నేను మా నాన్నని కాపాడాలి. హర్రర్ స్టోరి.

31-12-15 తేది రాత్రి 11.30 గం, దేశమంతా కొత్తసంవత్సరానికి స్వాగతం పలకడానికి సిద్దంగా వున్నారు .
ఖాన్ ………. ఖాన్ ఎక్కడున్నావు , అన్ని రూముల్లో చూసా కానీ కనబడలేదు చివరిగా మేడమీదకి వెళ్లి చూసాను , తను ఎవరితోనో మాట్లాడుతున్నాడు నాకెందుకో భయం మొదలైంది మెల్లగా అటువైపు నడిచి చూస్తే నా గుండె ఆగిపాయింది ఎందుకంటే తన ఎదుట ఎవరు లేకపోయినా తనలో తాను మాట్లాడుకుంటున్నాడు పైగా పిట్టగోడ అంచున నిలబడి.! ఉన్నచోటనుండి తనని పిలిస్తే తను మెల్లిగా నావైపు తిరిగి ఎవరు నువ్వు నా పేరు ఖాన్ కాదు అంటూ ఎర్రబడ్డ కళ్ళతో తనది కాని గొంతుతో చెప్పడంతో నాకు ఏమి అర్థం కాలేదు తనని పట్టుకోవడానికి ప్రయత్నించేలోపు ” నేను మా నాన్నని కాపాడాలి ” అంటూ కిందకి పడిపోయాడు.

24-12-2015 .
సాయంత్రం ,
ఏదో కొత్త మెసేజ్ వచ్చినట్లుంది ,
Paul , bank manager, SBI New Delhi.
O.K. done (రిప్లై)

25-12-2015.
ఉదయం
ఈరోజు సాయంత్రం నేను ఢిల్లీ బయలుదేరుతాను అని చెప్పి ఫోన్ పెట్టేసాను .

26-12-2015
ఉదయం 5గం
డాడి నేను తాతయ్య ఇద్దరం కలిసి అలా వాకింగ్ కి వెళ్లి వస్తాం అని చెప్పి రాజ్ వాళ్ళ తాతయ్యతో బయలుదేరాడు. రాజ్ ఇప్పుడు 7th క్లాసు చదువుతున్నాడు. ఇద్దరూ వెళ్లిపోవడంతో పాల్ తన వంట మొదలుపెట్టాడు. ఈరోజు తనకి బ్యాంక్ లో ఏదో అర్జంట్ మీటింగ్ వుంది అరగంట ముందుగానే వెళ్ళాలి . ఇంతలో రాజ్ మళ్ళి వచ్చాడు మొబైల్ కోసం . తొందరగా వచ్చేయండి అని చెప్పి పాల్ తన పనిలో పడిపోయాడు.
addtext_com_MDcxOTM5MTcxNjM
ఉదయం 7 గం

వీళ్ళు వెళ్లి చాలాసేపు అయ్యింది కాని ఇంకా రాలేదు పాల్ కి ఎందుకో టెన్షన్ మొదలయ్యింది . ఇంతలో రాజ్ కంగారుగా వచ్చాడు , డాడ్ నేను తిరిగి వెళ్ళేటప్పటికి తాతయ్య అక్కడ లేరు చాలా వెతికాను కాని కనిపించలేదు మొబైల్ కుడా స్విచ్ ఆఫ్ వస్తుంది అని ఏడుస్తూ చెప్పాడు . పాల్ కి ఏమి చెయ్యాలో అర్థంకావట్లేదు .

ఇంతలో మొబైల్ మోగింది హలో .. ఎవరు. …. ఎవరు మాట్లాడేది అని పాల్ అడుగుతున్నా సమాదానం లేదు . కొంతసేపటి తరువాత కిడ్నాప్ కి పరిచయాలు అక్కర్లేదనుకుంట మీ అబ్బాయిని కిడ్నాప్ చేద్దాం అనుకుంటే మీ నాన్న దొరికాడు మేం చెప్పిన టైం కి చెప్పిన డబ్బు రెడీ చెయ్ . కాల్ యు బ్యాక్ అని చెప్పి లైన్ కట్ చేశాడు అవతలి వ్యక్తి .

