“నెమలి”ని ఇంగ్లీష్ లో “పీకాక్” అంటారు..కానీ “మగ నెమలిని” మాత్రమే.! మరి “ఆడ నెమలిని” ఏమంటారో తెలుసా.?

మనకు చాలా తెలుసనుకుంటాం ..కానీ చాలా చిన్న చిన్న విషయాల దగ్గర బొక్కబోర్లా పడతాం..విషయం తెలియక కొంత అయితే,నలుగురితో నారాయణ అంటూ..నలుగురు ఏం అనుకుంటాం అది కొంత.. సరే మేం అలా కాదు మాకు తెలుసు,ఏమైనా అడగండి చటుక్కున చెప్పేస్తాం అంటారా…అయితే నెమలి గురించి మనకు తెలుసుకదా..తలుచుకోగానే పురివిప్పి నాట్యాం చేసే నెమలి కళ్లముందు కదులుతుందా.. అయితే నెమలిని ఇంగ్లీషులో ఏమంటారు చెప్పండి…

ఓస్ ఇంతేనా..ఇంతోటి దానికి మాకు తెలివిలేదు అంటావా..థాట్ …థూట్ అని అనుకుంటున్నారా..సరే చెప్పండి నెమలిని ఇంగ్లీషులో ఏమంటారు…పీకాక్..అస్సలు తగ్గేదే లేదు కదా..అవును నెమలిని పీకాక్ అంటారు..మేం కూడా ఒప్పుకుంటాం..కానీ మగనెమలిని మాత్రమే పీకాక్ అనాలి..ఆడనెమలిని అనకూడదు.మరి ఆడనెమలిని ఏమనాలి అని తెగ  ఆలోచిస్తున్నారా..కొంచెం బుర్రకి పదును పెడితే ఆడనెమలిని ఏమనాలో సమాధానం మీకే దొరుకుతుంది..మగనెమలి పీకాక్ అయితే ఆడనెమలిని  పీహెన్ (Peahen) అనాలంటా..ఇప్పుడు అది ఆడదా,మగదా మనకెలా తెలుస్తుంది..అనుకుంటున్నారా..

మగ నెమల్లకు అందమయిన మెరిసే నీలం-ఆకుపచ్చ లేదా ఆకుపచ్చ రంగు పించం ఉంటుంది. మగ నెమలికి వెనుక బాగంలో తోకలాగా కనిపించేది, దాని పొడావాటి ఈకలు. ఆ ఈకలకు కళ్ళు ఉంటాయి, వాటి అందమంతా అవి పురివిప్పి నాట్య మాడుతున్నప్పుడే కనిపిస్తాయి.ఆడ నెమలి ఆకుపచ్చ, గోధుమ మరియు బూడిద రంగులలో ఉండే పించం ఉంటుంది. మగ నెమల్ల వలె ఆడనెమలికి పొడావాటి తోక లాంటి ఈకలు ఉండవు, కానీ వీటికి ఒక కొప్పూంటుంది.

Comments

comments

Share this post

scroll to top