ఆ అమ్మాయికి ఇంటర్ లో 95 %…ఐఐటీలో చదవాలనే కల. కానీ డబ్బులు లేవు.! చివరికి ఏమైందో తెలుసా.?

సమాజంలో ఉన్న మనుషులందరూ ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. ఎలాంటి సమస్య వచ్చినా అందరూ ఒకరికొకరు అండగా నిలవాలి. అందరూ కలిసి ఆపదలో ఉన్న కుటుంబాలకు సపోర్ట్‌నివ్వాలి. అలా ఇస్తేనే సమాజంలో మనం మానవత్వం ఉన్న మనుషులం అవుతాం. సరిగ్గా ఇలాగే ఆలోచించారు కనుకనే ఆ కాలనీ వాసులు అందరూ కలసి గొప్ప పని చేశారు. ఆపదలో ఉన్న కుటుంబాన్ని ఆదుకున్నారు. ఆ కుటుంబ యజమానికి చిన్నపాటి ఉద్యోగం వచ్చేలా చేశారు. ఆ కుటుంబంలో బాగా చదివే ఓ యువతికి ఐఐటీ కోచింగ్‌కు అయ్యే ఖర్చును వారు చందాలు వేసుకుని పోగు చేశారు. ఇక ఆ యువతి సోదరుడికి కాలేజీ ఫీజు చెల్లించేందుకు ముందుకు వచ్చారు. మానవత్వం కనుమరుగవుతున్న ఈ రోజుల్లో అందుకు వ్యతిరేకంగా ఆ కాలనీ వాసులు మానవత్వం ఉన్నవాళ్లం అని నిరూపించుకున్నారు. ఈ ఘటన జరిగింది ఉత్తర ప్రదేశ్‌లో.

ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలోని గజియాబాద్‌లో ఇందిరాపురం అనే కాలనీలో 17 సంవత్సరాల వయస్సు ఉన్న కాజల్‌ ఝా అనే యువతి నివసిస్తోంది. కాగా ఆమెది చాలా పేద కుటుంబం. అయినప్పటికీ ఆమెను ఆమె తల్లిదండ్రులు ఇంటర్‌ వరకు చదివించారు. దీంతో ఆ కోర్సులో ఆమె ఏకంగా 95 శాతం మార్కులు తెచ్చుకుంది. అయితే తదుపరి చదువులు చదివేందుకు ఆమె వద్ద డబ్బులు లేవు. కాగా మరోవైపు కుటుంబ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకీ చితికిపోయింది. దీంతో ఓ దశలో వారంతా ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నారు. అయితే కాలనీవాసులంతా దాన్ని అడ్డుకున్నారు. మానవత్వం తమలోనూ ఉందని నిరూపించుకున్నారు.

వారంతా చందాలు వేసుకుని రూ.20 వేలు జమ చేశారు. ఆ మొత్తాన్ని కాజల్‌ చదువు కోసం ఇచ్చేశారు. దీంతో ఆమె ఐఐటీ కోచింగ్‌ సెంటర్‌లో జాయినైంది. ఇక ఆమె సోదరుడు ఐఐటీ మొదటి సెమిస్టర్‌ చదువుతుండగా అతని ఫీజుకు అయ్యే ఖర్చును భరించేందుకు ఆ కాలనీవాసులు ముందుకొచ్చారు. దీంతో పాటు కాజల్‌ తండ్రికి ఓ కంపెనీలో సూపర్‌ వైజర్‌ ఉద్యోగం ఇప్పించారు. అలా వారు కాజల్‌ కుటుంబాన్ని ఆదుకున్నారు. అంతేకాదు, కాజల్‌ లాంటి ఓ బ్రిలియంట్‌ స్టూడెంట్‌ జీవితం స్పాయిల్‌ అవకుండా వారు అంతా కలిసి చందాలు వేసుకుని ఆమెకు ఆర్థిక సహాయం చేశారు. నిజంగా ఈ రోజుల్లో కూడా ఇలాంటి మనుషులు మన సమాజంలో ఉన్నారంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇంతటి గొప్ప పని చేసిన ఆ కాలనీవాసులను మనం మనస్ఫూర్తిగా అభినందించాల్సిందే కదా..!

Comments

comments

Share this post

scroll to top