అదేరోజు ఉదయం 11.30

నేను ఢిల్లీ చేరుకున్నాను . నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎవరు వస్తారో తెలీదు.
నాగురించి చెప్పనేలేదు కదా నేను జాన్ నేనొక ప్రొఫెషనల్ ని షార్ట్ టాస్క్ చెయ్యడంలో. అంటే చెప్పిన ప్లేస్ కి వెళ్లి చెప్పిన ఐటెం ని ఇవ్వటం లేదా తేవడం.

ఇంతలో వెనుకనుంచి ఎవరో వచ్చి హాయ్ మిస్టర్ జాన్ దిస్ ఇస్ ఫర్ యు అని చెప్పి ఒక పేపర్ చేతిలో పెట్టాడు అందులో ఏదో అడ్రస్ రాసి ఉంది . పేపర్ లో వున్నా అడ్రస్ కి బయలుదేరాను. ఇదేదో పాత ఫ్లాట్ లాగా వుంది ఇక్కడ పేయింగ్ గెస్ట్ గా ఉండచ్చు. నాతో పాటే ఈ ఫ్లాట్ లో ఖాన్ కూడా వుంటాడు తనొక సాఫ్ట్ వేర్ కంపెనీ లో జాబ్ చేస్తున్నాడు. ఇద్దరికీ పరిచయాలు అయ్యాయి . నేను ఇక్కడికి మా అంకుల్ ని కలవడానికి వచ్చాను అని అబద్దం చెప్పాను ఎందుకంటే మా వర్క్ డీటెయిల్స్ చాల సీక్రెట్ గా ఉంచాలి.

28-12-2015
పాల్ తను అన్ని రకాలుగా ప్రయత్నించి చూసాడు కాని తన తండ్రి గురించి ఏ మాత్రం ఇన్ఫర్మేషన్ లేదు. చివరిగా పోలీస్ కంప్లెయింట్ ఇవ్వడానికి సిద్దమయ్యాడు. ఇంతలో తన ఫోన్ మోగింది హలో హలో బయపడుతూ మాట్లాడుతున్నాడు పాల్. చూడు పాల్ పోలీస్ కంప్లెయింట్ ఇవ్వడం వంటి పిచ్చి ప్రయత్నాలు ఆపి తొందరగా ఇరవై లక్షలు రెడీ చెయ్యి అని ఫోన్ పెట్టేసాడు అవతలి వ్యక్తి. ఏం చెయ్యాలో పాలుపోని స్టితిలో వున్నాడు. చివరగా దైర్యం చేసి పోలీస్ కంప్లెయింట్ ఇచ్చాడు . పోలీస్ ఆఫీసర్ ఇచ్చిన దైర్యంతో ఇంటికి చేరుకున్నాడు.

29-12-2015.

నేను ఖాన్ ఇద్దరం అలా ఢిల్లీ చూసి రావడానికి బయలుదేరాం. తనకి ఏదో డబ్బులు అవసరం వుండి పక్కనే వున్నా SBI ఏటియం లోనుంచి తీసుకున్నాడు పక్కనే వున్న బ్యాంకు బ్రాంచ్ ని చూశాను నాకు కావలసిన బ్రాంచ్ అదె. ఇద్దరం చాలాసేపు బయట తిరిగాం .

30-12-2015.

పాల్ పోలీస్ స్టేషన్ కు వెళ్ళటం రావటం తప్ప ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు . చివరిగా పోలీస్ ఆఫీసర్ చెప్పినట్లు డబ్బు రెడీ చేసి వాళ్ళు చెప్పిన ప్లేస్ కి వెళ్తే అక్కడ వాళ్ళని అరెస్ట్ చేయడం ఆఫీసర్ ప్లాన్. ఇది పరమ చెత్త ప్లాన్ గా అనిపించింది పాల్ కి ఎందుకంటే ఏమాత్రం తేడా వచ్చిన తన తండ్రిని రిస్క్ లో పెట్టినట్లవుతుంది. భయంభయంగానే ఆ ప్లాన్ కి ఓకే చెప్పాడు ఎందుకంటే తనకి వేరే ఆప్షన్ లేదు. కిడ్నాపర్స్ చాల తెలివిగా ప్లాన్ చేసుకున్నారు.
31-12-2015

ఉదయం 11.30

ఫోన్ మోగుతుంది భయంగానే ఫోన్ లిఫ్ట్ చేశాడు పాల్ అటునుంచి ” మీ నాన్న నీకు కావాలంటే మేం చెప్పిన ప్లేస్ కి వచ్చి డబ్బు ఇచ్చి తీసుకొ ” ………. పిచ్చి ప్రయత్నాలు ఏమి చెయ్యద్దు . . . . . . .

