పీరియడ్ పెయిన్స్ వస్తున్నాయని…ఆమెను విమానంలో నుండి దించేశారు..! ఇంతకంటే సిగ్గు మాలిన చ‌ర్య‌ ఉంటుందా.?

మ‌హిళ‌ల‌కు నెల నెలా రుతుక్ర‌మం అవ‌డం స‌హ‌జ‌మే. ఆ స‌మ‌యంలో ఏ మ‌హిళ‌కు అయినా నొప్పి రావ‌డం, ర‌క్త స్రావం అవ‌డం సాధార‌ణంగా జ‌రుగుతూ ఉంటాయి. అయితే వాటిపై కొన్ని వ‌ర్గాల్లో ఇంకా మూఢ న‌మ్మ‌కాలు పోవ‌డం లేదు. అపోహ‌లు తొల‌గ‌డం లేదు. తాజాగా ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ కంపెనీ సిబ్బంది కూడా ఇలాగే ప్ర‌వ‌ర్తించారు. పీరియ‌డ్స్ రావ‌డం అంటే మూఢ న‌మ్మ‌కం అని భావించారో ఏమో తెలియ‌దు కానీ, త‌మ విమానం ఎక్కిన ఓ మ‌హిళ‌కు ఈ నొప్పి వ‌స్తుంద‌ని చెప్పి ఆమెను విమానం దింపేశారు. దీంతో ఆ బాధితురాలు త‌న గోడును మీడియాకు వెళ్ల‌బోసుకుని వాపోయింది. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే…

అది బ‌ర్మింగ్ హామ్ నుంచి దుబాయ్ వెళ్తున్న ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ విమానం. అందులో ఒక్కో టిక్కెట్‌కు గాను 558 అమెరిక‌న్ డాల‌ర్లు వెచ్చించి బెత్ ఈవాన్స్‌, మొరాన్ అనే జంట టిక్కెట్ల‌ను కొన్నారు. అయితే విమానం ఎక్కాక బెత్‌కు పీరియ‌డ్ పెయిన్స్ ప్రారంభ‌మ‌య్యాయి. నొప్పి ఎక్కువ‌గా లేదు. కానీ దాంతో అసౌక‌ర్యం అనిపించింది. ఇదే విష‌యాన్ని ఆమె ఎయిర్‌లైన్స్ సిబ్బందికి చెప్ప‌గా, వారు ముందు వెనుక ఆలోచించ‌కుండా వెంట‌నే బెత్‌ను ఆమె బాయ్ ఫ్రెండ్ మొరాన్‌ను విమానం దింపేశారు. తాను బాగానే ఉన్నాన‌ని ఎంత చెప్పినా స‌ద‌రు ఎయిర్‌లైన్స్ సిబ్బంది విన‌లేదు. దీంతో బెత్‌, మొరాన్‌ల‌కు విమానం దిగ‌క త‌ప్ప‌లేదు.

అలా విమానం మిస్ అవ‌గానే బెత్‌, మొరాన్‌లు మ‌రో విమానంలో గ‌మ గ‌మ్య‌స్థానానికి చేరుకున్నారు. ఈ క్రమంలో బెత్ త‌న‌కు ఎదురైన చేదు అనుభ‌వం గురించి త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేయ‌గా అది కాస్తా వైర‌ల్ అయింది. దీంతో స‌ద‌రు ఎయిర్‌లైన్స్ కంపెనీని నెటిజ‌న్లు తీవ్రంగా దుమ్మెత్తి పోస్తున్నారు. పీరియ‌డ్ పెయిన్స్ వ‌చ్చినంత మాత్రాన ఓ మ‌హిళ‌ను విమానం నుంచి ఎలా గెంటేస్తార‌ని, ఇది నీచ‌మైన చ‌ర్య అని మండి ప‌డుతున్నారు. అయితే దీనిపై స్పందించిన ఎమిరేట్స్ సంస్థ వివ‌ర‌ణ ఇచ్చింది. బెత్‌కు విమానంలో అస్వ‌స్థ‌గా ఉంద‌ని, అందుకే ఆమెకు 7 గంట‌ల జ‌ర్నీలో ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా ఉండేందుకే మెడిక‌ల్ ఎమ‌ర్జెన్సీలో భాగంగా ఆమెను దింపేశామ‌ని, ఒక వేళ ఆమెకు మార్గ‌మ‌ధ్య‌లో ఏదైనా అయితే ఇబ్బంది క‌లుగుతుంద‌ని, క‌నుక అలాంటి ఇబ్బంది ప‌డ‌కుండా ఉండాల‌నే ఉద్దేశంతోనే ఆమెను విమానం నుంచి దింపామని వారు చెప్పారు. అయినా బెత్ మాత్రం త‌న‌ను కావాల‌నే విమానం దింపార‌ని చెబుతోంది. ఏది ఏమైనా, మ‌హిళ‌ల పీరియ‌డ్స్ ప‌ట్ల స‌ద‌రు ఎయిర్‌లైన్స్ కంపెనీ అలా ప్ర‌వ‌ర్తించి ఉండ‌కూడదు క‌దా. నిజంగా ఇలాంటి వారినేం చేయాలి, మీరే చెప్పండి..!

Comments

comments

Share this post

scroll to top