు ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

నైట్ క్లబ్ లో డీజేగా పనిచేసేవాడిలా రామ్ ఈ చిత్రంలో నటిస్తున్నాడు. ఏ అమ్మాయిని ప్రేమించినా సరే చివరికి నువ్వు నా ఫ్రెండ్, నువ్వు నా  ఫ్యామిలీ మెంబర్ అంటూ హ్యాండ్ ఇస్తారు. ఇక నా లైఫ్ లో లవ్వే లేదనుకుంటున్న టైంలో హీరోయిన్ ఎంట్రీ ఇస్తుంది. మళ్ళీ లవ్ మొదలుపెడతాడు. చివరికి హీరోయిన్ కి లవ్ ప్రపోజ్ చేస్తే నువ్వంటే నాకిష్టం. కానీ ఐ యామ్ నాట్ ఇన్ లవ్ విత్ యూ అంటూ బాంబ్ పేల్చేస్తుంది. పంచ్ డైలాగులు సూపర్బ్ గా ఉన్నాయి. ట్రైలర్ చివర్లో “ఏంటి సార్ గడ్డం పెంచారంటే.. లవ్ లో ఫెయిల్ అయినోడు గడ్డం పెంచక, జిమ్ కు వెళ్లి సిక్స్ ప్యాక్ చేస్తాడా ” అంటూ కౌంటర్ ఇస్తాడు హీరో. సమీర్ రెడ్డి అందించిన ఫోటోగ్రఫీ చాలా బాగుంది. ఇక దేవీశ్రీ  యాజ్ యుజ్వల్ గా ఇరగదీశాడు. ఈ సంవత్సరంలో పండగ చేస్కో, శివం సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆ సినిమాలతో ఫర్వాలేదనిపించుకున్న రామ్, నేను. శైలజ తో సూపర్ హిట్ కొట్టేలా ఉన్నాడు. జనవరి 1న ఈ సినిమా రిలీజ్ కానుంది.
Watch TRAILER:

Comments

comments

Share this post

scroll to top