మద్యాహ్నం 1.30

జాన్ నాకు అర్జెంటు మీటింగ్ వుంది అందువల్ల ఇప్పుడు నేను ఆఫీసు కి బయలుదేరాలి అని చెప్పి వెళ్ళిపోయాడు ఖాన్ . నాకు కావాల్సింది కూడా అదే అని మన్సులో అనుకున్నా ఎందుకంటే నా పని పూర్తి చెయ్యల్సింది ఈరోజే.
సాయంత్రం 4 గం

నేను నా దగ్గర వున్నా గన్ తీసుకుని SBI బ్రాంచ్ దగ్గరకు బయలేదేరుతున్నాను . సరిగ్గా అరగంట లో అక్కడకి చేరుకున్నాను. పాల్ తను ఒక బాగ్ లో డబ్బుతో బయటకు వచ్చాడు. నేను పాల్ ని చాల జాగ్రత్తగా ఫాలో అవుతున్నాను నా ప్లాన్ ప్రకారం ఒక కిలోమీటర్ తర్వాత అతని దగ్గరున్న డబ్బు తీసుకోవాలి. నేను అనుకున్న ప్లేస్ వచ్చింది అది నాలుగు రోడ్ల జంక్షన్ నేను సరిగ్గా అతన్ని ఎటాక్ చేద్దామనుకునేలోపు ఎదురుగా పోలీసులు నాకు ఏమి చెయ్యాలో అర్థం కాలేదు పాల్ అక్కడనుంచి కొంత దూరం వెళ్ళాక ఒక దగ్గర ఆగి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు. నాకేమి అర్థం కావట్లేదు పోలీసులు పాల్ ని గమనిస్తున్నారు. నామీద వాళ్ళకి అనుమానం వచ్చినట్లుంది నా వైపే వస్తున్నారు.

ఇంతలో నా ఫోన్ మోగింది ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుండగా ఒక పెద్ద ట్రక్కు పాల్ కారువైపుగా దూసుకుని వచ్చి డీ కొట్టింది “జాన్ నువ్వు వెళ్లి ఆ డబ్బు తీసుకొని వెళ్ళిపో ” ఫోన్ కట్ అయిపొయింది . ఇంతలో మరో ట్రక్ పోలీసుల జీపుని డీకొంది నేను వెంటనే పాల్ కార్ దగ్గరకి వెళ్లి గన్ తో షూట్ చేసి డబ్బు తీసుకుని వెళ్ళిపోయాను.పాల్ కి తీవ్రంగా గాయాలయ్యాయి అతి కష్టమ్మీద బయటకు వచ్చి చూస్తె ట్రక్ దగ్గర చాలామంది జనం వున్నారు అక్కడ పాల్ నాన్న శవం వుంది అది చూసిన పాల్ వాళ్ళ నాన్నను తాకడానికి ప్రయత్నించి విఫలమవుతాడు. తనకేమి అర్థంకావట్లేదు. పాల్ ఏడుస్తూ తన కార్ వైపు చూసాడు అక్కడ చాలామంది జనం వున్నారు. తను రక్తపుమడుగులో వున్న తన శవాన్ని చూసి షాక్ అయ్యాడు…………………………..కొంతసేపటి తరువాత పాల్ ఆత్మ మాత్రమే వాళ్ళ నాన్న వైపు నడుస్తుంది.
సాయంత్రం 7 గం

