నీర్జా… 359 మందిని కాపాడిన ఇండియన్ ఎయిర్ హోస్టెస్ సినిమా ట్రైలర్.

1986 సెప్టెంబర్ 5 న కరాచీ నుండి న్యూయార్క్ బయలుదేరుతున్న పాన్ ఆమ్ -73 ఫ్లైట్ లోకి అబు నిదాల్ సంస్థకు చెందిన ఉగ్రవాదులు హైజాక్ చేశారు. అందులో 359 మంది ప్రయాణికులు, ఎయిర్ హోస్టెస్ ఉన్నారు. ఏం చేయాలో తెలిసిన పరిస్థితిలో అందరూ ఉన్నారు. ఆ సమయంలో తన ప్రాణాలకు తెగించి, భారతదేశానికి ఎయిర్ హోస్టెస్ 359 మంది ప్రాణాలను కాపాడింది. ఇదంతా జరిగి 29 ఏళ్ళయింది. ఆ ఎయిర్ హోస్టెసే నీరజా భానత్. ప్రస్తుతం బాలీవుడ్ లో బయోపిక్ సినిమాలపై ఆసక్తి చూపుతున్నారు దర్శక నిర్మాతలు.

కాగా ఇప్పుడు నీరజా భానత్ లైఫ్ ఆధారంగా, ఉగ్రవాదుల నుండి 359 మంది ప్రాణాలను కాపాడిన 23 ఏళ్ళ నీరజ భానత్ కథాంశంగా బాలీవుడ్ లో ” నీర్జా” సినిమా తెరకెక్కుతోంది. తాజాగా చిత్ర ట్రైలర్ విడుదలై అందరినీ అలరిస్తోంది. నీరజా భానత్ పాత్రలో బాలీవుడ్ యువ కథానాయిక సోనం కపూర్ టైటిల్ రోల్ ప్లే చేస్తోంది. ప్రముఖ ఫోటోగ్రాఫర్  అతుల్ కస్బేకర్ ఫాక్స్ స్టార్ స్టూడియో బ్యానర్ పై నిర్మిస్తుండగా, రామ్ మద్వాని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. రామ్ మద్వాని టేకింగ్, హైజాక్ చేసిన విజువల్స్ ని సూపర్బ్ గ తెరకెక్కించాడు. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చిత్ర ట్రైలర్ కు హైలెట్ గా నిలిచింది. ఇన్నిరోజులూ గ్లామర్ రోల్స్ లో అలరిస్తున్న సోనం, ఇందులో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలో కనిపించనుంది. కాగా 2016 ఫిబ్రవరి 19న వరల్డ్ వైడ్ గా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top