ఈ భూమిపై జన్మించిన ప్రతి జీవి శృంగారంలో పాల్గొనాల్సిందే. అలా చేస్తేనే ఆ జీవికి చెందిన జాతి వృద్ధి అవుతుంది. ఇది సృష్టి ధర్మం. ప్రకృతి కార్యం. అయితే అన్ని జీవులు శృంగారంలో పాల్గొంటాయి, కానీ నెమలి అలా చేయదట. మగ నెమలి కళ్లలో ఉండే నీటిని తాగి ఆడ నెమలి గుడ్లు పెడుతుందట. దీంతో వాటికి సంతానం కలుగుతుందట. ఈ విషయాన్ని ఎప్పటి నుంచో చాలా మంది నమ్ముతూ వస్తున్నారు. అలా అని ఎవరిని అడిగినా ఇదే విషయం చెబుతారు. తాజాగా ఓ జడ్జి కూడా ఇదే విషయాన్ని చెప్పారు. దీంతో నెటిజన్లు ఒక్కసారిగా గూగుల్ మీద పడ్డారు. అసలు నెమలి శృంగారంలో పాల్గొంటుందా..? పిల్లలను ఎలా పెడుతుంది..? అనే విషయంపై శోధించారు. మరి వారి శోధనకు సమాధానాలు దొరికాయా..? అంటే అవును, దొరికాయి. ఇంతకీ అసలు నెమలి శృంగారంలో ఎలా పాల్గొంటుంది..? మగ నెమలి కళ్లలో కారే నీటిని తాగి ఆడ నెమలి పిల్లల్ని పెడుతుందా..? ఇది నిజమేనా..? ఇందులో వాస్తవం ఎంత..? ఇప్పుడు తెలుసుకుందాం.
నెమళ్లు పక్షి జాతికి చెందినవే. అవి కూడా కోళ్లలాగే శృంగారంలో పాల్గొంటాయి. మగ నెమలి తనకు ఉన్న ఫించాన్ని పురి విప్పి ఆడుతుంది. దీనికి ఆడ నెమలి ఆకర్షితమవుతుంది. అప్పుడు ఆ ఆడ నెమలి మగ నెమలి వద్దకు రాగానే మగ నెమలి ఆడనెమలితో శృంగారంలో పాల్గొంటుంది. కోళ్లలాగే ఇవి శృంగారంలో పాల్గొంటాయి. అంతే కానీ… మగ నెమలి కళ్లలో నీటిని తాగి ఆడ నెమలి పిల్లల్ని పెట్టడం అనేది జరగదు. అసలు సృష్టిలో అలా పిల్లల్ని కనే జీవి ఏదీ దాదాపుగా లేదనే చెప్పవచ్చు.
కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు. ఇప్పటికీ దీని గురించి ఎవర్నయినా అడిగి చూడండి. కచ్చితంగా పైన చెప్పిందే చెబుతారు. మగ నెమలి కళ్లలో నీటిని తాగి ఆడ నెమలి పిల్లల్ని పెడుతుందని అంటారు. అయితే విషయం మాత్రం అది కాదు. ఆల్రెడీ చెప్పాం కదా, అదేవిధంగా నెమళ్లు శృంగారంలో పాల్గొంటాయి. అయితే ఈ విషయం ఆ హైకోర్టు జడ్జి మహేష్ చంద్ర శర్మకు తెలియదు. ఆయన రాజస్థాన్ హైకోర్టుకు జడ్జిగా పనిచేస్తున్నాడు. కాగా ఈయన ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని వ్యాఖ్యలు చేస్తూ నెమళ్ల గురించి అందరూ అనుకునే విధంగానే ఓ అపోహను ఆయన కూడా నిజమే అనుకుని అలా వ్యాఖ్యలు చేశారు. దీంతో చాలా మంది ఒక్కసారిగా గూగుల్లో ఈ విషయం గురించి వెతికి నిజం తెలుసుకున్నారు. మేం కూడా అదే చేశాం. ఇంత చెప్పినా… ఇంకా నమ్మలేం అంటారా… అయితే కింద వీడియో చూడండి..! ఇది విషయ పరిజ్ఞానం కోసం ఇస్తున్న వీడియో మాత్రమే. వేరేగా అనుకోవద్దు..!
చూశారుగా..! కనుక ఇప్పటికైనా నెమళ్ల శృంగారం పట్ల నెలకొన్న అపోహలను అస్సలు నమ్మకండి. దీని గురించి తెలియని వారికి తెలియజేయండి..!