నేను ఆ డబ్బు తీసుకొని ఇంటికి ఖాన్ కన్నా ముందుగానే చేరుకున్నాను . కాసేపటికి ఖాన్ కూడా ఇంటికి వచ్చాడు ఇద్దరం కలిసి భోజనం మొదలుపెట్టాం. జాన్ ఈరోజు మీతో టైం గడపడం కుదరలేదు “నన్ను … మా నాన్నని అన్యాయంగా చంపేసారు ” అంటూ ఒక్క సారిగా భయంకరమైన గొంతుతో మాట్లాడుతుంటే నా గుండె వేగం పెరిగిపోతుంది. ఖాన్ ఏమైయ్యింది ఎందుకలా మాట్లాడుతున్నావు తనని పట్టుకుని గదిలో పడుకోబెట్టాను. నాకెందుకో అంతా అయోమయంగా వుంది ఇంతలో ఎవరో పరుగెత్తిన సౌండ్ వచ్చింది నేను వెంటనే ఖాన్ ………. ఖాన్ ఎక్కడున్నావు , అన్ని రూముల్లో చూసా కానీ కనబడలేదు చివరిగా మేడమీదకి వెళ్లి చూసాను , తను ఎవరితోనో మాట్లాడుతున్నాడు నాకెందుకో భయం మొదలైంది మెల్లగా అటువైపు నడిచి చూస్తే నా గుండె ఆగిపాయింది ఎందుకంటే తన ఎదుట ఎవరు లేకపోయినా తనలో తాను మాట్లాడుకుంటున్నాడు పైగా పిట్టగోడ అంచున నిలబడి.

ఉన్నచోటనుండి తనని పిలిస్తే తను మెల్లిగా నావైపు తిరిగి ఎవరు నువ్వు నా పేరు ఖాన్ కాదు పాల్ అంటూ ఎర్రబడ్డ కళ్ళతో తనది కాని గొంతుతో చెప్పడంతో నాకు ఏమి అర్థం కాలేదు తనని పట్టుకోవడానికి ప్రయత్నించేలోపు ” నేను మా నాన్నని కాపాడాలి ” అంటూ కిందకి పడిపోయాడు.

నేను వెంటనే కిందకి వెళ్లి డబ్బు బ్యాగ్ తీసుకొని బయటకు పరుగెత్తాను ఆటో పట్టుకుని వెంటనే ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నాను లక్కీ గా ఒక ఫ్లైట్ రెడీగా వుంది. వెంటనే టికెట్ బుక్ చేసుకొని ఫ్లైట్ ఎక్కేసాను. కొద్ది సేపటి తరువాత బ్యాగ్ తెరిచి చుస్తే అందులో డబ్బు తో పాటు ఒక సెల్ కూడా వుంది కాని నేను తెచ్చిన బ్యాగ్ ఇది కాదు డౌట్ వచ్చి సెల్ చెక్ చేశాను నాకు మొదట్నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ మెసేజెస్ అన్ని ఈ నెంబర్ నుంచే. ఈ సెల్ అంత చెక్ చేస్తే నేను ఊహించని షాక్ ఎందుకంటే అది ఖాన్ సెల్ ఫోన్ . . . ….. . .

అంటే ఇదంతా ప్లాన్ చేసింది ఖాన్ అన్నమాట.

నేను షాక్ లో ఉండగానే ఫ్లైట్ స్టార్ట్ అయ్యింది. ఇంతలో ఏదో కుదిపినట్టు అనిపించింది . అందరూ వాళ్ళ సీట్ల బెల్ట్లు తీసి నిల్చున్నారు ఇంతలో పైలట్ కూడా బయటకు వచ్చేసాడు నాకేమీ అర్థంకావడంలేదు అందరు ఒక్కసారిగా నావైపే ఎర్రబడ్డ కళ్ళతో చూస్తూ నేను మానాన్నని కాపాడాలి నేను మానాన్నని కాపాడాలి నేను మానాన్నని కాపాడాలి అంటూ నావైపే వస్తున్నారు. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .. . . . . . . . . . .

కథను పంపిన వారు: Lakshman veeramalla ( 9989984849)

మీరూ మీకథను మాకు పంపొచ్చు. మా Email: ap2tgtelugu@gmail.com

Comments

comments

Share this post

scroll to top