సినిమాలకేనా సెన్సార్,టీవీ ప్రోగ్రామ్ లకు అక్కర్లేదా..? నీతోనే డ్యాన్స్ ప్రోగ్రాంలో లిప్ లాక్ సంగతి ఏంటి..?

డబ్బింగ్ సీరియళ్లు మినహా,మా టివిలో పెద్దగా ఏ ప్రోగ్రాం కూడా వీక్షకులను ఆకట్టుకోదనేది నిజం..ప్రోగ్రాం కానివ్వండి,సీరియల్ కానివ్వండి సో సో గానే ఉంటుంది.అలాంటిది మా టివి,స్టార్ మా అయ్యాక కొంచెం ఆచి తూచి అడుగులేస్తుంది..అలా అడుగులేసాక చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు సీజన్ టూ బెడిసికొట్టినప్పటికీ,బిగ్ బాస్ మాత్రం సూపర్ హిట్ అయి అందరిని అటువైపు తిప్పుకుంది..ఆ తర్వాత నీతోనే డ్యాన్స్ అంటూ ఒక భారీ ప్రోగ్రామ్ కి శ్రీకారం చుట్టింది స్టార్ మా…రేణు దేశాయ్ జడ్జ్ గా ,అదా శర్మ,జానీ మాష్టర్ జడ్జిలుగా, ,ఉదయభాను హోస్ట్ గా, ఎనిమిది జంటలు పార్టిసిపేట్ చేస్తున్ ఈ ప్రోగ్రామ్ లేటెస్ట్ ప్రోమోలో ఏదో అపశృతి దొర్లినట్టు అనిపిస్తుంది..

నీతోనే డ్యాన్స్ ప్రొగ్రాం స్టార్ట్ అయినప్పటినుండి పాజిటివ్ టాక్ తోనే నడుస్తుంది..రేణుదేశాయ్ ని ఈ ప్రోగ్రాంతో మళ్లీ స్క్రీన్ పై చూసుకోవడం ప్రేక్షకులలకు ఆనందం కలిగిస్తే ,గ్యాప్ తర్వాత వచ్చిన ఉదయభాను ఇప్పటికి అదే జోష్ తో కంటిన్యూ అవుతుంది.జానీ మాష్టార్ గురించి చెప్పడానికేం లేదు..అదా శర్మని జడ్జిగా ఎలా తీసుకున్నారు అనే డౌటున్న వాళ్లకి,ఆమె బాగానే డ్యాన్స్ వేస్తుంది అనే ఉద్దేశ్యంతో అనుకుంటా ప్రతి ఎపిసోడ్లో ఆమెతో ఏదో ఒక వెరైటీ స్టెప్స్ వేయిస్తున్నారు.రీల్ పై తమ నటనతో ఆకట్టుకుని రియల్  లైఫ్ జంటలుగా మారిన పార్టిసిపెంట్స్ ఈ ప్రోగ్రాంలో డ్యాన్సులతో అదరగొడుతున్నారు..లాస్య ,మంజునాధ్ ఏదో ప్రాబ్లంతో తప్పుకోగా మిగతా వారంతా కంటిన్యూ అవుతున్నారు.ఇదిలా ఉంటే ఇటీవల ఈ ప్రోగ్రామ్ కి సభందించిన ప్రోమోలోప్రియతమ్,మానస ఫెర్మార్మెన్స్ చేస్తున్న డ్యాన్స్ ప్రోగ్రాంలో లిప్ కిస్ చేసుకున్నారు.టీవీ ప్రోగ్రామ్ అంటే మన ఇంట్లో అమ్మా,నాన్న మోత్తం కుటుంబ సభ్యులందరం కూర్చుని చూస్తుంటాం..అలాంటప్పుడు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఎలా చూస్తారు.సినిమాల్లో రొమాన్స్ పాళ్లు ఎక్కువవుతున్నాయని గగ్గోలు పెడుతూ కుటుంబ సమేతంగా సినిమా చూసే పరిస్థితి లేదనేది నిజం..మరిప్పుడు సరాసరి టీవిల్లో లిప్ లాక్ లు వచ్చేస్తే పరిస్థితి ఏంటో..వీటికి సెన్సార్స్ అక్కర్లేదా..

అర్జున్ రెడ్డి సినిమాలోని ముద్దు సీన్లపై కొద్ది రోజులు సోషల్ మీడియా సమర్థనలు, విమర్శలతో దద్దరిల్లిపోయింది … అర్జున్ రెడ్డి సినిమాలోని ముద్దు సీన్లపై నానా రభస చేసిన పెద్ద మనుషులు,సంఘ సంస్కర్తలు ఇప్పడు ఏమైపోయారు..మన నట్టింట్లో జరుగుతున్న ముద్దుల భాగోతాన్ని ప్రశ్నించకపోవడానికి కారణాలేంటి..వాళ్లు నిజంగా భార్యభర్తలే కదా అని సమర్ధిస్తున్నారా..భార్యాభర్తలైతే  ఇలా ఏం చేసినా చెల్లుతుందా..ఇంతకుముందు రంగం అనే షోలో కూడా ఇలాగే రెచ్చిపతే సర్వత్రా వ్యతిరేఖత వచ్చింది.ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ టెలికాస్ట్ అయ్యాక పరిస్థితి ఏంటో..

watch video here:

https://www.youtube.com/watch?v=yGkwH0wUqOc

Comments

comments

Share this post

scroll to top